tag:blogger.com,1999:blog-16252358764724223612024-03-14T01:01:18.294-07:00 Shanthi's(my) blogUnknownnoreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-1625235876472422361.post-45810502997384671712023-05-29T10:33:00.008-07:002023-05-31T08:47:29.824-07:00ఇంటిటా వంట మంట..
నాకు ఉదయాన్నే అతి క్లిష్టమైన కష్టమైన పని ఏంటి అంటే ఈ రోజు తినడానికి ఏం చెయ్యాలో ఎంత చెయ్యాలో, చేసింది ఎలా ఖర్చు చేయాలో డిసైడ్ చేయడం...
అవును మరి
"ఉప్పు తింటే ఉష్ణం పప్పు తింటే పైత్యం" ఈ సామెత మాకు చక్కగా సరిపోతుంది.

కాయల్లోకి మహారాజు వంకాయను, బచ్చలి కూరను మా అత్తగారు కాశీలో వదిలేశారు.కాబట్టి తినరు.ఆమె వదిలేస్తే ఇంటిల్లిపాది వదిలేసినట్టే.. అత్త పథ్యమైతే ఊరంతా ( ఇల్లంతా నే నాకు తెలుసు ) పథ్యం అని ఊరికే అనలేదు పెద్ద వాళ్ళు..అయినా సరే ఇవాల్టికి ఏ ఆకుకూర పప్పు చూసినా బచ్చలి కూరనానే అని ఇంట్లో ఉన్న వాళ్లందరినీ విడివిడిగా, కలిపి అడిగి కాదని కన్ఫర్మ్
చేసుకున్నా తినదు.
ఇక ఆలుగడ్డ వాతం ము ...(బూతు)కొడుకు. తల్లీ, కొడుకు ఇద్దరు మూకుమ్మడిగా తినరు. బెండకాయ అఖిల్ కు అసలు నచ్చదు. కాబేజీ కాలి ఫ్లవరా అబ్బా నాకు వద్దు.కాప్సికం మా వారికి నచ్చదు.

ఇంకా మాకు ప్రోటీన్ ప్రదాత అయిన పప్పు.. గట్టిగా ఉంటే నాకు నచ్చదు..నీళ్లగా ఉంటే మా అత్తగారికి నచ్చదు. కారం పొడి వేస్తే నాకు నచ్చదు. మిరపకాయలు వేస్తే ఇంట్లో వాళ్లకు నచ్చదు.
ఇక మా అత్తగారికి వయసు రీత్యా కాలక్రమేణా పళ్లు ఊడిపోయి...ఆరోగ్యం మందగించి ఏవీ నమలలేదు..అరిగించుకొలేదు. అన్నీ పేస్ట్ లా ఉంటే తప్ప మింగరావు..ఆగండి అయినా ఏవీ ఏ ఫార్మ్ లో ,టెక్ శ్చర్ లో ఉండాలో అలా ఉంటే తప్ప తిననంటారు..(ఎలా అబ్బా అలా? )
ఆవిడకి తన చిన్నతనం లో వాళ్ల అమ్మ గారు అత్తగారు ఏవీ ఎలా వండారో అవి తు.చ తప్పకుండా అలానే చెయ్యాలి.. సబ్స్టిస్టుశన్లు.. ఆల్ట్రేశన్లు... అక్సేప్టన్స్ ఉండవు ...ఒక వేళ కాకరకాయ తీపి కూరలో పచ్చి మిరపకాయలు పొడుగ్గా చీరి వేయించి వేయడం తను గానీ చూడక పోయినా,వాటిని మరోలా తరిగి వేసినా.. ముద్దగా వేయించి వేసినా..లేదా ఎండు కారం పొడి వేసినట్టు తనకు ఏ మాత్రం అనిపించినా .. టేస్ట్ ఎంత బాగున్నా ఎప్పుడు వాంతి అవుతుందో అన్నట్టు తింటారు తలకు చేయి పెట్టుకొని...

మావారికి పెళ్ళైన కొత్తలో ఎన్నో ఉండేవి. ఇప్పుడు మా పిల్లలు, ఆయన అమ్మగారి కోరికల ముందు ఆయనవి మరుగుజ్జు అయి పోయి గంగి గోవు లా తింటారు.వాళ్లు లేకపోతే మాత్రం విశ్వరూప సందర్శనం ఉంటుంది.

ఇంకా టిఫిన్ లు
అమ్మా ఇడ్లీ, దోశ లు వద్దు... వేరే ఏమైనా చేయి పుత్రుల కోరిక .

సరే పూరి ? ఆయిల్ ఫుడ్ వద్దమ్మ ఉదయాన్నే ..

హుమ్.. ఉప్మా.. ఒక విచిత్రమయిన భావాలతో చూసి.. పోని ఇవాళ టిఫిన్ వద్దులే అంటారు

రవ్వ కాదు రా..సేమ్యా ..వద్దు

అటుకులు లేదా మరమరాలు..నో ..

పోని రవ్వకలిపి దోశ .. సరే మరి దాన్లో కి పచ్చడి ? అల్లం వద్దు..కొబ్బరి.. అరగదు..
పల్లీ ..ఆ సరేలే ఈ రోజుకి !!
ఒక్కరోజు టిఫిన్ గండం గడిచింది.

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే అన్నం తినమంటే ఒక్కపూట అతి కష్టం మీద తినేవాళ్ళు. మన తెలుగు వాళ్లకు టిఫిన్ లు ఏం ఉంటాయి? ఇడ్లీలు, దోసెలు పూరీలు , ఉప్మా , పోహలాంటివి వాళ్ళకవి స్కూల్ కు వెళ్ళేలోపే మొహం మొత్తాయి..
కావాలంటే పాలు తాగి వెళ్తాం కానీ బ్రేక్ ఫాస్ట్ వద్దనే వాళ్ళు .
తర్వాత తర్వాత కాంటినేటల్ వంటలు ( అంత లేదులే ) నూడుల్స్, పాస్తా, సాండ్ విచ్, పిజ్జా ( ఏదో నాకు వచ్చినట్టు) లాంటివి ప్రవేశ పడ్డాయి. అవి కొన్ని రోజులే..

ఇప్పుడు రాత్రిపూట పచ్చ జొన్న రొట్టెలు లేదా పుల్క ప్రిఫర్ చేస్తారు మా వారు ( డయాబెటిస్ కాబట్టి) .. నాకేమో జొన్న రొట్టెలు ఒకేనే కానీ మరీ పచ్చవి కాదు.. తెల్లవి తింటా.. మావాడు చపాతీ లేదా పుల్కా మాత్రమే తింటాడు..మా కోడలు అన్నం ఇష్టపడుతుంది.
మా అత్తగారికి ఏది చేసినా( వడలు, జంతికల లాంటివి కూడా) మిక్సి లో వేసి పేస్ట్ చేసి చారు లో నాన బెట్టాలి కాబట్టి అది ఏదైనా పెద్ద తేడా ఏం లేదు ..

ఇక అన్నం ఏమో మాకు పొడి పొడిగా మా అత్తగారికి మెత్తగా మింగే విధంగా మా వారికి ముడిబియ్యం అన్నం..ఇలా మూడు రకాలు చెయ్యాలి..
ఇంత ప్రెషర్ లో ఇంట్లో వంట గురించి అష్టకష్టాలు పడి పెద్ద ప్లానింగ్, షడ్యులింగ్ లతో సతమతమవుతున్న నాకు సడన్ గా సుజాత గారి రూపంలో రిలీఫ్ దొరికింది నాకు, ఒకవేళ పాళ లేని “మునిసిపల్ కమిషనర్ “ ఉద్యోగం దొరకడంతో . ఈ వంటలు చేసి మెప్పించే కంటే గ్రూప్ 1 ఉద్యోగం సాధించడం సులభం అయ్యింది నా ప్రాణానికి...

అంటే ఆమె అన్ని అలవోకగా అలా ఎవరికేం కావాలో అలా వండి వార్చి పారేస్తుంది అని అనుకోకండి . కాదు.. నా కష్టాలన్నీ ఆమెకు అలా హ్యాండోవర్ చేసేసా నేను ఉద్యోగం టేక్ ఓవర్ చేయడం తోనే.
ఇప్పుడు ఎవరేం అన్నా, అనుకున్నా “సుజాత అంతకన్నా ఏం జేస్తుంది లే ఏదో తినండి. కాలే కడుపుకు మాడే గంజి ...అసలే వంటవాళ్ళు దొరికేది మహా కష్టం” అని సర్ది చెప్తా .
ఇపుడు చెప్పండి ఇది ఎంత క్లిష్టమో!!!
Unknownnoreply@blogger.com5tag:blogger.com,1999:blog-1625235876472422361.post-91801334778203290002023-05-29T10:30:00.003-07:002023-05-31T01:32:17.659-07:00కళ్యాణ వైభోగమే..

చిరంజీవులు అఖిల్, సంహిత కళ్యాణ వేడుకల సందర్భంగా నిశ్చితార్థం మొదలుకొని రిసెప్షన్ వరకు అత్యంత ఉత్సాహంగా, ఆసక్తిగా కలివిడిగా.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీలైన ..వీలు కాకున్నా చేసుకొని దూర ప్రయాణానికి రైళ్లలో, బస్సులో, కార్లల్లో, విమానాలలో, ( తిరుపతి లో) వెరవక , ఝడవక లగేజీ ఎత్తి దించడానికి వెనుదిరగక పాల్గొని ప్రతి వేడుకను సంప్రదాయ బద్దంగా మరియు కాలానుగుణంగా జరిగేందుకు తోడ్పడ్డ ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

రూములు సర్దుబాటు చేసుకొని..వీనుల విందైన పెళ్లి పాటలతో అలరించి..సమయానికి అందుబాటులో ఉండి అన్నిటికీ వెన్నుదన్నుగా నిలిచారు.
డబ్బు పేరు అధికారం గొప్పకాదు అని మన అనే విలువైన బంధువర్గాని మరేదీ సాటి రాదని మరొక్కసారి నిరూపించారు.

Special mention:
చంటి పిల్లవాడితో వందల కిలమీటర్లు కు వెరవక బెంగుళూరు - హైదరాబాద్ బెంగళూరు - తిరుపతి - బెంగుళూరు - హైదరాబాద్ - బెంగుళూరు తిరిగిన అన్నింటిలో పాల్గొన్న అనూష శ్రీనివాస్ వేదాన్ష్ కు...

సప్త సాగరాలు ,తెల్ల దొరల దేశాలు ,పిల్లల పరీక్షలు అన్ని అఖిల్ పెళ్లి ముందు బలాదూర్ అని వారం ముందే వచ్చిన మన వాళ్ళు,

పెళ్లికి ఎంతో ముందునుంచి సాంప్రదాయ పెళ్లి పాటలు సేకరించి నేర్చుకొని అద్భుతంగా అఖిల్, సంహిత కల్యాణమే వైభోగమే అని పాడిన గాన కోకిలలు,

పదిహేను రోజుల ముందునుంచి ఫలహారాలు చేద్దామని ..పెళ్లి పనులకు హడావిడిగా పెళ్లి ఇంట్లో కోలాహలం చేసి రక రకాల తిను బండారాలు చేసిన తోడికోడళ్ళు, ఆడపడుచులు, అత్తలు, చిన్నమ్మలు.

మంగళ స్నానానికి ఉల్లాసంగా పచ్చ బట్టలతో గులాబీ నీళ్లతో పెళ్లి కొడుకు వేడుకలు జరిపిన కుర్ర వర్గానికి,ఆశీర్వదించిన పెద్ద వాళ్లకు..
మధు పర్కాలు పసుపులో తడిపి తయారు చేసి.. పెళ్లికి మడి చారు చీరలు కొని కట్టుకొని మరీ హడావిడి చేసినవారందరికీ...

పందిరి పూజ దగ్గర్నుంచి వంతుల వారీగా పెళ్ళికొడుకుని చేసి పాలికలు సాగనంపే వరకు పాల్గొన్న వారందరికీ..
కాశీ యాత్రలో పెళ్ళికొడుకుకు మొదట పెళ్లి ముఖ్యమా, విద్యాన్వేషణకై ప్రపంచ యాత్ర ముఖ్యమా అని సంశయానికి సరైన సలహా ఇచ్చి..జంటకి దృష్టి తీసి పీటల పైకి ఆహ్వానించిన వారందరికీ...

వివాహం అనుకున్న రోజు నుంచి అన్నిటినీ అందరినీ కలుపుకొని.. పూజా సామాగ్రి మొత్తంతయారు చేసి.. విస్తర్లు..వేసి....తీసి..( ఎంత చెప్పినా వినకుండా) ఇది నా పని ఇది కాదు అని చూడకుండా అన్ని.. అంతా తానై నిలిచిన సత్యా సమేతుడైన ప్రసన్న అన్నకు ...

వెనకటి మాదిరిగా వంటలు ఇంట్లో చేయకున్నా, వచ్చిన వంటల్ని అందుకుని అందరినీ సాదరంగా ఆదరించి..కొసరి కొసరి వడ్డించి పంపించిన వారందరికీ...
మడి వంటలు చేసి స్వాములను సంతుష్టు లను చేసి పుణ్యం సంపాదించిన వారికి..
ఊర్లు/ రాష్ట్రాలు/సప్త సాగరాలు దాటి, పిల్లల చదువులు..ఉద్యోగ భారాలు కొంత పక్కన పెట్టి..అన్ని వేడుకల్లో తల్లో నాలుకలా పాల్గొన్న వారందరికీ....ఎంత చెప్పినా తక్కువే ,ఎంత చేసినా తక్కువే..
#wedding
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-1625235876472422361.post-48819614394360906772023-04-16T08:36:00.002-07:002023-04-16T21:22:28.419-07:00shakuntalam movie Review
సమంత అంటే ఉన్న అభిమానం తో శాకుంతలం రిలీజ్ ఎప్పుడు అని చూసి చూద్దామా అని నేను సంహిత అడిగితే ఒక పక్క మా అఖిల్ మరో పక్క సాత్విక్ ఛీ, ఛీ అయ్యో ఆ సినిమా నా మేము రాము అస్సలు బాలేదట..మీరు వెళ్ళకండి అనిపించుకుని .. అన్ని రివ్యూలు చదివి అసలు బాలేదనిపించుకొని...అయితే తప్పకుండా వెళ్లాల్సిందే అనుకుని మరీ వెళ్ళాం నేను మా కోడలు.. 🙂 కట్ చేస్తే ఇంతకీ సినిమా ఎలావుందీ??

