కను కొనలలో జారిన నీటి బొట్టు నడుగు
నీవెందుకు వర్షించావని...
ముకుళించుకొన్న ముఖాన్ని అడుగు
నీవెందుకలా చిన్నబోయావని...
మందగించిన ఆలోచనలను అడుగు
నీ ఉధృతి ఆపిందెవరని...
స్తంభించిన కాలాన్ని అడుగు
నిన్ను బంధించింది ఎవరని...
గుండెను మెలివేస్తున్న బాధను అడుగు
నీకెందుకు నేనంటే కసిఅని...
దరికే రానంటున్న మరుపు ను అడుగు
నీ దారి నీకు తెలియదాఅని....
Madam,so emotional..!
ReplyDeleteబరువెక్కిన హృదయంతో..
తడిసి ముద్దైన అక్షరాలు!
Sensitive
ReplyDeleteSensitive
ReplyDelete