అణిచివేత లోంచి ఆవేశం పుడుతుంది, ఏదో ఒకనాడు వెలుగు వికసిస్తుంది. మనిషి జంతువులనుంచి పరిణామం చెంది కొన్ని యుగాలు దాటినా చుట్టూ ప్రపంచం అంగారకునికి బాటలు వేస్తున్నా ఇంకా జంతువులతో సమానంగా ఇంకా హీనంగా జీవనం సాగుస్తూ కనీస అవకాశాలు, సౌకర్యాల కోసం చేసే పోరాట కథనే కర్ణన్...
మంచి బిగువున్న, ప్రేక్షకులను కట్టి పడేసే కథలు వేళ్ళ మీద లెక్కపెట్ట కలిగేవే ఉన్న ఈ రోజుల్లో...ఆద్యంతం కథ కథనం , నటనలతో కట్టిపడేస్తుంది. అతి సహజంగా కనిపించే పాత్రలు, సన్ని వేషాలు ఉంటాయి...( బహుశా అలా సాధారణంగా కనిపించడానికి నటులకు చాలా మేకప్ వేయాల్సి వచ్చిండొచ్చు).
పిల్లి, కుక్క, గాడిద, గుర్రం, మేక ,పందులు,గద్ద ఏనుగు లాంటి కనిపించే జంతువులన్నీ కూడా చెప్పకనే మనకు కథను సన్ని వేశాన్ని వివరిస్తుంటాయి. ముందరి కాళ్ళ బంధం తో ఉన్న గాడిద......చేవ ఉన్నా చదువు, ఉపాధి, సౌకర్యాలు లేమి తో బంధించబడ్డ వారి ఊరికి... సింబాలిజం గా చూపించారు.. ఇక ఇందులోని పాత్రల పేర్ల ఎంపిక (కర్ణన్ ,దుర్యోధన, ద్రౌపది ,అభిమన్యు) లోతుగా అనిపిస్తుంది మహా భారత పోరాటాన్ని గుర్తు తెప్పిస్తుంది. హీరో ఆ ఊరి ఉత్సవం లో కత్తి ని గెలవడం అది దగ్గరున్నప్పటి నుంచి అతని లో ఆ ఊరిలో ఊరి వారిలో మార్పుకు నాంది పలుకుతుంది.
అనారోగ్యంతో ఉన్నప్పుడు బస్ వారి ఊరిలో ఆపక చనిపోయిన అమ్మాయి కథకళి ముసుగుతో అలా బాక్ గ్రావుండ్ లో అప్పుడప్పుడు కనిపించడం ( ఆ ఊర్లో దేవతల విగ్రహాలకు, చిత్రాలకు ముఖాలుండవు...) కట్టలు తెంచుకున్న వారి ఆవేదన, వారిలో ఆలోచన రేకెత్తించడానికి, ఆగ్రహావేషాలు గా మారడానికి, ఊరు మొత్తం ఒక్క తాటిపై తేవటానికి, ప్రతీక గా కనిపిస్తుంది.. సాటి మనిషిని మనిషిగా చూడలేని (కులం, మతం,వర్ణం, జాతి, ధనిక, పేద వ్యత్యాసలతో మగ్గుతున్న) మానవులలోని నయం చేయలేని అహంకార రుగ్మత ను సంకుచిత జాడ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఎవరి ఆత్మ గౌరవాన్ని వారు ఎదురుఒడ్డి పోరాటం తో నిలబెట్టుకోవడం ద్వారానే సాధించొచ్చని నిరూపిస్తారు.
