ఇంటిటా వంట మంట..

నాకు ఉదయాన్నే అతి క్లిష్టమైన కష్టమైన పని ఏంటి అంటే ఈ రోజు తినడానికి ఏం చెయ్యాలో ఎంత చెయ్యాలో, చేసింది ఎలా ఖర్చు చేయాలో డిసైడ్ చేయడం... అవును మరి "ఉప్పు తింటే ఉష్ణం పప్పు తింటే పైత్యం" ఈ సామెత మాకు చక్కగా సరిపోతుంది. 

 కాయల్లోకి మహారాజు వంకాయను, బచ్చలి కూరను మా అత్తగారు కాశీలో వదిలేశారు.కాబట్టి తినరు.ఆమె వదిలేస్తే ఇంటిల్లిపాది వదిలేసినట్టే.. అత్త పథ్యమైతే ఊరంతా ( ఇల్లంతా నే నాకు తెలుసు ) పథ్యం అని ఊరికే అనలేదు పెద్ద వాళ్ళు..అయినా సరే ఇవాల్టికి ఏ ఆకుకూర పప్పు చూసినా బచ్చలి కూరనానే అని ఇంట్లో ఉన్న వాళ్లందరినీ విడివిడిగా, కలిపి అడిగి కాదని కన్ఫర్మ్ చేసుకున్నా తినదు. ఇక ఆలుగడ్డ వాతం ము ...(బూతు)కొడుకు. తల్లీ, కొడుకు ఇద్దరు మూకుమ్మడిగా తినరు. బెండకాయ అఖిల్ కు అసలు నచ్చదు. కాబేజీ కాలి ఫ్లవరా అబ్బా నాకు వద్దు.కాప్సికం మా వారికి నచ్చదు. 

 ఇంకా మాకు ప్రోటీన్ ప్రదాత అయిన పప్పు.. గట్టిగా ఉంటే నాకు నచ్చదు..నీళ్లగా ఉంటే మా అత్తగారికి నచ్చదు. కారం పొడి వేస్తే నాకు నచ్చదు. మిరపకాయలు వేస్తే ఇంట్లో వాళ్లకు నచ్చదు. ఇక మా అత్తగారికి వయసు రీత్యా కాలక్రమేణా పళ్లు ఊడిపోయి...ఆరోగ్యం మందగించి ఏవీ నమలలేదు..అరిగించుకొలేదు. అన్నీ పేస్ట్ లా ఉంటే తప్ప మింగరావు..ఆగండి అయినా ఏవీ ఏ ఫార్మ్ లో ,టెక్ శ్చర్ లో ఉండాలో అలా ఉంటే తప్ప తిననంటారు..(ఎలా అబ్బా అలా? ) ఆవిడకి తన చిన్నతనం లో వాళ్ల అమ్మ గారు అత్తగారు ఏవీ ఎలా వండారో అవి తు.చ తప్పకుండా అలానే చెయ్యాలి.. సబ్స్టిస్టుశన్లు.. ఆల్ట్రేశన్లు... అక్సేప్టన్స్ ఉండవు ...ఒక వేళ కాకరకాయ తీపి కూరలో పచ్చి మిరపకాయలు పొడుగ్గా చీరి వేయించి వేయడం తను గానీ చూడక పోయినా,వాటిని మరోలా తరిగి వేసినా.. ముద్దగా వేయించి వేసినా..లేదా ఎండు కారం పొడి వేసినట్టు తనకు ఏ మాత్రం అనిపించినా .. టేస్ట్ ఎంత బాగున్నా ఎప్పుడు వాంతి అవుతుందో అన్నట్టు తింటారు తలకు చేయి పెట్టుకొని... 


మావారికి పెళ్ళైన కొత్తలో ఎన్నో ఉండేవి. ఇప్పుడు మా పిల్లలు, ఆయన అమ్మగారి కోరికల ముందు ఆయనవి మరుగుజ్జు అయి పోయి గంగి గోవు లా తింటారు.వాళ్లు లేకపోతే మాత్రం విశ్వరూప సందర్శనం ఉంటుంది. 


ఇంకా టిఫిన్ లు అమ్మా ఇడ్లీ, దోశ లు వద్దు... వేరే ఏమైనా చేయి పుత్రుల కోరిక .

సరే పూరి ? ఆయిల్ ఫుడ్ వద్దమ్మ ఉదయాన్నే .. 
హుమ్.. ఉప్మా.. ఒక విచిత్రమయిన భావాలతో చూసి.. పోని ఇవాళ టిఫిన్ వద్దులే అంటారు 
రవ్వ కాదు రా..సేమ్యా ..వద్దు 
అటుకులు లేదా మరమరాలు..నో .. 
పోని రవ్వకలిపి దోశ .. సరే మరి దాన్లో కి పచ్చడి ? అల్లం వద్దు..కొబ్బరి.. అరగదు.. పల్లీ ..ఆ సరేలే ఈ రోజుకి !! ఒక్కరోజు టిఫిన్ గండం గడిచింది. 

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే అన్నం తినమంటే ఒక్కపూట అతి కష్టం మీద తినేవాళ్ళు. మన తెలుగు వాళ్లకు టిఫిన్ లు ఏం ఉంటాయి? ఇడ్లీలు, దోసెలు పూరీలు , ఉప్మా , పోహలాంటివి వాళ్ళకవి స్కూల్ కు వెళ్ళేలోపే మొహం మొత్తాయి.. కావాలంటే పాలు తాగి వెళ్తాం కానీ బ్రేక్ ఫాస్ట్ వద్దనే వాళ్ళు . తర్వాత తర్వాత కాంటినేటల్ వంటలు ( అంత లేదులే ) నూడుల్స్, పాస్తా, సాండ్ విచ్, పిజ్జా ( ఏదో నాకు వచ్చినట్టు) లాంటివి ప్రవేశ పడ్డాయి. అవి కొన్ని రోజులే.. 

ఇప్పుడు రాత్రిపూట పచ్చ జొన్న రొట్టెలు లేదా పుల్క ప్రిఫర్ చేస్తారు మా వారు ( డయాబెటిస్ కాబట్టి) .. నాకేమో జొన్న రొట్టెలు ఒకేనే కానీ మరీ పచ్చవి కాదు.. తెల్లవి తింటా.. మావాడు చపాతీ లేదా పుల్కా మాత్రమే తింటాడు..మా కోడలు అన్నం ఇష్టపడుతుంది. మా అత్తగారికి ఏది చేసినా( వడలు, జంతికల లాంటివి కూడా) మిక్సి లో వేసి పేస్ట్ చేసి చారు లో నాన బెట్టాలి కాబట్టి అది ఏదైనా పెద్ద తేడా ఏం లేదు .. 

 ఇక అన్నం ఏమో మాకు పొడి పొడిగా మా అత్తగారికి మెత్తగా మింగే విధంగా మా వారికి ముడిబియ్యం అన్నం..ఇలా మూడు రకాలు చెయ్యాలి.. ఇంత ప్రెషర్ లో ఇంట్లో వంట గురించి అష్టకష్టాలు పడి పెద్ద ప్లానింగ్, షడ్యులింగ్ లతో సతమతమవుతున్న నాకు సడన్ గా సుజాత గారి రూపంలో రిలీఫ్ దొరికింది నాకు, ఒకవేళ పాళ లేని “మునిసిపల్ కమిషనర్ “ ఉద్యోగం దొరకడంతో . ఈ వంటలు చేసి మెప్పించే కంటే గ్రూప్ 1 ఉద్యోగం సాధించడం సులభం అయ్యింది నా ప్రాణానికి... 