ఆదివారం... సిన్మా రిలీజ్ అయి రెండు రోజులే అయ్యింది. అయినా థియేటర్ లో కింద 7 వరుసలు ఖాళీ.. పైన మాత్రం అందరూ వచ్చారు. మొదటి సగం సాగదీసి, సాగదీసి..కష్టపడి అలా అలా గడిచిపోతుంది.. మిగిలిన సగం లో టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉంటుందేమో అని తెచ్చుకున్న ఉత్సాహంతో... అలా బయటికి వెళ్లి వచ్చేసరికి సినిమా మొదలయింది.. మేమాశిన్చిన మలుపులు ఎక్కడ మిస్సవుతామో అని పై వరకు వెళ్లకుండా మూడో వరుసలో కూర్చుని తలెత్తుకొని గర్వంగా చూడటం మొదలు పెట్టాం. మొదటి సగం కంటే రెండో సగం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా కథ సాగుతుంది.. కానీ అశ మాత్రం నిరాశే అయ్యింది.

సినిమా మొత్తం మీద అల్లు అర్హ ఆరంగేట్రం ( ఇదే మొదటి సినిమా అనుకుంటున్న, నాకు సరిగ్గా తెలియదు.) మాత్రం అదిరిపోయింది. ముద్దు ముద్దుగా చక్కగా నటించింది. స్నేహ అర్జున్ దిష్టి తీసారో లేదో అల్లు అర్హ కు.

విజువల్స్ ..వి ఎఫ్ ఎక్స్ లాంటి పెద్ద విషయాలు నాకు తెలియవు ..కానీ సినిమా అంతా నేను ఇన్స్తాగ్రామ్ రీల్స్ లో వాడేవే ఎఫెక్ట్స్ ఉన్నాయి పాపం.😀😀

చాలా అందమైన కావ్యంగా హృద్యంగా, సుతిమెత్తగా..హృదయాన్ని మెలిపెట్టెలా ( వాళ్ళ ఎడబాటు) మళ్ళీ హత్తుకునేలా చూపించడమే కాకుండా దుష్యంతుని వీరుడిగా , నిర్ణయాత్మకంగా, సమర్థుడిగా,నిష్పక్షపాతంగా, ఉదారంగా, గాఢ ప్రేమికుడిగా..దృఢంగా చూపించి ఉంటే చాలా బాగుండేది. కేవలం అందంగా మాత్రమే ఉంటే సరిపోదని కారక్టర్ బిల్డ్ చేస్తే ఒక వ్యక్తి కి అందం వస్తుందని అనిపిస్తుంది. ఒక అద్భుత ప్రణయ గాథ ను ఇంత పేలవంగా కూడా చేయొచ్చని తెల్సుకుని ముందు వరుసలో కూర్చున్నoదుకు చూసేందుకు వీలుగా ఎత్తుకున్న తలను కూడా దించుకొని బయటకు వచ్చేశాం..

సినిమా బాగుంటే చూడ్డం కాదు బాలేనప్పుడు ఎందుకు బాలేదో చూడడమే గొప్ప అనే మా కజిన్ అన్న మాటలకు కట్టుబడి సినిమాలో ఏమే మి చేయకూడదో క్షుణ్నంగా తెలుసుకొని పోన్లే 24 కళల కళాకారులకు న్యాయం చేసామనుకొని సర్ది చెప్పుకొని మళ్ళీ తలెత్తుకున్నాం..నేను సంహిత.

తేలిపోయిన శాకుంతలం.
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-1625235876472422361.post-15955310126100184792022-11-22T06:07:00.001-08:002022-11-22T06:07:53.534-08:00సాధించాలి!!!!
అందుకోవాలనుకున్నవన్నీ అందలమెక్కితే..

ఆలోచనలన్నీ అల్లిబిల్లి ఆసనాలిస్తే..

పలకాలనుకున్నవి పందిరికింద పడకేస్తే..

అడగాలనుకున్నవి తడబడి అలంకారాలైతే..

రాయాలనుకున్నది రానంటూ రాగం తీస్తే..

వెతకాలనుకున్నది వెనకే వేళ్లునుకుపోతే..

నడవాలనుకున్న నడత నక్కి దాక్కునిపోతే...

నవ్వాలనుకుని నవ్వు రాక నాగా పెడితే ...

చెందాలనుకున్నది చెంత రాక చేవగారిపోతే...

చేయాలనుకున్నది చేతగాక చంచలించిపోతే...

ఎక్కాలనుకున్న ఎత్తు మొదలు మూసుకుపోతే...

మార్గాన్ని వెంటనే అన్వేషించాలి..!

గమ్యం చేర్చే రహదారిని శోధించి సాధించాలి...!!

గగనానికి గాలం వేసైనా సరే అందుకోవాలి..!!!
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-1625235876472422361.post-12210458251575432002022-07-06T10:19:00.006-07:002023-04-16T21:21:36.700-07:00విరాట పర్వం… ఏంటో దర్శకుడి ఆరాటంవిరాట పర్వం- సినిమాపేరు చూసి అందులో నటులను (సాయి పల్లవి , రానా ,ప్రియమణి , నవీన్ చంద్ర , మురళీ శర్మ, నీవేథా పేతురాజ్ లాంటి) చూసి , నక్సలిజం బేస్ ఉందని తెలుసుకొని ఓ రేంజ్ లో ఊహించుకొని (అయినా థియేటర్ లో చూడలేదు అదృష్టవశాత్తూ) ఓ టి టి లో చూసి ఇంకా డైజెస్ట్ కాక అసలు దర్శకుడు ఏం అనుకున్నాడో... ఏం తీసాడో ఇంకా అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నా.
నేను మాములుగా ఏ సినిమా గురించి పెద్దగా ఆలోచించను... చూసామా..బాగుందా , బాలేదా అంతే ..ఒక్క వారం దాటిందంటే సగం, నెల దాటిందంటే మొత్తం కొన్ని సార్లు సినిమా పేరు తో సహా మర్చిపోతా.
కానీ ఈ సినిమా మాత్రం మొత్తానికి ఆలోచనలో పడేసింది. నక్సలిజం ఉన్నప్పుడు ఓ సింధూరం లా ఉత్ఖంఠతో... హీరోయిజంతోనో... హీరోయినిజంతోనో...ఉంటాయనుకుంటే పొరపాటే... అలా అని మొత్తం లవ్ స్టోరి కాదు. లవ్ స్టోరీ కి బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతున్న సంఘటనలకి పొంతన ఉండదు... బాక్ గ్రౌండ్ స్కోర్ కు యాక్షన్ సీక్వెన్స్ కు అస్సలు మ్యాచ్ అవ్వవు. నేపథ్య సంగీతం దానంతకు అది బాగుంది. సినిమా స్క్రీన్ ప్లే దానంతకు అది నడుస్తుంటుంది. ఎక్కడ పొసగవు. చాలా మిస్సింగ్ లింకులు ఉన్నాయి. హీరోయిన్ కు హీరో పై ప్రేమ ఎందుకు,ఎలా కలిగిందో ఎలా చెప్పలేకపోతుందో... మనకు ఈ సినిమా లో ఏం ప్రాబ్లమ్ ఉందో అలానే చెప్పలేం..కొన్నింటికి కారణాలుండవు.
సాయి పల్లవి నడదైన శైలి లో నటన తో కుమ్మేసింది. రానా కు పెద్ద రోల్ లేదు ఉన్నంతకు బాగా చేసాడు. రానా కే ఇలా ఉంటే ఇంక ప్రియమణి.. నవీన్ చంద్ర సంగతి చెప్పక్కర్లేదు.. నాలుగైదు సీన్లు.. నీవేథా కు గెస్ట్ రోల్ మాత్రమే(బ్రతికి పోయింది) .. బాగా లాగ్ సీన్లు చాలా ఉన్నాయి తెలుగు టి వి సీరియల్స్ లాగా..
వెరసి చూస్తే ఇలాంటి సినిమాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు... ఆశ్చర్య పోవచ్చు...Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-1625235876472422361.post-47546995852547198552022-05-29T10:01:00.008-07:002022-07-06T10:21:21.508-07:00మేఘాలయాలో మేఘాల్లో విహరిద్దాం (Scotland of the East - Meghalaya)

సెవెన్ సిస్టర్స్ అని పేరు గాంచిన ఏడు ఈశాన్య రాష్ట్రాలు ఇతర భారత భూభాగానికి కాస్త ఎడంగా (మధ్యలో బంగ్లాదేశ్ చొచ్చుకొని రావడంతో) తక్కువ కనెక్టివీటి తో ఉన్నందు వల్లనో లేక కొండలు గుట్టలు లోయలు లాంటి కఠినమయిన భౌగోళిక స్వరూపం తో ఉండటం మూలానో ఇంకా ఈ (అ) సభ్య సమాజం బారిన పడలేదు.

సహజ వన్యప్రాణి సంపద, అందమైన ప్రకృతి, అడవులు, పర్వత శ్రేణిలు, లోయలు స్వచ్ఛమైన, అమాయక మనుషులు, అందమైన లెక్కపెట్టలేని, వెలకట్టలేని జలపాతాలు, చెట్టు , చేమ ,పుట్ట ,పూవు మేఘాలయ సొంతం.

నార్త్ ఈస్ట్ ఎప్పట్నుంచో బకెట్ లిస్ట్ లో ఉన్నా ప్రయాణం ఇన్నాళ్లకు కుదిరింది.

7 రోజులు రాను పోను కలిపి. చెన్నై నుంచి ముగ్గురు, మైసూర్ నుంచి ఇద్దరు హైదరాబాద్ నుంచి ఇద్దరు మొత్తం 7 మందిమి బయలుదేరాము . ( 7 లక్కీ నంబర్ లాగుంది ఇప్పుడే తట్టింది 🙂) గౌహటి(అస్సాం) లో లోకప్రియ గోపీనాథ్ బోర్డోలాండ్ ఇంటర్నేషల్ ఎయిర్పోర్ట్ లో దిగాము. అక్కడినుంచి షిల్లాంగ్ ( మేఘాలయ రాజధాని మరియు ఆ రాష్ట్ర సెంటర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు) కేవలం 100 కి మీ మాత్రమే. ఒక హోటల్ లో లంచ్ చేసుకొని గౌహతి నుంచి దాదాపు సాయంత్రం నాలుగు గంటలకు షిల్లాంగ్ కు బయలుదేరాము.

షిల్లాంగ్ ఒక ఊటీ లాంటి హిల్ స్టేషన్ . ఇరుకు దారులు వాటి వెంబడి లోయల్లోకి అనుకున్న దుకాణాలు భవనాలు కనిపిస్తాయి. అక్కడ విపరీతమైన వర్షాలు కాబట్టి టూ వీలర్లు తక్కువ. అన్ని టాక్సీలు ,కార్లు విపరీతమైన ట్రాఫిక్ జామ్. మన హైద్రాబాద్, బెంగుళూరుకు ఏ మాత్రం తీసిపోదు ట్రాఫిక్ జాంలకు. ఇక్కడ రెయిన్ కోటో లేక గొడుగో లేకుంటే బయటకు వెళ్లలేం. ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేం.

మేఘాలయ గారో, ఖాసి, మరియు ఝాన్తియా మూడు పర్వత శ్రేణులు ముఖ్యమైన

మూడు తెగలు ఉన్నాయి. ఖాసి (33%) గారో (30%) ఝాన్తియా (10%) ఉన్నారు. మిగిలినవి చిన్న చిన్న తెగలు. వింత ఏమిటంటే ఈ రాష్ట్ర అధికారిక భాష ఇంగ్లీష్. 74% ప్రజలు క్రిస్టియానిటి పాటిస్తారు. ( బ్రిటీషర్స్ కాలంలో జరిగిన మిషినరీస్ కన్వెర్షన్స్ వల్ల.)

ప్రపంచంలో నే మాతృస్వామ్యాన్ని ఇంకా పాటిస్తున్న అతి పెద్ద ప్రాంతాల్లో ఒక్కటి మేఘాలయ. ఇక్కడ తల్లులు ఇంటి పెద్దలు. చిన్న కూతురికి వారసత్వ ఆస్తులు మరియు బాధ్యతలు సంక్రమిస్తాయి. పెళ్ళితర్వాత అబ్బాయి అమ్మాయి ఇంటికి రావాలి. అమ్మాయి ఇంటిపేరు ఉంటుంది. ఇవన్నీ ఆర్యుల కాలంలో, శాతవాహన కాలంలో విన్నాం కానీ ఈ కాలంలో వింత గా అనిపిస్తుంది.

మొదటి రోజు షిల్లాంగ్ చేరడానికి రాత్రి ఆరున్నర పైనే అవడం అక్కడ అప్పటికే చీకటి పడటం జరిగిపోయింది. అందుకే కొంచెం ప్లాన్ మార్చాము.