"పొడియంకుళం" ఒక సుమారు వంద ఇళ్లున్న అణగతొక్కబడిన వర్గం నివసించే ఊరు. ప్రభుత్వ,పాలకుల నిర్లక్ష్యానికి గురయి కనీస బస్ ,స్కూలు ,ఆరోగ్య వసతి లాంటి ఎలాంటి సౌకర్యాలు లేక అతి పేదరికం ఉపాధి లేమిలతో మగ్గుతుంటారు.. అక్కడి యువత మిలిటరీ లో ఎంపికయితే వారి కుటుంబాలు తద్వారా వారి ఊరు బాగుపడుతుంద ని పిల్లలు చదువుకుంటే బాగుపడతారనే వారి కలలు కల్లలు గాని మిగులు తుంటాయి. అలాంటి సందర్భం లో ధైర్యావేశాల తో కూడిన బలం , పౌరుషం, ఉన్న కర్ణన్ ( ధనుష్) వారి కంటికి ఆశా దీపం లా కనిపిస్తాడు. అతన్ని వెన్నుతట్టి కొండంత ధైర్యం లా ఉండే తాత యెమెన్ (లాల్), తమ్ముడి పై ఎనలేని నమ్మకం , ఆశావాదం మళ్ళీ భయాందోళనలతో ఉండే అక్క పద్మిని(లక్ష్మీ ప్రియ) ,తలపై పాగా తో ఆత్మ గౌరవాన్ని చాటే ఊరిపెద్ద, తప్పు చేసినందుకు కాదు గౌరవం గా నిలబడినందుకు క్రూరత్వాన్ని ప్రదర్శించే ఎస్పీ కన్నాభిరాన్, మొదట భయం తో వెనుకంజ వేసిన తర్వాత మద్దతు ఇచ్చే ఊరివాళ్ళు... ప్రతి ఒక్కళ్ళు గుర్రం పిల్లవాడు, పడుచు, పిల్ల, ముసలి, ముతక..ఆడ, మగ వారి వారి పాత్రల్లో జీవించారు.
ఆ ఊరి అమ్మాయి పక్క ఊరిలో చదువు కోసం వెళ్ళడానికి బస్ కూడా ఆపకపోవడం పైపెచ్చు వీరిని చులకన చేసి అవమానించినపుడు ఆ తండ్రి కూతుర్ల ఆక్రందన, నిండు చూలాలిని ప్రసవానికి తీసు కెళ్లాడనికి కళ్ళముందు నుంచి బస్సులు వెళుతున్నా అందులో చోటున్నా ...కనీస మానవత్వం లేక ఆపక పోయినప్పుడు ఆ భర్త అసహాయత.... ఆమె కొడుకు ఆక్రోషం... మనల్ని కదిలిస్తుంది...గుండె పిండి చేస్తుంది. ఆ అబ్బాయి రాయి తో బస్సు అద్దాలు పగలగొట్టి ఆపినపుడు ప్రేక్షకుల కు" అది అలా జరగాలి"అన్న ఒక భావన తర్వాత వీళ్ళని మళ్ళీ ఏం చేస్తారో అన్న భయాన్ని కలిగిస్తుంది. మనల్ని ఆ ఊరి వాళ్లలో ఒక్కరిగా మానసికంగా సినిమాతో బాటు ప్రయాణింప చేయడం లో దర్శకుడు సెల్వరాజ్ 100శాతం సఫలమయ్యాడు.
ఊరంతా ఒక్క తాటి పై నిలబడి పోలీసులు దాష్టీకాలని ఊహించి వాటికి కలిసి కట్టుగా నిలబడి పోరాటం చేయడానికి నిర్ణయించుకొని ముందుకు కదలడం..ఎంతో చక్కగా మలిచారు. ఇప్పుడు కూడా అద్భుతం గా ఉన్నా కానీ కర్ణన్ ఎస్పీ ని చంపకుండా మరోలా మలిచింటే ఇంకా బాగుండేదేమో అని నా అభిప్రాయం.
ధనుష్ నటన అతి సహజం, అసామాన్యం...అద్భుతం. దర్శకుని సునిశిత దృష్టికి, ఊహ శక్తికి అబ్బురమనిపిస్తుంది. దర్శకుని కెరీర్ లో తనకి ఇదొక మాస్టర్ పీస్ సినిమా...
Ventaney chooseyaalanipinchey vidhamgaa varninchavu nee anubhoothini
ReplyDeleteThanks 🙏
DeleteYour review is great and accurate. I have watched this movie on Sunday. Naaku chaala nacchindi movie .... when we start watching the movie manloni thought process start avuthadi.... konni konni sanivesalu like donkey kuntu kuntu nadvadam, Yeman icchina reason... Dhanush daani bandhalu tenchadam.... wow intha super go screen play chaala rare ga chustam.... Karnan and Draupadhi love story ki oka reason and sensitivity super ga chitrikarincharu.... I really liked your review... Vijay
ReplyDeleteThank you so much.
DeleteThank you
DeleteMeere movie ki story ichhinatha ..kathavesam vundi mee rachanalo,pariseelanaa drukkonam lo..I'm inspired to watch this now.
ReplyDeleteNice review Shanthi..Now, I want to watch it too ...
ReplyDeleteExcellent review కళ్ళకు కట్టినట్లు చెప్పారు......
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete