చిరు కానుక

మంద హాసాన్ని ఒలికిస్తూ
మంత్రా0గాన్ని  ఒంటిచేత  నడిపిస్తూ
మంచితనం తో  మందలిస్తూ...
మందగమనాన్ని అరికడుతూ...

బలహీనతలను బలపరుస్తూ...
బలాలను పటిష్టతరం చేస్తూ
అదిలిస్తూ ....ఆదరిస్తూ....
కంటికి రెప్పలా.. కాపాడుతూ..

పురపాలికా రంగంలో
కొత్త  ఒరవడులకు పునాది వేస్తూ..
తెలంగాణా రాష్ట్రాన్ని దేశంలో,
దేశ దేశాల్లో అగ్రగామిగా నిలబెడుతూ...

లెక్క లేని పురస్కారాలు..
లెక్కకు మించి ప్రశంసలు..
లెక్కకు  అందని ఆత్మీయత .
అభిమానాలను అందుకుంటూ..

నాలాంటి ఎంతోమందిని
చైతన్య పరుస్తూ...ప్రేరణ కలిగిస్తూ..
స్ఫూర్తినిస్తూ ..ఆదర్శ ప్రాయంగా నిలుస్తూ..
రాష్ట్ర అభివృద్ధిలో పురపాలికా రంగ
విభాగంలో  తనదైన ముద్ర వేసుకున్న

మా శ్రీదేవి మేడం కి మా చిరుకవితా  సుమాంజలి.

Comments

Post a Comment