1.మొదటి రోజు:

పోలీస్ బజార్ :ఇది మన కోఠి లాంటి మార్కెట్. చవకలో బట్టలు, బాగులు, ఉలన్ తో అల్లిన కోట్లు , స్వేటర్లు, రాక రకాల పళ్ళు, హ్యాండి క్రాఫ్ట్స్ ( బాంబ, కేన్, ఫైన్ పూలతో చేసినవి ) అక్కడ నేసిన శాలువలు, మఫ్లర్లు, ఇంకా చాలా దొరుకుతాయి. ఆ వీధిలో చాలా హోటల్స్, రెస్టారెంట్లు కూడా ఉంటాయి. నాకు చాలా నచ్చిన విషయం. పూల మొక్కలు వీధిలో చక్కగా పెంచేసి పైన వీధి దీపాల కుడా వేలాడేశారు. ఎంతో అందంగా ఉన్నాయి. చిన్నగా షాపింగ్ చేసుకొని రిసా కాలనీ లో హోం స్టే కు వెళ్ళాం. కర్రతో కట్టిన మేఘాలయ సంప్రదాయ ఇల్లు అది. నాల్గు బెడ్ రూమ్ లు లివింగ్ రూమ్ కిచెన్ తో అందంగా ఉంది.

2. రెండవ రోజు:

ఉదయాన్నే 3 గంటలకు మెలకువ వచ్చింది చూద్దుము గదా మొత్తం తెల్లవారింది. ఆరు గంటల నుండి

వదలకుండా జిన జిన వాన. అరే ఎలా అనుకొని చివరకు 11కు వర్షం లోనే రైన్ కోట్( పాంచో) వేసుకుని బయలు దేరాం సెక్రెడ్ ఫారెస్ట్ కు .

సెక్రెడ్ ఫారెస్ట్ - మాఫ్లాంగ్ గ్రామo లో ఉన్న 80 హెక్టార్ల లో ఉన్న అతి సుందరమైన , దట్టమైన అటవీ ప్రాంతం. అందులో రుద్రాక్ష, పైన్, ఔషధ గుణాలున్న చాలా చెట్లతో పచ్చగా ఉంటుంది.

ఖాసి తెగ ప్రజలు ప్రకృతి మాత ను పూజిస్తారు. వారి కట్టుబాట్లు నియమాల ప్రకారం ఆ అడవి నుంచి పూచిక పుల్ల కూడా తీసుకెళ్లనివ్వరు. అలా తీసుకెళ్తే వారికి చెడు జరుగుతుందని నమ్ముతారు. మా గైడ్ జాన్ ఖాసి ప్రజల గురించి చాలా విషయాలు చెప్పాడు. అక్కడ వారికి ఆలయాలు విగ్రహారాధన ఉండదు. నిలువు రాళ్లు మగ అడ్డం రాళ్లు ఆడ వారికి ప్రతిరూపంగా పెడతారు అంతే.

ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్:అక్కడ్నుంచు ట్రెక్కింగ్ మరియు గుహలు వెళ్లాల్సి ఉంది కాని వర్షం కారణం గా మూసివేశారు కాబట్టి ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ లేదా త్రి స్టెప్ వాటర్ ఫాల్స్ చూసాం . ఆవేశం గా కొండల మధ్యలోంచి ఉబుకుతూ, ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న ఆ మూడు అంచెల నీళ్ళు ను చూస్తే కొంచెం భయంగా చాలా నూతనోత్సాహం గా అనిపించింది.

వార్డు లేక్. సిటీ మధ్యలో ఉన్న వార్డ్స్ లేక్ చిన్న సరస్సు. పార్కు మధ్యలో ఉంటుంది. బోటింగ్ ఉంటుంది కాసేపు సేదదీర్చుకోవచ్చు. ఉమ్యాం నది వ్యూ పాయింట్ కూడా చూసాం.

3.మూడవ రోజు:

పే పే వాటర్ ఫాల్స్: మేఘాలయా మొత్తాన్ని షిల్లాంగ్ లో ఉండి రోజూ వెళ్లి వచ్చి చూడవచ్చు. లేదా అక్కడి ప్రదేశాలు కొంచెం తనివితీరా ఆస్వాదించాలంటే ఆ యా గ్రామాల్లో బస చేయవచ్చు. దాదాపు ప్రతి టూరిస్టు స్పాట్ లో హోమ్ స్టే లు ఉంటాయి. మేము రెండో పద్దతి తీసుకున్నాం. షిల్లాంగ్ నుంచి మైలన్ గాంగ్( అతి శుభ్రమైన గ్రామం) మరియు రివాయి గ్రామము లోని లివింగ్ రూట్ బ్రిడ్జ్ కు బయలు దేరాం. దారిలో పే పే వాటర్ ఫాల్స్ కు వెళ్ళాం. అతి వర్షాల కారణం గా ఆ జలపాతానికి చాలా దూరం లో మా వాహనం ఆపారు.

చుట్టూ ఆకు పచ్చని పచ్చిక బయళ్లు. వాటి అంచుల్లో ముదురు ఆకుపచ్చ కొండలు మధ్య మధ్యలో తెల్లని జలధార లు. వాటికి జల జల మంటూ నీళ్లు హోరుమంటూ గాలి నేపథ్య సంగీతం (బాక్ గ్రాండ్ స్కోర్) లా వినిపిస్తుంది. అసలు భూమి మీద స్వర్గం అదే అనిపించింది. దాదాపు 5 కి మీ రాను అంతే పోను ట్రెక్కింగ్ చేస్తూ ఆ సహజ ఆవిష్కరణ ను చూసాం. అది ఒక మినీ నయాగారా అని చెప్పవచ్చు. తిరిగి వచ్చేప్పుడు ఆకాశానికి చిల్లు పడ్డట్టు ఒకటే వాన మొదలయ్యింది . దానికి దగ్గరలో ఉన్న ఒక రిసార్ట్ లో వర్షం తగ్గేవరకు ఆగి అక్కడే భోజనం చేసి అలాగే బయలు దేరాం రివాయి గ్రామానికి.

దారి మొత్తం ఘాట్ రోడ్డు.. దారి పొడుగునా దట్టమైన పొగ మంచు ఒక రెండు మీటర్ల అవతల ఉన్నవి కూడా ఏమి కనిపించవు. జాగ్రత్తగా అతి నెమ్మదిగా రాత్రి తొమ్మిది గంటలకు చేరాము. అప్పుడే నిర్ణయించుకున్నాం..సాయంత్రం ఐదు వరకు ఖచ్చితంగా రూమ్ కు చేరు కోవాలి రోజు అని.

4. నాల్గవ రోజు:

రివాయి - మైలన్ గాంగ్ :రివాయి ఒక చిన్ని గ్రామం. ఇక్కడ ఏ క్షణం ఏ మూలలో ఫోన్ సిగ్నల్ ఇంటర్నెట్ వస్తుందో చెప్పడం చాలా కష్టం. విపరీతమైన వర్షం లేదా పొగ మంచు. ఇక్కడ ఉంటే దాదాపు బయట ప్రపంచంతో సంబంధాలు శూన్యం అని చెప్పవచ్చు.మర్నాడు ఉదయం నిద్ర లేవంగానే టీ లు తాగి ఆ పచ్చని ప్రకృతి లో అలా నడుచుకుంటూ బ్రతికి ఉన్న చెట్ల వేర్ల తో తయారు చేసిన లివింగ్ రూట్ బ్రిడ్జి కు బయలు దేరాం. అన్ని రకాల పూల, పళ్ళ మొక్కలు కొండలు జలపాతాల మధ్య అలా నడుస్తూ వెళ్తుంటే మనకు అవతల మరో ప్రపంచం ఉందని కానీ, మనకు మొబైల్ కనెక్షన్ లేదని కానీ ఏమీ గుర్తు ఉండదు. వేగపడక పోతే తమకేదో కొంప మునుగుతున్నట్టు హడావిడిగా ప్రవహిస్తున్న జల పాతం పైన చక్కటి జడ అల్లినట్టుగా మర్రి చెట్టు ఊడలను ఇటు ఇటు నుంచి అటు వెళ్ళడానికి అనువుగా అల్లారు. ఎంతో ఆశ్చర్యంగా అబ్బురంగా అనిపించింది.

అక్కడినుంచి మా వాహనం లో మైలనగాంగ్ గ్రామం కు వెళ్లాo. (2 కి మీ దూరం అక్కడికి) ఆసియా లో నే అతి స్వచ్ఛమైన గ్రామము ఇది. చక్కటి రోడ్లు ఇరువైపులా చెట్లు, చూడముచ్చటగా ఉన్న ఇళ్లు అక్కడి ప్రజలు. మరియు యాత్రికులతో సందడిగా ఉంటుంది.ఇక్కడ పొగ, ఆల్కహాల్, డ్రగ్స్ గొడవలు పడటం నిషేధం. ఇక్కడ ఒక ట్రీ హౌస్ పై నుంచి ఆ సుందర ప్రదేశం అంతా చూడొచ్చు. బాంగ్లాదేశ్ గ్రామాలు, బార్డర్ కనిపిస్తుంది .

ఆ తర్వాత అక్కడునుంచి సోహ్ర (చిరపుంజి భాగాలు దేరాం). మేఘాలయాలో ఎక్కడ ఏ మూల ప్రయాణించినా స్వర్గం లో విహరిస్తున్నట్టు ఉంటుంది. మధ్యలో నర్తియాంగ్ మోనోలిత్ పార్క్ మరియు ప్రాచీన మైన దుర్గా దేవి గుడి ఉన్నాయి.

5. అయిదవ రోజు:

సోహ్ర లేదా చిరపుంజి కొంచెం పెద్ద మరియు పురాతన దర్శనీయ ప్రాంతం. ఇక్కడ ఆరేంజ్ రూట్స్ అని ఒక శాకాహార భోజనశాల ఉంటుంది. అక్కడ మనకు అన్ని దొరుకుతాయి. భూగోళ శాస్త్ర ప్రకారం 400 మీ మీ వర్షపాతం ఉంటే అత్యధిక వర్షపాతంగా భావిస్తారు. అల్లాంటిది ఇక్కడ 12000 మీ మీ సగటున సంవత్సరానికి నమోదు అవుతుంది. అంటే ఇంకా ఏముంటుంది...దాదాపు సాయంత్రం 5 నుండి ఉదయం 11 వరకు ఆగని దారపాతపు వర్షం. చాలా తక్కువ సమయం బయట చూడగల్గుతాము.

మరుసటి రోజు ఉదయాన్నే డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జి కు ట్రెక్కింగ్ కు బయలు దేరాం. కొండలకు చిల్లులు పడ్డట్టు ఈ కొండకు చూసిన జల పాతాలే. గోధుమరంగు కొండకు ఆకు పచ్చని చెట్లు తెల్లని జల ధరల ప్రవాహాలు...చూడ తనివి తీరదు. దాదాపు 3600 మెట్లు దిగి కిందకు అట్టడుగున అల్లంత దూరంలో ఉన్న డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఒక గైడ్ సాయంతో చూసి సాయంత్రం నాలుగు వరకు రూమ్ కు చేరుకున్నాం. మధ్యలో ఒక వ్యూ పాయింట్ ,జిప్ లైనింగ్, ఒక మార్కెట్ ఉంటాయి.

ఈ ట్రెక్కింగ్ సహజ అడవుల్లో పురుగు, పుట్ట ,ఆకు,పోక చూస్తూ వెళ్లి వస్తాం.

6. ఆరవ రోజు:

మర్నాడు నౌకాలఖి జలపాతం చూడ్డానికి వెళ్తే మబ్బులు మా కళ్ళ ముందే జలపాతాన్ని కప్పేసి అక్కడేం లేదు అన్నట్టుగా చేసే సుందర దృశ్యాన్ని వీక్షించాము. ఆర్వా గుహలని మన బెలూమ్ ,బుర్ర గుహాలలా లోపల అంతస్తులతో జలపాతాలతో గోడలపై పురాతన కాలం. నాటి శిలాజలతో ఉంటుంది . ఇంకా అక్కడ డైథిలిన్ ఫాల్స్, మైసమై గుహలు కూడా ఉంటాయి. ( చాలా జలపాతాలు ఉంటాయి).

గార్డెన్ ఆఫ్ కేవ్స్- కాబ్రి కి సింరంగ్: దారిలో హై వే కి కొంచెం లోగా వెళ్తే ఈ గుహలు జలపాతాలు చూడవచ్చు. ఏంతో ప్లానింగ్ తో ఇక్కడ దాదాపు ఒక పది కి పైగా రకరకాల సైజుల జలపాతాలు.. గుహలు చాలా మంచి అనుభూతినిస్తాయి. ఓషధ గుణాలన్న ఒక చిన్ని జలపాతం కూడా ఉంది. ఆ నీళ్లు తాగితే అన్ని జబ్బులు తగ్గి ఆరోగ్యం గా ఉంటారని నమ్మకం. మా తిరిగు టపా చివరి రోజు గౌహతి లో కొంచెం చూద్దామని షిల్లాంగ్ కు దగ్గరగా ఉన్న మైలాంగ్ గ్రామంలో రాత్రికి బస చేసాం. ఇక్కడ ఒక ఎకో పార్క్(సూర్యాస్తమయం చూడొచ్చు), నది ఉన్నాయి.

7. ఏడవ రోజు:

ఉదయాన్నే 5 గంటలు గౌహతి బయలుదేరి బ్రహ్మపుత్ర నది చూసాం. ఫెర్రి లో మధ్య ఓ ఒక ద్వీపం లో ఉన్న ఉమానంద గుడి చూడాలనుకున్నా, అస్సాం లో బ్రహ్మపుత్ర వరదల కారణంగా అనుమతించలేదు. సుప్రసిద్ధమయిన శక్తిపీఠం కామాఖ్య దేవి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ తక్కువ లో తక్కువ 4 గంటల సమయంపడుతుంది. లేదా కొన్ని నెలల ముందే దర్శనం బుక్ చేసుకోవాలి. కోరికలు తీర్చే దేవత గా ప్రసిద్ధి. ఆ తర్వాత కొంచెం దూరం లో ఉన్న బాలాజీ గుడి కూడా దర్శించుకొని ఎయిర్ పోర్ట్ బయలు దేరాం.

విపరీతంగా ఉన్న వర్షాల కారణం గా సెవెన్ సిస్టర్ లేక్స్, వాటర్ ఫాల్స్, ప్రపంచంలో నే అతి స్వచ్ఛమైన నది (డౌకి ) చూడలేక పోయాం.

Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-1625235876472422361.post-45461817109066393052022-01-22T19:21:00.003-08:002022-04-17T06:27:31.420-07:00అఖండ (Akhanda)

బోయపాటి శీను, బాలయ్య సినిమా చూడాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి... బాలయ్య బాబు కు లేదా సినిమా కు హార్డ్ కోర్ ఫాన్ అయి ఉండాలి.. లేదా ఎలాంటి పరిస్థితులను తట్టుకునే దమ్ము ధైర్యం ఉండాలి.. లేదా అన్నింటిలో కామెడీ చూసి నవ్వు కునే నేర్పు ఉండాలి.

నీరు, నేల, గాలి వెరసి ప్రకృతి ని కాపాడాలి మెసేజ్ మాత్రం ఇప్పుడు చాలా అవసరం, నాకు నచ్చింది. జగపతి బాబు, శ్రీకాంత్ బానే కష్టపడ్డారు. ఐఏఎస్ ,ఐఎఫ్ ఎస్ ఆఫీసర్ లను (అందులో విమెన్ ను) చాలా దయనీయంగా చూపించారు.

విలన్లను అఖండ ఆయుధాలతో భయపెట్టక్కర్లేదు క్లోజ్ అప్ లో ముఖం లో ముఖం పెట్టి చూస్తేనే భయమవుతుంది , వీక్ వాళ్లయితే చచ్చి కూడా పోతారు.

61 ఏళ్ల వయసులో బాలయ్య స్టెప్పులు (ఏ మాత్రం ఫిట్నెస్ లేకపోయినా ఏమో అని నేను అనుకుంటున్నాను) బానే వేసాడు. మురళి కృష్ణ ( నార్మల్ హీరో విత్ హీరో మేక్ అప్) కు అఖండ కు వయసు తేడా స్పష్టం గా కనిపిస్తుంది లేకపోయినా. అఘోరాలు, అద్భుత శక్తులు నచ్చిన వాళ్లకు నచ్చుతాయి.

బాలయ్య , బోయపాటి అభిమానులకు ఏ మాత్రం నిరాశ కలగదు. హీరోయిన్ పాత్ర గురించి చెప్పడానికి ఏం లేదు.

జై జై జై జై జై బాలయ్య.

నోట్: నేను unstoppable కు వీరాభిమానిని.
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-1625235876472422361.post-65351171159552843992021-12-26T09:19:00.002-08:002022-04-17T06:41:24.250-07:00పుష్ప (ద రైజ్) Pushpa the rise review

సినిమా ను ఒక్కొక్కరు ఒక్కో కోణం లో ఒక్కో దృష్టి తో చూస్తారు. అంతేకాక తొంభై శాతం ప్రేక్షకులు నా లాంటి సామాన్యులు... రెండు లేదా రెండున్నర గంటల టైంపాస్ (బ్రేక్) కోసం చూస్తారు. అది ఎలాంటి భావోద్వేగాలతో కూడినదైనా మనల్ని సీట్ లో నుంచి కదలకుండా కూర్చోబెడితే చాలు. కొన్ని సస్పెన్స్, కొన్ని వినోదాత్మకంగా, కొన్ని స్ఫూర్తి నిచ్చేలా, కొన్ని గుండెలు మెలిపెట్టేలా.. ఉండొచ్చు. కొన్ని సినిమాలు వాటి పాత్రలు కానీ సన్ని వేషాలు కానీ కొన్ని రోజుల వరకు మన పై ప్రభావం చూపిస్తాయి. కొన్ని చూసినంత సేపు బోర్ కొట్టకుండా ఉండొచ్చు తర్వాత మరుపుకు రావొచ్చు.

నా వరకైతే పుష్ప హిట్. అల్లు అర్జున్ నటన..ఆ పాత్ర మలిచిన తీరు...గట్టిగానే ఉన్నాయి. గంధపు చెట్ల అడవుల బ్యాక్ గ్రౌండ్...చిత్తూరు యాస, చిన్నతనంలోనే అనాదరణకు గురై తెగింపు మొండి ధైర్యం తో పెరిగిన పల్లె ప్రాంతానికి చెందిన హీరో... బుద్ధి బలం, కండ బలం, మొండితనం తో ఎలా ఎదిగాడు అన్నది కథ. ( మార్గం ఏదని మంచి చెడుల గురించి కాదు)

హీరో సిండికేట్ గా ఎదగడం..కొంచెం సినిమాటిక్ గా ఉన్నా ఎబ్బెట్టుగా ఏం లేదు. వయోలెన్స్ ఇప్పుడు వస్తున్న సినిమాలను చూస్తే ఓ లెక్కే కాదు. రష్మీక తన వరకు బానే ప్రయత్నించింది. అనసూయకు, సునీల్ కు ఎక్కువ నిడివి లేదు. ఉన్నంత వరకు బానేచేశారు. ఫాజిల్ కు బహుశా రెండవ పార్ట్ లో ముఖ్య పాత్ర వుండొచ్చు.

చంద్ర బోస్ కలం లో నుంచి అలవోకగా జారిన పాటల మాయాజాలం..దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి(సిద్ శ్రీరామ్) .."ఊ అంటావా"... సూపర్ హిట్.. మిగిలిన రెండు పాటలు కూడా సినిమా చూశాక వినాలనిపిస్తాయి.డిఎస్పీ సుకుమార్ కాంబినేషన్ మళ్ళీ కలిసొచ్చింది.

ఎడిటింగ్, బాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం బాగా చెయ్యొచ్చేమో...మొత్తం మీద బానే ఉందమ్మి.... వేరే సినిమాలతో పోల్చి చూడొద్దు. దేనికదే..

My rating 3/5
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-1625235876472422361.post-72183520186031375832021-10-06T07:14:00.008-07:002022-04-07T01:07:39.268-07:00 నా చేతి వంట -(కూటు - మోర్ కొళంబు)

ఈ రోజు నా చేతి వంట ...ఈ రోజే కాదు గత పది రోజులుగా నా చేతి వంటనే... అంటే నాకు వంట రాదని కాదు. నేను చేయనని కాదు. పెళ్ళైన దగ్గర్నుంచి ఇరవై ఏళ్ళ పాటు రెండు పూటలు రెండేళ్ల పాటు ఒక పూట నేనే వంట చేసాను. గత నాలుగైదు ఏళ్లనుంచి నాకు వంట నుంచి ఉద్యోగ బరువు బాధ్యతల నెపం తో తెరపి దొరికింది. మా అమ్మ వాళ్ళింట్లో ఎప్పుడూ నా చేత టీ కూడా చేయించలే అందుకే నాకు అసలు ఏమి రావు తినడం తప్ప... ఇంటర్ పూర్తవ్వంగానే పెళ్లయిన నాకు ఇక మొదలయ్యింది ఈ వంట బాధ్యత. నిజ్జం నాకు అస్సలు అన్నము చెయ్యడం కూడా రాదు. కొన్ని రోజులు ప్రయత్నాలలో ఉండగానే ప్రేగ్నెన్సీ తో ఒకటే నాసియా ...నా వంట నాకే నచ్చేది కాదు. మా ఆయన కోసం వండినా నాకు అవి చూస్తేనే కడుపులో తిప్పేది. మొత్తానికి అలా అలా ఏదో తప్పని సరై నేర్చుకున్నా . ఇక పిల్లలకు స్కూలు కెళ్లేటపుడు వారికొరకై ఒక షెడ్యూల్ పెట్టుకునే దాన్ని . వాళ్లేపూటా అన్నము తినరు... ఒక పూట తిన్నది, మరో పూట తినరు...ఇంకా ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు.. ( అలా అని మంకు పట్టు పట్టేవాళ్ళేం కాదు నాదే తల్లి ప్రేమ).

నాకు రాదని కాదు కాని ఒకటే రుచులు కోరి ఆస్వాదించే టైప్ కాదు. ఆకలేస్తే ఏదో ఒకటి తినేయ్యాలి కడుపు నింపుకోవడానికి అని నా అభిమతం. మా ఆయన ,మా పెద్దబ్బాయి దీని కి పూర్తి విరుద్ధం. మొత్తానికి అలా మా సిల్వర్ జూబ్లీ కూడా గడిచిపోయింది.

నా దృష్ఠిలో ఈ వంట తినడం అనేవి ఎంత క్లిష్టమయిన ప్రక్రియలు అంటే..అసలు రోజూ వండుకోవడం, తినడం ,కడుక్కోవడం ఎవరు కనిపెట్టర్రా బాబు అని నేను అనుకోని రోజు లేదు. రోజు ఉదయాన్నే లేవంగానే ఇవాళ ఏం చెయ్యాలి ఒక పెద్ద ప్లానింగ్..దాన్లో ఏన్నో అడ్డంకులు... కొన్ని కూరగాయలు వాతం చేస్తాయి, కొన్ని ఆయుర్వేద మందులకు పథ్యం.. కొన్ని కాశీ లో వదిలేస్తారు..కొన్ని నచ్చవు. అన్ని బాలన్స్ చేస్తూ చెయ్యాలి. అసలు ఒక టాబ్లెట్ రూపంలో ఉండి పుటకొక్కటో రెండో వేసుకునే లా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటా అప్పుడప్పుడూ.

మంచి వంటకాతో ఇంకో ఇబ్బంది కూడా ఉంది...బాగా లాగించేసి ఒళ్లు పెంచేసి తగ్గించడానికి నానావస్థలు పడాలి. కొందరైతే ఎంత తిన్న లావె అవరు ..వాళ్ల శరీరం తీరు..(మెటబాలిజం) అదృష్టవంతులు.

సరే మళ్లీ టాపిక్ లోకి మా వంట చేసే

అమ్మాయి గత పది రోజులు ఏదో పనివల్ల రావడం లేదు.దాంతో ఇక నా వంట పర్వం మొదలయ్యింది.

మొదటి రోజు కొంత ఫోకస్ గా చేశా.. ఇక మా అబ్బాయి ,అత్తగారు, మా ఆయన ఆహా ఓహో అంటూ తిన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది.. నా వంట కూడా ఇష్టం గా తింటున్నారే అని. ఈ రోజు సెలవు.. ఇంట్లో వాళ్ళ ప్రశంసలు గుర్తు తెచ్చుకొని ఆ స్ఫూర్తి తో ట్రెడిషనల్ గా గా మోర్ కొళంబు, కూటు చేశా. అదే ఈ రెసిపీ (కూటు తర్వాత యాడ్ చేస్తా)

శనగపప్పు, వన్ స్పూన్

బియ్యం గింజలు, 1 స్పూన్

ధనియాలు, 1 స్పూన్

పచ్చి/ఎండు మిరపకాయలు, (నాలుగైదు)

పచ్చి కొబ్బరి ఒక కప్పు నాన బెట్టుకుని రుబ్బుకోవాలి.

పుల్ల మజ్జిగలో ఈ పేస్ట్ కలిపి పెట్టుకోవాలి. బెండకాయ, సొరకాయ, గుమ్మడికాయ లాంటి ఏవైనా కూరగాయలు ఒక బాండలి లో నెయ్యి తిర్గవాత(పోపు) (కొంచెం సన్నగా తరిగిన అల్లమ్ కూడా వేగాక) లో వేసి ఉడికించుకోవాలి. తర్వాత పుల్ల మంజ్జిగ ఇందులో కలిపి మీది నుంచి కరివేపాకు కొత్తిమీర వేసి మర్ల నివ్వాలి.ఒక ఐదు నిమిషాల తర్వాత ఘుమ ఘుమ వాసన రాగానే దింపుకోవాలి.

మాటకేం గాని చాలా బాగా వచ్చింది .

Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-1625235876472422361.post-28315021244640962882021-09-28T18:34:00.011-07:002021-09-29T08:19:58.956-07:00రెండ్రోజులు బ్రేక్ కావాలా ? అయితే ఇదిగో గోకర్ణ,మురుడేశ్వర్, విభూతిఫాల్స్.

ఏడాదిన్నర నుంచి అతి బిజీ షెడ్యూల్ నుంచి బయట పడటానికి మోనాటనస్ రొటీన్ నుంచి ఒక బ్రేక్ కు ఒక అద్భుతమైన జలపాతం , కొన్ని బీచ్ లు ఒక దేవాలయం , రైలు ప్రయాణం ఎలా ఉంటుంది.. మంచి కంపెనీ తో వెళ్తే అదిరిపోతుంది. నాకైతే ఎలా ఉన్నా బానే ఉంటుంది. అదే ఇది.

కరోనా పుణ్యమా అని దాదాపు రెండు సంవత్సరాలనుండి అన్ని టూర్ లు క్యాన్సిల్ అయ్యాయి. చివరిది 2019 లో బాందవగడ్ టైగర్ రిజర్వ్ ..ఆ తర్వాత ఇక కరోనా, ఫారిన్ ట్రావెలర్ లు, కంటైన్మెంట్ జోన్ లు, లాక్డౌన్ లు బాధితుల కష్టాలు అన్ని అందరికి తెలిసినవే ఇప్పటికి ఇంకా నవంబర్ కు కానీ అమెరికా ట్రావెల్ బాన్ తీయట్లేదు. పోయిన నెల కరీంనగర్ జిల్లా కోటిలింగాల ధర్మపురి కొండగట్టు ఒక రోజు ట్రిప్ వెళ్ళాం అనుకోండి... కానీ కొంచెం దూరంగా ప్రకృతి ని ఆస్వాదించేందుకు ఈ సారి వెదికి వెదికి గోకర్ణ, మురుడేశ్వర్, విభూతి ఫాల్స్ ట్రిప్ సైన్ అప్ చేసాం.( ఫామిలీ) మీటప్ అప్ లోదాదాపు చాలా ఏళ్ల నుంచి మెంబర్ని కానీ అందులో వాళ్ళ ప్యాకేజి లు చూడడమే తప్ప ఎప్పుడు వెళ్ళలేదు. ఈ సారి బ్యాక్ పాకర్స్ అండ్ సిటీ ఫ్రీక్స్ గ్రూప్ వాళ్ళ ట్రిప్ ప్లాన్ ఇది. చూస్తే ప్రతి శుక్ర వారం ఉంది ,ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి ఫైనల్ చేసాం.