 అంటే ఆమె అన్ని అలవోకగా అలా ఎవరికేం కావాలో అలా వండి వార్చి పారేస్తుంది అని అనుకోకండి . కాదు.. నా కష్టాలన్నీ ఆమెకు అలా హ్యాండోవర్ చేసేసా నేను ఉద్యోగం టేక్ ఓవర్ చేయడం తోనే. ఇప్పుడు ఎవరేం అన్నా, అనుకున్నా “సుజాత అంతకన్నా ఏం జేస్తుంది లే ఏదో తినండి. కాలే కడుపుకు మాడే గంజి ...అసలే వంటవాళ్ళు దొరికేది మహా కష్టం” అని సర్ది చెప్తా . ఇపుడు చెప్పండి ఇది ఎంత క్లిష్టమో!!!

Comments

  1. ఇవ్వాళ మాఇంటికి స్నేహితులు భోజనానికి వస్తున్నారు. నేను గొర్లిక్ తినను. ఒకావిడ ఉల్లిపాయ తినదు. ఇంకొక ఆయన టమాటో తినరు. మా ఆవిడ వంట చేస్తోంది. ఎలా చేస్తుందో ఏమిటో. Chat Gpt ని అడగాలేమో ఏవంటలు చెయ్యాలో.

    ReplyDelete
  2. Chat Gpt ఇలా చెప్పింది. మీరు కూడా ట్రై చెయ్యండి.
    tell me a south indian curry without garlic onion and tomato
    ChatGPT
    One popular South Indian curry that does not include garlic, onion, or tomato is "Pineapple Pachadi." Pachadi is a type of curry made with yogurt as its base. Here's a recipe for Pineapple Pachadi:

    Ingredients:

    1 cup pineapple, finely chopped
    1 cup plain yogurt
    1/4 cup grated coconut
    2 green chilies, chopped
    1/2 teaspoon mustard seeds
    1/2 teaspoon cumin seeds
    A pinch of asafoetida (hing)
    1 sprig curry leaves
    Salt to taste
    1 tablespoon oil
    Instructions:

    Heat oil in a pan over medium heat. Add mustard seeds and cumin seeds. Allow them to splutter.
    Add asafoetida and curry leaves to the pan. Stir for a few seconds.
    Add chopped pineapple and green chilies to the pan. Sauté for about 2-3 minutes.
    In a separate bowl, whisk the yogurt until smooth.
    Add the yogurt to the pan and mix well with the pineapple.
    Reduce the heat to low and cook for 2-3 minutes, stirring occasionally. Make sure not to let it boil.
    Meanwhile, grind the grated coconut with a little water to make a smooth paste.
    Add the coconut paste to the pan and mix well.
    Cook for another 2 minutes on low heat, stirring continuously.
    Season with salt to taste.
    Remove from heat and let it cool slightly before serving.
    Pineapple Pachadi is typically served as an accompaniment to rice and other South Indian dishes. It has a unique blend of sweet, tangy, and creamy flavors that complement the pineapple well. Enjoy!




    ReplyDelete
  3. Shanti gaaru, vanta prahasanam udoyogam kante kashtamaa?

    Rao Lakkaraju gaaru, mee ChatGPT recipe adiripoyindi. ee pacchadi gurinchi yeppudu vinaledu, kanaledu.

    ReplyDelete
    Replies
    1. అయ్యో అది నాది కాదండీ . ఆ తెలివి తేటల తెల్లమ్మ (AI ) ఎక్కడి నుండి తెచ్చిందో నే నెప్పుడూ వినలేదు ఈ పైనాపిల్ పచ్చడి.

      Delete
  4. వంట కష్టమని కాదండి..ఇంట్లో అందర్నీ satisfy చేసేలా చేయడం మళ్ళీ మిగలకుండా తగలకుండా చేయడం కష్టం. ఇంకో విషయం ఏంటంటే ఒక్కోక్కరు ఒక్కో విషయం లో దిట్టలు ఇష్టపడుతారు. నాకు అది వంట కాదు అంతే.

    ReplyDelete

Post a Comment