హుబ్లీ ఎక్స్ప్రెస్ సాయంత్రం మూడు యాభై కు నాంపల్లి నుండి బయలు దేరుతుంది.. మొత్తం ఇరవై మందిమి అందులో ముగ్గురు చెన్నై నుండి బస్ లో వస్తున్నారు. ఉదయం ఆరు గంటలకు హుబ్లీ లో దిగుతాం ...ఆ రైల్వే స్టేషన్ ఆసియా లో రెండవ అతి పొడుగైన రైల్వే స్టేషన్ అట... అక్కడి నుంచి అందరం టెంపో ట్రవెల్లెర్ లో గోకర్ణ బయలు దేరాం. దూరం 150 కి మీ అయినా ఘాట్ రోడ్ కాబట్టి ఐదు గంటలు పట్టింది. మధ్యలో హుబ్లీ దాటంగానే మహాలక్ష్మి హోటల్ అని రోడ్ పైనే ఉంటుంది(చాలానే ఉంటాయి మేము ఇక్కడ ఆగాము) అక్కడ కొంచెం ఫ్రెష్ అయి టీ, టిఫిన్ తాగొచ్చు బానే ఉంటాయి..

ఎంతో ఉత్సాహంగా గోకర్ణ వచ్చాము అందరూ బీచ్ కాస్ట్యూమ్స్ లలో .అక్కడ బీచ్ లో అలలు ఎంతో ఎత్తులో ఎగసి ఎగసి పడుతూ రండి రండి అని కవ్విస్తున్నట్టు ఉంది...అక్కడ కొన్నాళ్ల క్రితం నలుగురైదుగురు నీళ్ళల్లో కొట్టుకుపోయారని ..నీళ్లకు ఒక 10 మీటర్ల వరకు కూడా ఎవ్వరిని వెళ్ళనివ్వట్లేదు.. అందరం తెగ నిరుత్సాహ పడిపోయాం. ఆ బీచ్ కు ఆనుకోని మహాబలేశ్వర గుడి, ఒక గణపతి గుడి ఉంటాయి. పెద్దలకు తర్పణాలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఎక్కువగా మాకు కనిపించారు. ఇక్కడి శివ లింగం ఆవు చెవి రూపం లో ఉంటుందని గో (ఆవు) కర్ణం ( చెవి) అని పేరు వచ్చింది. రకరకాలు సుగంధ ద్రవ్యాలు , సామ్రాణి చాలా దుకాణాల్లో అమ్ముతున్నారు.

ఈ ఊరిలో దాదాపు ఎనిమిది పైనే బీచ్ లు ఉన్నాయి ..తర్వాత మేము కుడలే బీచ్ కు వెళ్ళాం (ట్రెక్ లో). ఆటో లో వెళ్తే వంద రూపాయలు. ఈ బీచ్ ప్రకృతి అనే అమ్మాయి ఆకు పచ్చని చెట్లనే చీర , లేత నీలం సంద్రాన్ని అంచులా చుట్టుకున్నట్టు పక్కనే శిక్షణ పొందిన సైనికుల్లా నిలబడ్డ కొండలు మనల్ని మైమరిపస్తాయి చాలా రిసార్టులు, హోమ్ స్టే లు ఉన్నాయి చుట్టూ. ఎవ్వరికి కనిపించకుండా కేవలం నేచర్ తో ఉండాలని అనుకునే వాళ్లకు మంచి ఎస్కేప్. ధరలు కూడా మామూలుగానే ఉన్నాయి. ఈ బీచ్ కొంచెంనయం నీళ్ళతో కొంత దూరం వరకు ఆస్వాదించేందుకు అవకాశం దొరికింది...అలా కాసేపు అయింతర్వాత ..ఆ అంచులో ఉన్న చాలా హోటళ్లలో ఒక చోట లంచ్ పూర్తి చేసాం. మాకు తెల్సిన సమాచారం మేరకు ఓషన్ ఫ్రంట్ వ్యూ.. సన్ సెట్ బాగుంటాయి. వచ్ఛే దారిలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి కొండ దిగేప్పుడు ట్రై చెయ్యొచ్చు.

అక్కడ నుంచి ఇరవై నిమిషాల ట్రెక్ లో ఓం బీచ్ కు వెళ్ళొచ్ఛు... ఈ బీచ్ కు ఆ పేరు ఎందుకు వచ్చింది అని కొంత పరిశీలించగా రాళ్లన్నీ ఓం (ఉల్టా) షేప్ లో పేర్చినట్టు ఉంటాయి. ఇక్కడ బీచ్ లో చాలా రాళ్లు ఉన్నాయి. అలల తాకిడి ని తట్టుకుంటూ క్రమేపి శిథిలమవుతూ.... బీచ్ కు బార్డర్ లా అన్ని కొబ్బరి చెట్లతో సినిమాల్లో, ఫొటో ఫ్రేములో తరచూ చూసే సీన్ లా ఉంటుంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం ఎంజాయ్ చేస్తారట.

(photo courtesy: google)
అంతే ఇంక అక్కడ నుంచి మురుదేశ్వర్ బయలుదేరాం. రాత్రి ఎనిమిదింటికి అక్కడ బీచ్ కు ఒక 100 మీ సమీపంలోనే ఉన్న ఒక హోంస్టే లో బస. కిటికీ లోంచి సముద్రపు హోరు, అతి దగ్గరలో మురుడేశ్వరుడి గుడి దీపాలు ఎంతో ఉల్లాసం కలిగించాయి. ఉదయం ఐదింటికే మా వాళ్ళు బీచ్ లో వాకింగ్ కు వెళ్లారు... తర్వాత అందరం గంతులు వేసుకుంటూ.. సముద్రం (అరేబియా)దగ్గరికి వాలిపోయము..., చివరంటూ కనిపించని నీళ్లు, ఇసుక తిన్నెలు...సముద్రపు జీవుల ఆల్చిప్పలు.. అన్ని రకాల సైజుల శంఖులు, అలలతో సయ్యటాలు .....ఇక ఫోన్ లకు విరామం లేదు ,ఫోజు లకు అంతే లేదు...తర్వాత తయారై మురుడేశ్వర్ గుడికి బయలు దేరాం... చక్కగా మా హోమ్ స్టే నుంచి బీచ్ లో( కాళ్ళని నీళ్లలో తడిపిస్తూ మనలోని పసితనాన్ని నిద్ర లేపుతూ... ఆఫ్ కోర్సు మాములుగా కూడా వెళ్ళొచ్ఛు 😊) ఒక 500 మీటర్లు వెళ్తే వచ్చేస్తుంది ...గుడి గోపురం ఇరవై అంతస్తులతో "నాకెవరు లేరు సాటి" అన్నట్టుగా ఠీవిగా నిల్చొని ఉంటుంది ముందర గజారాజులు ద్వార పాలకుల్లా కొలువు దీరగా. (లిఫ్ట్ లో పై వరకు వెళ్లి ద్వీప కల్పం లా ఉన్న గుడి అందాల్ని చూడవచ్చు.)

లోపల గర్భ గుడిలో స్వామి వారు (శివుడు) పక్కన అమ్మవారు ఉంటారు. కొంచెం పైన కొత్తగా ఏర్పాటు చేసిన పార్క్ అందులో పెద్ద కైలాసనాథుని విగ్రహం...కృష్ణార్జునులతో కొలువు తీరిన రథం...రావణుడు ఆత్మలింగం కథ ను ప్రతిబింబించే విగ్రహాలు ఉంటాయి.

మొత్తానికి బీచ్, గుడి కు టిక్ మార్క్ వచ్చింది. నెక్స్ట్ మజిలీ విభూతి ఫాల్స్ ..

మురుడేశ్వర్ నుంచి దాదాపు మూడు గంటలు ప్రయాణం. బేస్ నుంచి అరగంట కొండ పైకి అందమైన ప్రకృతిలో స్వర్గానికి దారి నా అన్నట్టున్న దారిలో ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే వస్తుంది... విభూతి జలపాతం...అంతే ఆ జల రవళి కి, వాటి స్వచ్ఛతకు, ఆ స్థలానికి ఫిదా అయిపోయి వీలయిన వాళ్ళందరూ నీళ్ళల్లోకి దూకేశారు. ఇక బయటికి వస్తే గా... అక్కడే డైవ్ లు , ముక్కు మూసుకుని నీళ్ళల్లో మునగడాలు.. ఈతలు ,ఫోటోలు..ఉత్సాహంగా అరుపులు కేరింతలు... కష్టపడి ట్రైన్ టైం అవుతున్నదని మా ఆర్గనైజర్ అందర్నీ బయటికి కదిలించాడు. బేస్ లో ఒక చిన్ని హోటల్లో తాలి ( వెజ్, నాన్ వెజ్ ఉంటుంది) తిని హుబ్లీ బయలు దేరాం. హంగు పొంగు లతో లేక పోయినా ఆదరంగా పెట్టారు పర్లేదు తినొచ్చు లేదా కొంచెం హైవే లో మళ్ళీ అన్ని రకాల హోటళ్లు ఉంటాయి..

మొత్తం మీద మా ట్రిప్ ఒక్క గోకర్ణ బీచ్ లలో కల్గిన నిరుత్సాహం తప్పిస్తే చాలా బాగా జరిగింది. రాత్రి 8.50 కు తిరుగు ట్రైన్ హైదరాబాద్ కు..

శుక్రవారం మధ్యాహ్నం నుండి సోమవారం మధ్యాహ్నం వరకు కేటాయించ గలిగితే మంచి ట్రిప్. తప్పక చూడండి.

nd Unknownnoreply@blogger.com4tag:blogger.com,1999:blog-1625235876472422361.post-79093999967237673732021-09-01T22:03:00.001-07:002021-09-01T22:03:41.915-07:00అలివేలు - పిట్టకథలు

మా ఇంట్లో పనిచేసే అలివేలు గత పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నది.. నల్గొండ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత తన చేతిలో కూడా నాలుగు డబ్బులు ఆడతాయని

ఇళ్లల్లో పని చేయాలని అనుకోని వచ్చిన మొదటి ఇల్లు మాది. ఊరికి కొత్త ,డబ్బులపైన ఇంకా ఇక్కడి పని మనుషుల రాజకీయాలు ఇంకా ఒంట బట్టలే కాబట్టి వెంటనే కుదిరింది. మనిషి తెల్లగా విలక్షణంగా ఉంటుంది. పని కూడా శ్రధ్దగా చేస్తుంది. కానీ మాట మాత్రం విరుపు ఎక్కువ. చేతులు తిప్పుతూ గట్టిగా సూర్యకాంతం లా మాట్లాడుతుంది అన్ని విషయాలకు. త్వరలో నే మా ఇంట్లో మనిషి లా అయిపోయింది.

పోయిన వారం రెండు రోజులు పనికి రానని పెళ్లికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది ...వచ్చిన తర్వాత చూస్తే ముఖంలో ఏదో తేడా కనిపించింది. అంటే తేటగా ఇంకా అందంగా కనిపించింది.... ఏంటబ్బా తేడా అని ఒకటికీ రెండు సార్లు చూసాను అదే బొట్టు...నున్నగా దువ్వి వేసుకున్న జడ.. ఏమి మార్పు లేదు ..అక్కడికి అన్నా ఏంటో మార్పు ఉంది అలివేలు నీ ముఖం లో అని... ఏముంది ఏం లేదు అంది తన స్టైల్లో ఉడుస్తూ ఓరగా నాకేసి చూస్తూ.... మరుసటి రెండు రోజులు నేను బిజీ గా ఉండి ఈ విషయం మర్చిపోయా... ఇవాళ ఉదయం అలా సోఫాలో కూర్చుని టీ తాగుతూ అలివేలుని చూసా సడన్ గా తట్టింది... వెంట్రుకలకి రంగు వేశావా అలివేలు అని అడిగా ...ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతూ ఏటో చూస్తోంది... ఇంకా మొదలయ్యింది..మా ఇంట్లో వాళ్ళ తాకిడి.. ఏం రంగు వేశావు?, ఇంట్లో నా పార్లర్ లోనా?..ఎవరు వేశారు?... అలానే ఉంటే ఏమయింది... అంటూ...

నేను వేసుకున్నానా అని మా వారు..తమాషాగా.. నీవేనా మీ ముత్యాలు ( వాళ్ళాయన) కు కూడా వేశావా అని ప్రశ్నల వర్షం కురపించారు. ఆ ..పెండ్లికి పోతుంటి మరి మా అమ్మ ,నా బిడ్డ అందరూ ఒకటే చెప్పవట్టిరి... మా అమ్మనే ఏదో పొట్లం తెచ్చింది... నేనే పెట్టుకున్నా నెత్తికి అన్నది. మా అత్తగారు ఆమె చెల్లెలు ఒకటే నవ్వు అది విని. "ఊడిన ఎంటికలు తెల్లగా ఉంటే కొంటలేరమ్మ ..నేను ఏ గ్లాసు లో గిన్నె నో తీసుకుంటా దాచిపెట్టి ఇచ్చి, అందుకే రంగు ఏసుకుంటే అవి కూడా వస్తాయి" అన్నది....ఇంకా చూడాలి మా షాక్. అయ్యో ఇన్నాళ్లు దాచిన ఊడిన వెంట్రుకలు వేస్టే నా అలివేలు అన్నా... "ఏం లే చేతులకు మిగిలిన రంగు దానికి రుద్దిన అమ్మిన ఏం తక్కువుందా అమ్మా ఎంటికల రేటు కిలో 1400 రూపాయలు అట".. అని చేతులు తిప్పుతూ..... అది విషయం...

Unknownnoreply@blogger.com4tag:blogger.com,1999:blog-1625235876472422361.post-2515977031167611042021-07-25T21:53:00.004-07:002022-04-07T01:10:02.777-07:00కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల(kondagattu, Dharmapuri, kotilingala,) ఆదివారం ఒక్క రోజు లో హైదరాబాద్ నుంచి ఉదయం వెళ్లి రాత్రికి వచ్చెట్టు ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచించి మా ఫ్రెండ్ ఇచ్చిన సలహా ఆధారంగా వేసిన ప్లాన్

1. కొండగట్టు ఆంజనేయస్వామి

2. ధర్మపురి నరసింహస్వామి

3.కోటిలింగాల కోటేశ్వర స్వామి

4. బీర్ పూర్ లక్ష్మి నరసింహస్వామి

5.వేములవాడ.

వీలైతే దారిలో వస్తూనో పోతూనో వర్గల్ సరస్వతి అమ్మవారు రత్నాలయం వెంకటేశ్వర స్వామిని కవర్ చేయాలని ప్లాన్.

ఇది ప్రోగ్రాం.

కానీ లేట్ గా బయలుదేరడం వల్ల ఎన్ని వీలయితే అన్ని చూద్దాంలే అనుకున్నాం.

దాదాపు 8:30 కి ఉప్పల్ నుంచి బయలుదేరాం.

కొండగట్టు మొదట చేరున్నాం. ( వేములవాడ పైనుంచే వెళ్ళాం కాని వచ్చెప్పుడు చూద్దామనుకున్నాం.) అక్కడ ద్విముఖ ఆంజనేయస్వామి, పక్కన పద్మావతి అలివేలుమంగ అమ్మవార్లతో కూడిన వేంకటేశ్వరస్వామి కూడా ఉంటారు. ఈ స్వామి ని ప్రార్థిస్తే మనసులో కోరికలు తప్పకుండా తీరుతాయని ప్రతీతి. అంతేకాదు.. తీరని ఆరోగ్య సమస్యలున్న వాళ్లు నలభై రోజులు ఇక్కడ గుట్టపై స్వామికి సమీపంలో ఉంటూ రోజూ దర్శిస్తూ నిద్ర చేస్తే నయమయి పోతుందని ప్రసిద్ధి. చాలామంది ఉంటారు. మానసికమయిన సమస్యలున్నా తీరుతాయని అంటుంటారు. మంగళవారం, శనివారం రద్దీ ఎక్కువ. మిగిలిన సమయాల్లో అరగంటలో అయిపోతుంది.

అక్కడనుంచి ధర్మపురి కి వెళ్ళాం(40కి మీ) ఇది ఒక దేవాలయాల సమూహం.

లోపల నరసింహస్వామి రెండు రూపాల్లో ఉంటారు హిరణ్యకశిపుని వధించిన ఉగ్ర రూపం , మరొక చోట యోగా రూపం లో శాంతంగా దర్శనమిస్తారు. యోగ మూర్తికి తొడపై చెంచులక్ష్మి రూపంలో అమ్మవారు ఉంటుంది. ఇంకా వేణుగోపాల స్వామి, యమధర్మరాజు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, కుబేరుడు, ఆంజనేయస్వామి అందరూ అక్కడక్కడ కొలువుతీరి ఉంటారు. ఇది చాళుక్యుల కాలంలో మొదలై కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందింది.

తర్వాత స్టాప్ కోటిలింగాల....

షోడశ (16) జానపదుల నివాసమున్న ప్రాంతాల్లో ఒకటైన కోటిలింగాల ( పాత కరీంనగర్ ఇప్పటి జగిత్యాల జిల్లా) గోదావరి నది ఒడ్డున ఉంటుంది.

మునులు కొంతమంది అక్కడ నదీ స్నానం చేసి శివుణ్ణి పూజించాలని హనుమంతుని కాశీ నుంచి శివ లింగం తెమ్మని కోరగా సమయానికి అందక పోవడంతో మునులు గోదావరి గట్టున ఉన్న కోటి ఇసుక రేణువులను తెచ్చి లింగాన్ని తయారు చేసి ప్రతిష్టించి పూజిస్తారు .అందుకే ఇది సైకత లింగం. (కోటేశ్వర /సిద్ధేశ్వర స్వామి.)

శాతవాహనుల మొదటి రాజధాని, బౌద్ధులు జైనులు నివసించిన ప్రాంతం ( మునుల గుట్ట) .

నూతన దంపతులు స్వామిని దర్శించి పూజిస్తే వారికి మంచి భవిష్య త్తు ఉంటుందని నమ్ముతారు. పచ్చని వాతావరణం, కొండలు, గోదావరి బ్యాక్ వాటర్స్ తో అందమైన ప్రదేశం.

పై అన్ని ప్రదేశాలలో హరిత (తెలంగాణ టూరిజం వారి హోటళ్లు ఉన్నాయి) ఇతర ప్రయివేటు వసతి కూడా ఉంది.

వేములవాడ దేవాలయం చాలా ప్రసిద్ధి. సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది ,మేము అందుకోలేక పోయాం. వర్గల్, రత్నాలయం ముందే చూశాము. అలా మా ఆదివారం అయిపోయింది. అన్ని కవర్ చేయాలంటే రెండు రోజులు సరిపోతుంది తీరిగ్గా చూసిరావడానికి. ( ఉంటె గోదావరిలో బోటింగ్ కూడా చెయ్యొచ్చు వరద నీటి ఉధృతి కారణంగా మేము వెళ్ళినప్పుడు లేదు).
Unknownnoreply@blogger.com4tag:blogger.com,1999:blog-1625235876472422361.post-65443436642607107702021-05-16T22:51:00.011-07:002022-04-07T01:05:19.345-07:00కర్ణన్ -సినిమా రివ్యూ

అణిచివేత లోంచి ఆవేశం పుడుతుంది, ఏదో ఒకనాడు వెలుగు వికసిస్తుంది. మనిషి
జంతువులనుంచి పరిణామం చెంది కొన్ని యుగాలు దాటినా చుట్టూ ప్రపంచం అంగారకునికి బాటలు
వేస్తున్నా ఇంకా జంతువులతో సమానంగా ఇంకా హీనంగా జీవనం సాగుస్తూ కనీస అవకాశాలు,
సౌకర్యాల కోసం చేసే పోరాట కథనే కర్ణన్...

మంచి బిగువున్న, ప్రేక్షకులను కట్టి పడేసే
కథలు వేళ్ళ మీద లెక్కపెట్ట కలిగేవే ఉన్న ఈ రోజుల్లో...ఆద్యంతం కథ కథనం , నటనలతో
కట్టిపడేస్తుంది. అతి సహజంగా కనిపించే పాత్రలు, సన్ని వేషాలు ఉంటాయి...( బహుశా అలా
సాధారణంగా కనిపించడానికి నటులకు చాలా మేకప్ వేయాల్సి వచ్చిండొచ్చు).

పిల్లి, కుక్క,
గాడిద, గుర్రం, మేక ,పందులు,గద్ద ఏనుగు లాంటి కనిపించే జంతువులన్నీ కూడా చెప్పకనే
మనకు కథను సన్ని వేశాన్ని వివరిస్తుంటాయి. ముందరి కాళ్ళ బంధం తో ఉన్న
గాడిద......చేవ ఉన్నా చదువు, ఉపాధి, సౌకర్యాలు లేమి తో బంధించబడ్డ వారి ఊరికి...
సింబాలిజం గా చూపించారు.. ఇక ఇందులోని పాత్రల పేర్ల ఎంపిక (కర్ణన్ ,దుర్యోధన,
ద్రౌపది ,అభిమన్యు) లోతుగా అనిపిస్తుంది మహా భారత పోరాటాన్ని గుర్తు తెప్పిస్తుంది. హీరో ఆ ఊరి ఉత్సవం లో కత్తి ని గెలవడం అది దగ్గరున్నప్పటి నుంచి అతని లో ఆ ఊరిలో ఊరి వారిలో మార్పుకు నాంది పలుకుతుంది.

అనారోగ్యంతో ఉన్నప్పుడు బస్ వారి ఊరిలో ఆపక చనిపోయిన అమ్మాయి కథకళి ముసుగుతో అలా బాక్ గ్రావుండ్ లో అప్పుడప్పుడు కనిపించడం ( ఆ
ఊర్లో దేవతల విగ్రహాలకు, చిత్రాలకు ముఖాలుండవు...) కట్టలు తెంచుకున్న వారి ఆవేదన,
వారిలో ఆలోచన రేకెత్తించడానికి, ఆగ్రహావేషాలు గా మారడానికి, ఊరు మొత్తం ఒక్క తాటిపై
తేవటానికి, ప్రతీక గా కనిపిస్తుంది.. సాటి మనిషిని మనిషిగా చూడలేని (కులం,
మతం,వర్ణం, జాతి, ధనిక, పేద వ్యత్యాసలతో మగ్గుతున్న) మానవులలోని నయం చేయలేని అహంకార
రుగ్మత ను సంకుచిత జాడ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఎవరి ఆత్మ గౌరవాన్ని వారు
ఎదురుఒడ్డి పోరాటం తో నిలబెట్టుకోవడం ద్వారానే సాధించొచ్చని నిరూపిస్తారు.

"పొడియంకుళం" ఒక సుమారు వంద ఇళ్లున్న అణగతొక్కబడిన
వర్గం నివసించే ఊరు. ప్రభుత్వ,పాలకుల నిర్లక్ష్యానికి గురయి కనీస బస్ ,స్కూలు ,ఆరోగ్య వసతి లాంటి
ఎలాంటి సౌకర్యాలు లేక అతి పేదరికం ఉపాధి లేమిలతో మగ్గుతుంటారు.. అక్కడి యువత
మిలిటరీ లో ఎంపికయితే వారి కుటుంబాలు తద్వారా వారి ఊరు బాగుపడుతుంద ని పిల్లలు
చదువుకుంటే బాగుపడతారనే వారి కలలు కల్లలు గాని మిగులు తుంటాయి. అలాంటి సందర్భం
లో ధైర్యావేశాల తో కూడిన బలం , పౌరుషం, ఉన్న కర్ణన్ ( ధనుష్) వారి కంటికి ఆశా దీపం
లా కనిపిస్తాడు. అతన్ని వెన్నుతట్టి కొండంత ధైర్యం లా ఉండే తాత యెమెన్ (లాల్),
తమ్ముడి పై ఎనలేని నమ్మకం , ఆశావాదం మళ్ళీ భయాందోళనలతో ఉండే అక్క
పద్మిని(లక్ష్మీ ప్రియ) ,తలపై పాగా తో ఆత్మ గౌరవాన్ని చాటే ఊరిపెద్ద, తప్పు
చేసినందుకు కాదు గౌరవం గా నిలబడినందుకు క్రూరత్వాన్ని ప్రదర్శించే ఎస్పీ
కన్నాభిరాన్, మొదట భయం తో వెనుకంజ వేసిన తర్వాత మద్దతు ఇచ్చే ఊరివాళ్ళు... ప్రతి
ఒక్కళ్ళు గుర్రం పిల్లవాడు, పడుచు, పిల్ల, ముసలి, ముతక..ఆడ, మగ వారి వారి పాత్రల్లో
జీవించారు.

ఆ ఊరి అమ్మాయి పక్క ఊరిలో చదువు కోసం వెళ్ళడానికి బస్ కూడా ఆపకపోవడం
పైపెచ్చు వీరిని చులకన చేసి అవమానించినపుడు ఆ తండ్రి కూతుర్ల ఆక్రందన, నిండు చూలాలిని ప్రసవానికి తీసు
కెళ్లాడనికి కళ్ళముందు నుంచి బస్సులు వెళుతున్నా అందులో చోటున్నా ...కనీస మానవత్వం
లేక ఆపక పోయినప్పుడు ఆ భర్త అసహాయత.... ఆమె కొడుకు ఆక్రోషం... మనల్ని
కదిలిస్తుంది...గుండె పిండి చేస్తుంది. ఆ అబ్బాయి రాయి తో బస్సు అద్దాలు పగలగొట్టి
ఆపినపుడు ప్రేక్షకుల కు" అది అలా జరగాలి"అన్న ఒక భావన తర్వాత వీళ్ళని మళ్ళీ ఏం చేస్తారో అన్న భయాన్ని కలిగిస్తుంది. మనల్ని ఆ ఊరి వాళ్లలో ఒక్కరిగా మానసికంగా
సినిమాతో బాటు ప్రయాణింప చేయడం లో దర్శకుడు సెల్వరాజ్ 100శాతం సఫలమయ్యాడు.

ఊరంతా
ఒక్క తాటి పై నిలబడి పోలీసులు దాష్టీకాలని ఊహించి వాటికి కలిసి కట్టుగా నిలబడి
పోరాటం చేయడానికి నిర్ణయించుకొని ముందుకు కదలడం..ఎంతో చక్కగా మలిచారు. ఇప్పుడు కూడా
అద్భుతం గా ఉన్నా కానీ కర్ణన్ ఎస్పీ ని చంపకుండా మరోలా మలిచింటే ఇంకా బాగుండేదేమో
అని నా అభిప్రాయం.

ధనుష్ నటన అతి సహజం, అసామాన్యం...అద్భుతం. దర్శకుని సునిశిత
దృష్టికి, ఊహ శక్తికి అబ్బురమనిపిస్తుంది. దర్శకుని కెరీర్ లో తనకి ఇదొక మాస్టర్
పీస్ సినిమా...

Unknownnoreply@blogger.com9tag:blogger.com,1999:blog-1625235876472422361.post-85966918098602137032021-04-25T03:08:00.003-07:002021-04-25T09:12:30.731-07:00 ఫోన్ కాల్లేక లేక దొరికిన సెలవు రోజు, ఒక తెలియని నంబర్ పోన్ లో మోగింది. అబ్బా అనుకున్నా
కానీ ఎవరికి ఏం అవసరమొచ్చిందోలే చేయగలగితే ఏముంది, అసలే కరోన కాలం, ఇవన్నీ మాములే
కదా అని ఎత్తి "హలో" అన్నాను. "మేడం నేను బోయినపల్లి నుంచి మాట్లాడుతున్నాను మీరు
జి హెచ్ ఎం సి కూకట్ పల్లి డిప్యూటి కమీష్నరేనా కంట్రోల్ రూం కు కాల్ చేస్తే మీ
నంబర్ ఇచ్చారు అన్నాడు. అవును చెప్పండి అన్నాను. మాములుగా అయితే మాకు పాజిటివ్
వచ్చింది మందుల కిట్ కావాలి,లేక పోతే స్ప్రే చేయించండి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి
లాంటివి అడుగుతుంటారు. ఇలాంటిదే ఉంటుంది అని.

అతను ఇలా చెప్పాడు. 'మేడం మా ఫామిలి
అంతా మూడు రోజుల కిందట కరోనా టెస్ట్ చేయించుకున్నాం, ఇంటికి వచ్చి సాంపుల్
తీసుకున్నారు అని ఒక పాజ్ ఇచ్చాడు. నెక్ష్ట్ రోజు రిజల్టు ఇస్తామన్నారు కాని ఫోన్
చేస్తే ఎత్తలేదు. తర్వాతి రోజు ఎత్తారు ఇస్తాము ఇస్తాము అని తర్వాత స్విచ్ ఆఫ్
చేసుకున్నారు. నిన్న కాల్ చేస్తే ఫోన్ ఎత్తి సాంపుల్ పోయింది అన్నారు మళ్ళీ వచ్చి తీసుకుంటాము అన్నారు. కాని ఆ తర్వాత మళ్ళీ ఫోన్
ఎత్తట్లేదు అని చాలా ఆవేదనగా అన్నాడు.

మీకు ఎలా వుంది సింప్టంప్స్ ఏమైనా ఉన్నాయా టెస్ట్ చేయించాలా అని నేను అడిగాను. లేవు మేడం అన్నాడు. మరేం కావాలో నాకు అర్థం కాలేదు.

చూడండి మీకు కరోనా లక్షణాలు ఉండి టెస్ట్ కావాలంటే చెప్పండి మీకు దగ్గర్లోనే మా "బస్తి దవఖానా" లో చేస్తారు మేము చేయిస్తాము, లేదు వాళ్ళు డబ్బులు తీసుకొని టెస్ట్
చేయలేదు, మా డబ్బులు మాకు కావాలి అంటే అక్కడికి వెళ్ళో లేక ఫోన్ లోనో నో అడగండి. లేదు మాకు న్యాయం కావాలి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళపై చర్య తీసుకోవాలి
అంటే అవి మెడికల్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి మీరు కంప్లైంట్ ఇవ్వండి , కరోనా తగ్గాక
కన్సూమర్ ఫోరం లో అడగండి. కాని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి ఆరోగ్య సమస్య
లు లేకుంటే హాయిగా ఇంట్లోనే ఉండండి , మీకు ఇంకా ఏమైన ఇబ్బంది ఉంటే మళ్ళీ కాల్
చెయండి అన్నా ఓపికగా . కన్విన్స్ అయ్యాడు, సరే మేడం అని ఫోన్ పెట్టేసాడు. ఇదీ విషయం.

అసలు ఇది మాకు ఏ మాత్రం సంబంధం లేని విషయం. కాని కంట్రోల్ రూం వాళ్ళు కాల్ చేసిన వారి ఇల్లు మా సర్కిల్ లో ఉంటే అర్జెంట్ గా మా నంబర్ ఇచ్చేస్తారు. అది విషయం ఏంటి అని తెల్సుకోకుండా.

ఇది ఒక మచ్చుక మాత్రమే. ఎందుకో షేర్ చేయాలనిపించింది

Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-1625235876472422361.post-38357911146485810212021-01-15T08:45:00.010-08:002021-01-24T07:37:09.021-08:00పిల్లలు -పేర్లు
వెనకటికి పిల్లలు పుడితే దేవుళ్ళ పేర్లు, పురాణాల్లోని పాత్రల పేర్లు లేదా ఇంట్లో పెద్ద వాళ్ళ జ్ఞాపకార్థం వారి పేర్లు పెట్టేవాళ్ళు.

ఉదాహరణకి అబ్బాయిలకు రాము, కృష్ణ, శివుడు, సుబ్రమణ్యం, రఘు అదే అమ్మాయిలైతే మహా లక్ష్మి, సీత,రాధ,దుర్గ, రుక్మిణి ,సావిత్రి , సుమిత్ర (దాదాపుగా) ఉండేవి. తర్వాత కాలంలో కొంచెం మార్పు తో పూల పేర్లు చామంతి ,రోజా, లిల్లీ అబ్బాయిలకు రాజు, శ్రీనివాస్ ,మహేందర్, నరేష్ వగైరాలు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో రాణు ల పేర్లు వారి చెలికత్తెల పేర్లు భలే ఉండేవి. చారుమతి, అవంతిక,సుగంధిక,చంపక, కళావతి,పారిజాతం అంటూ.

కొందరు ఇంట్లో అందరికి "నాగ" వచ్చేలా చాలా మంది "సాయి" పేరు లో ఉండేలా పెడతారు వారి వారి నమ్మకాలను బట్టి.(నాగార్జున, నాగ చైతన్య, నాగ వెంకట్ లాంటివి) సాయి వయితే నేను చెప్పవసరం లేదు.

తర్వాత మంచి అర్థం ఉన్న పేర్లు కొత్తగా ఉండేవి పెట్టాలని తల్లి తండ్రులు భావించారు.విరించి, స్థితప్రజ్ఞ, ఐశ్వర్య, విహారి, నిహారిక లాంటివి .

అప్పట్లో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉండేవారు. అందరికి ఒకే అక్షరం తో మొదలయ్యేలా లేదా ముగిసేలా పేర్లు పెట్టారు. ( ప్రశాంతి, ప్రసన్న, ప్రవీణ్ , ప్రణతి) …అప్పట్లో సౌకర్యాలు లేక పిల్లలు ఊరికే పుట్టి చనిపోతుంటే పెంటమ్మ, పెంటయ్య(పెంటపై పారేస్తామని,అలా అంటే బ్రతుకుతారని) బుచ్చమ్మ ,పిచ్చమ్మ అని కుడా పేర్లు పెట్టేవారు.అలాగే పుణ్యక్షేత్రాలు ఉన్నావద్ద ఆ ప్రసిద్ధమైన దేవత లేదా దేవుడు పేరు విరివిగా పెడతారు. (కొమరయ్య, యాదగిరి,నరసిమ్హా, మల్లయ్య(మల్లేష్),వెంకటేష్ లాంటివి .

ఇక రానురాను భిన్నంగా ఉండాలని చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టడం మొదలయ్యింది. ఊహ,జిన,రియ,మహిమ, భూమి, అన్వేష్, థ్రిల్లెష్ లాంటివి.

యశస్వి శ్రీవాత్సవ చక్రవర్తి(అసలు పిలిచే పేరు చక్రి ), శ్రీనివాస ప్రాజ్ఞ శ్రీభవన్( షార్ట్ కట్ శ్రీని అయ్యింది), సాత్విక్ విద్వోత్తం (చివరికి సత్తి), మనోజ్ఞ రాగ ఝరి,సుహృద్ శ్రీమాన్ విరాజ్ అని రెండు మూడు పేర్లు కూడా పెట్టారు, ( అప్లికేషన్ ఫార్మ్ లో నింపడానికి గడులు సరిపోక ఏది రాయాలో,ఏది వద్దో అర్థం కాకుండా తిప్పలు పడడానికి)

ఈ మధ్య మా ఇంట్లో అయితే శ్రీహాన్, శ్రీయాన్, శ్రియాన్ష్, శ్రిత, శ్రీహిత, శ్రీకృతి, శ్రేయసి, తనరిక, విహాన్,రిహాన్,రిషాన్,విరాజ్,వివస్వన్, వివస్వంత్, వేదాన్ష్,అవ్యుక్త్,అతులిత్,అథర్వ్ లాంటి పేర్లు వచ్చేసాయి.

త్వరలో ప్రత్యేకంగా ఉంటాయని క్రిమి, కీటక్(కీటక - అమ్మాయయితే) విషణ్ణ్, స్వభావ్, సంకుచిత్, కంకణ్, ఆవేదన,ఆచరణ, అకుంఠిత,విరక్తి, సమస్య, సమాస, చికిత్స,కానుక ,ఆహార, నిబంధన్, పరిహార్, ఆసక్తి, ఆశ్చర్య, సోపాన, సందిగ్ధ , సంకట్ లాంటివి పెట్టినా అసలు ఆశ్చర్య పోవక్కర్లేదు. ( అర్థం ది ఏముందిలే ఎవ్వరికి ఉండని కొత్తదై ఉండాలి)

గడచిన కాలం స్వర్ణయుగం, అప్పటి పేర్లు ఆపాత మధురాలు లాగా మహాలక్ష్మి,గాయత్రి, కాత్యాయిని,రాము్, కృష్ణ, మాధవన్, విష్ణు, సిద్ధార్థ్ లాంటివి మళ్ళీ వినబడుతున్నాయి.

ఆ మధ్య మాకు తెలిసిన ఒక అమెరికన్ కు ఇలా మనకు పేర్లకు వచ్చిన తిప్పల గురించి చెప్తే ఆయన నవ్వి మేమయితే పలికేందుకు, గుర్తుపెట్టుకునేందుకు వీలయిన పేర్లు ఎంత సింపుల్ గానో పెట్టుకుంటాం అను ఉదాహరణకి జో, చార్లి, మార్క్, ఫిలిప్, అందులో ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఫిలిప్ జూనియర్, ఫిలిప్ సీనియర్ అని కుడా పెట్టుకుంటాం అని నవ్వుతూ చెప్పాడు.
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-1625235876472422361.post-63215540228871247882020-12-27T21:04:00.001-08:002021-01-24T08:03:30.859-08:00అంతులేని పయనం

అంతులేని పయనం

అలుపెరుగని ప్రయాణం

సాగిన కొద్దీ పెరిగిన దూరం

అయినా మేమసలు ఆగం

పిల్లా జెల్లా తలకు, కాళ్లకు చుట్టుకుని..

బట్ట, బుట్ట మూటలకెత్తుకుని..

కోడి, కుక్కలను కూడాగట్టుకొని..

బతుకు పై, తనవాళ్లపై ఆశ పెట్టుకుని..

కాలిన బొబ్బలే కాళ్లకు చెప్పులుగా వేసుకుని..

కావడిలో మోసుకుని.. లారీలకై కాచుకుని..

కడుపు మాడ్చుకుని...ఆకలికి ఓర్చుకొని

రైల్వే పట్టాల్లో తల దాచుకొని....

సాగుతూనే ఉన్నది ఈ వలస జీవుల పయనం.

నిరంతరం...అనునిత్యం..

Unknownnoreply@blogger.com2tag:blogger.com,1999:blog-1625235876472422361.post-58898241546120956582020-08-17T00:21:00.007-07:002020-10-30T23:40:29.648-07:00Gunjan Saxena - Personal opinion

GUNJAN SAXENA - (my personal opinion on movie)

Yesterday night I watched Gujan Saxena movie and got so Inspired for such a clean, neat movie on a girl with bravery, element of patriotism, women empowerment.

All these elements touch and satisfy human psychological needs...of course I am not at all a psychologist but read and heard what we cannot do in real life we get satisfied by watching some one doing.

So, right hit biography (??) with great acting by Jhanvi kapoor ...So, I had several doubts ( kind of inquisitive ) in my mind expressed with my son in the morning about how much real story is portrayed and how much made dramatically.

From childhood some how I surprisingly come across people & answers what/whom I look for ,want to know for..( I don't know it happens & I really get thrilled every time).

We watch senior journalist Shekar Gupta's " Cut the Clutter " prog regularly, so daily night released episode we watch in the morning. And today it was about totally answering my questions about Gunjan ji's reality..

I got my answers. As per his research ( I believe it's true becoz these are facts not some analysis). It's almost made.

Right from the recruitment process, ( i wondered how can only one gets selected and most funny part is after rejected for 1cm short of height, officer measures her hands and legs and finds more than qualification ....(OMG Hats off to the creativity ) the training, the way they cancel her schedules, she leaves from camp with out permission all those are very serious issues in Indian Airforce, shown very wrong, baseless.

So just watch it as a "MOVIE" don't apply for real life Air force situation. But nothing wrong to get inspired..please do that with some logic.

I loved Jhanvi by the way. I wish Sreedevi would have been alive to see her daughter in this movie..I am a fan of her too.
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-1625235876472422361.post-29651962722462144602020-06-22T05:27:00.000-07:002020-07-08T02:12:18.483-07:00చిరు కానుక

మంద హాసాన్ని ఒలికిస్తూ

మంత్రా0గాన్ని ఒంటిచేత నడిపిస్తూ

మంచితనం తో మందలిస్తూ...

మందగమనాన్ని అరికడుతూ...

బలహీనతలను బలపరుస్తూ...

బలాలను పటిష్టతరం చేస్తూ

అదిలిస్తూ ....ఆదరిస్తూ....

కంటికి రెప్పలా.. కాపాడుతూ..

పురపాలికా రంగంలో

కొత్త ఒరవడులకు పునాది వేస్తూ..

తెలంగాణా రాష్ట్రాన్ని దేశంలో,

దేశ దేశాల్లో అగ్రగామిగా నిలబెడుతూ...

లెక్క లేని పురస్కారాలు..

లెక్కకు మించి ప్రశంసలు..

లెక్కకు అందని ఆత్మీయత .

అభిమానాలను అందుకుంటూ..

నాలాంటి ఎంతోమందిని

చైతన్య పరుస్తూ...ప్రేరణ కలిగిస్తూ..

స్ఫూర్తినిస్తూ ..ఆదర్శ ప్రాయంగా నిలుస్తూ..

రాష్ట్ర అభివృద్ధిలో పురపాలికా రంగ

విభాగంలో తనదైన ముద్ర వేసుకున్న

మా శ్రీదేవి మేడం కి మా చిరుకవితా సుమాంజలి.

Unknownnoreply@blogger.com3tag:blogger.com,1999:blog-1625235876472422361.post-37066153332151114922020-06-15T23:36:00.001-07:002020-06-22T00:23:21.907-07:00కరోనాకే కరోనా వచ్చే

నీలం మొగులు,వెండి మబ్బు

తేట ఊటం ,కుంట లో కలువలు

స్వచ్ఛమైన ఆకాశం, ఇంద్రధనస్సు

కీలకిలలాడే పక్షులు,పరవశించే ప్రకృతి..

అన్ని వచ్చే వచ్చే అని కను తిరిగిచూసే

లోపే కనుమరుగయ్యే😞

రాజకీయ హామీ, రాచరిక లేమి

మకిలి లేని మనిషి మనసు

సమానత్వం, మానవత్వం

అన్ని తాత్కాలికమని

మనిషి బుద్ది కుక్క తోక అని

నిరూపితమయ్యే

ఆకలి చావులే కాదు...

అందం, ప్రతిభ, కళ, కాంతి,

పేరు, ప్రతిష్ట కంటికి కనిపించే

ఎండమావుల్లాంటివాని...

కడుపులో ఏముందో..

మనసులో ఏం రగులుతుందో....

మారుకంటికి కూడా తెలియదని

ఆపలేని ఆత్మహత్యలు చాటిచెప్పే

పుట్టడం మనం కోరింది కాదని

పోవడం కూడా మనం కోరకూడదని

చివరి నిమిషం వరకు పోరాడాలని

అన్నింటిని ఎదుర్కోవాలని..

ఆ మాత్రం తెల్సుకోలేకపాయే

ఓర్చుకోలేకపాయే..

ఇంతలోనే అంతా ఆయే..

ఇవన్నీ చూసి

కరోనాకే కరోనా వచ్చే....😞

Wishing for No Suicide society.

Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-1625235876472422361.post-60736163391258796062020-06-15T09:11:00.001-07:002020-06-15T09:11:28.487-07:00ఆన్ లైన్ చదువులు- కరోనా

కరోనా పుణ్యమా అని పాపం చిన్న పిల్లలకి ఆన్ లైన్ క్లాస్స్ తాకిడి మొదలయ్యింది. దీనికి సంబంధించి నా అనుభవం ..........

నాకు మొదట్నుంచి సైకాలజీ చదవాలని మనుషుల ప్రవర్తన, దాని వెనక కారణాలు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి. (కొంత ఇప్పటికే ఆ శక్తి నాకుందని నా నమ్మకం కుడానూ, దానికి శాస్త్ర పరంగ రంగులు దిద్దితే ఇంక ప్రావీణ్యురాలు కావచ్చు అని అత్యాశ). సరే ఒక మంచి సైట్ లో ఒక టాప్ ప్రొఫెసర్ క్లాస్ లకు ఎట్టకేలకు ఎన్ రోల్ చేసుకున్నా డబ్బులు కట్టి. చూస్తే కొన్నే క్లాస్ లు కనిపించాయి ఓస్ రెండు రోజుల్లో అయిపోగొట్టి ఇక అందర్ని అర్థం చేసుకోగలను, నాకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనుకున్నా కూడా మరి.

మొదటి రోజు మొదటి క్లాస్ కోర్స్ ఓవర్ వ్యూ చూడాలా వద్దా ..చూస్తే అదే ఒక సబ్జెక్ట్ లా అనిపించింది తప్పక రెండు సార్లు చూసా అబ్బె... ఎక్కలా.....

చాప్టర్ లే కదా అని ముందుకు ముందుకు ఫార్వర్డ్ చేసా..సర్లే మొత్తం ఒక్కరోజే ఎందుకు అని మూసేసా.

ఇంక రెండో రోజూ అంతే మొదటి రెండో క్లాస్ లకే మంగళం. తర్వాత కొన్ని రోజులు అసలు లాగ్ ఇన్ కూడా కాలే. మళ్ళీ బుద్ధి తెచ్చుకొని మొదలు పెట్టి అలా క్లాస్ లు చూస్తే మంచి డయాగ్రాం ఉన్నది ఒక్కటి చూసి విన్నా బానే ఉంది, హమ్మయ్య ఫోకస్ కుదిరింది ఇంక అయిపోగొట్టొచ్చు అనుకున్నా. తర్వాతి క్లాస్ షరా మాములే.

మరో రోజూ అలా ఫొన్ తీయగానే ఫోన్ లో సరిగా సౌండ్ క్లారిటీ లేదు అందుకే నాకు ఏకాగ్రత రావట్లే అని లాప్టాప్ తీసా ఊహూ ఇక లాభం లేదు.. ఇయర్ పాడ్స్ తీసా (మాములుగా నాకు వాడటం అస్సలు ఇష్టం ఉండదు )

ఆదీ అయ్యింది ఇంక్కొక్క క్లాస్ నాలుగు సార్లు మళ్ళీ మళ్ళీ వినగా ముగిసింది.

తర్వాతి రోజు ..క్లాసా నెట్ఫ్లిక్సా ప్రైం వీడియో నా ఇంకి పింకి పాంకి అయ్యింది ప్రైం వీడియో గెలిచింది...సినిమా మాత్రం డైలాగ్ మిస్స్ అవ్వకుండా మొత్తం చాలా ఫోకస్ తో చూసేసా.

రేపు మాత్రం ఖచ్చితంగా నాలుగు క్లాస్ లు ఫినిష్ చేస్తా. తప్పకుండా .😁😊

ఇప్పుడు చెప్పండి పిల్లల ఆన్ లైన్ ల క్లాస్ ల గురించి ......

Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-1625235876472422361.post-34796884212860204902020-05-21T03:46:00.002-07:002020-06-15T08:29:45.884-07:00Basti Dawakhanas -GHMC

As per WHO guidelines any country should have Doc to population ratio as 1:1000. Russia has 4.1:1000 whereas India had 0.77:1000 in 2018 and now recentlyreached norms .. But still number of doctors in public heath system has huge shortfall both majorly in rural but still in urban areas. Telangana govt to fill the gap to the access to public health system started Basti Dawakhanas in most populous urban area in the state like GHMC. 43 more are getting inaugurated tomorrow in addition to the existing 123 with a total target of 350.

Each Basti dawakhana will have a doctor and nurse ..soon diagnostic services, free medicines will also be added. Timings were from 9 AM to 4PM but extended to 7 PM based on huge demand from public. specialized doctors presence is also under consideration.

Great health support system to the middle class and under privileged sects of urban areas .

Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-1625235876472422361.post-47492035560740365102020-04-24T09:10:00.000-07:002020-04-24T18:23:56.391-07:00Hobby

Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-1625235876472422361.post-91652744448720818902020-04-15T19:32:00.004-07:002021-05-17T07:50:58.380-07:00ప్రశ్న
కను కొనలలో జారిన నీటి బొట్టు నడుగు

నీవెందుకు వర్షించావని...

ముకుళించుకొన్న ముఖాన్ని అడుగు

నీవెందుకలా చిన్నబోయావని...

మందగించిన ఆలోచనలను అడుగు

నీ ఉధృతి ఆపిందెవరని...

స్తంభించిన కాలాన్ని అడుగు

నిన్ను బంధించింది ఎవరని...

గుండెను మెలివేస్తున్న బాధను అడుగు

నీకెందుకు నేనంటే కసిఅని...

దరికే రానంటున్న మరుపు ను అడుగు

నీ దారి నీకు తెలియదాఅని....
Unknownnoreply@blogger.com3tag:blogger.com,1999:blog-1625235876472422361.post-22525706789805067742020-04-07T23:44:00.009-07:002020-04-16T07:58:51.976-07:00వచ్చే వచ్చే కరోన మహమ్మారి వచ్చే
వచ్చే వచ్చే కరోన మహమ్మారి వచ్చే

గత్తర, ప్లేగు. ఎబోలా,సార్స్...

సరసన అంటువ్యాధి చేరే

ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం,

ఒక దేశం కాదు..ప్రపంచాన్ని

శాసిస్తానని వికృత హాసం చేసే

విర్ర వీగు అగ్ర రాజ్యాలను

అతలాకుతలం చేసే

కానీ కానని చిన్ని రాజ్యాల

యుక్తులన్ని చాటే

ప్రభుత్వాలు కరోనా పై

యుద్ధశంఖారవం పూరించే......

మానవాళిని, వాణిజ్యాన్ని

గృహాలకే పరిమితం చేసే

వైద్యులు, నర్సులు మాత్రం

మాస్కులని, గ్లవ్ లని రక్షణ కవచాలేసి

పిట్టల వలె రాలి పోయే ప్రాణాలకు

తమ ప్రాణం అడ్డుపేట్టె

అపర ధన్వంతరు లాయే.

దగ్గినప్పుడు పడే సూక్ష్మ తుంపరల

తో వచ్చునో లేక గాలి ద్వార వచ్చునో

ఈ మహమ్మారి కానీ

అతి సులువుగా అంటుకుని

విశ్వమంతా పాకే.

కట్టడి చేయ పూనిన రక్షక భట

బృందం బుజ్జగించి , బతిమాలి..

ఆపై లాఠీ నృత్యం చేసి

కఠినులని పేరు పడి ఒక పక్క

కాలిన కడుపులతో కకావికలమవుతున్న

అన్నార్తులకు తిండి పెట్టి ఆశ్రయమిచ్చి

మానవతను చాటిరి మరోపక్క

వరద రాని, వ్యాధిరాని భూకంపం రాని

మా పని మాత్రం మానం ...

మనుగడ కై వేసే చెత్త నే కాదు

మీ మనసుల చెత్త ను సైతం

మా సేవలతో ఊడ్చి పారేస్తామని

పారిశుధ్య కార్మికులు చీపురెత్తి

గర్వంతో నినాదాలు చేసే..

పురపాలక అధికారులు మాత్రం..

అన్నీటిలో తామై అందరి మధ్యా

వారధియై అందరికి సారధియై

ఖాకీ పని ,పాకి పని ఆయాపని నర్సు పని

కరోనా గిరోనా జాంతానై అని

అలుపెరగక అహర్నిషలు

గుంభనంగా పనిచేసే

ఈ మాయదారి కరోనా పై

యుద్ధంలో తమ పాత్రను పోషించే

గెలుపుకై వీక్షించే

Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-1625235876472422361.post-36609393141916695662020-03-14T23:34:00.002-07:002020-03-15T10:32:21.011-07:00దుశ్శాలువా

(ఈ అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతం. ఎవర్ని ఉద్దేశించినవి కాదు.)

నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో కలవటానికి వచ్చిన ఉద్యోగులు సెక్షన్ల వారీగా పూల గుచ్చాలు తో వచ్చేవారు. కొంతమంది మాత్రమే శాలువా తో సత్కరించేవారు.

ఊరు మారి కొత్త ఊరికి కమిషనర్ హోదా లో వచ్చినప్పుడు ఒక పది శాలువాలతో స్వాగతం పలికారు.

ఇక అప్పటినుంచి అడపా దడపా శాలువాలే శాలువాలు. తిరిగి అక్కడ్నుంచి మళ్ళీ వచ్చినప్పుడు సెక్షన్ల వారిగా, రిపోర్టర్లు, అక్కడ నాయకులు మరో ఇరవై శాలువాలు అవన్నీ ప్రభుత్వాసుపత్రిలో ఆ రోజే ఇచ్చేసి వచ్చేసా.

అవసరాన్ని బట్టి శాలువా స్వరూపం మారిపోయింది. ముందు చలి నుంచి తప్పించుకునేందుకు వాడేవాళ్ళు. ఇప్పుడు ఈ సత్కారాలు కోసం వాడే శాలువాలు సిల్క్ దారాలతో జిగేల్ మంటూ అటు చలికి పనికి రావు, ఇటు ఊరికే కప్పుకోవటానికి పనికి రావు (గుచ్చుకుంటాయి) .

అందుకే కొందరు అధికారులు ఈ మధ్య ఈ రకం సత్కారాలు పలకరింపులను ఒప్పుకోవడం లేదు . మాకు కొత్తగా వచ్చిన డైరెక్టర్ పెన్నులు, పెన్సిళ్ళు పూల మొక్కలు ఇవ్వమని ఒత్తిడి చేశారు. అంతే కాదు మనం ఏదీ తీసుకెళ్ళక పోయినా పేషి లో ఉన్నవే ఇచ్చే వాళ్లు. అవే ఆయన ఆనందం గా తీసుకుని మళ్ళీ పేషి లో ఇచ్చేవారు.

మళ్ళీ ప్రస్తుతం ఒక ఇరవై జిగేల్ శాలువాలు పంపిణీ కి సిద్ధంగా ఉన్నాయి.

Unknownnoreply@blogger.com3