అంతులేని పయనం

అంతులేని పయనం
అలుపెరుగని ప్రయాణం
సాగిన కొద్దీ పెరిగిన దూరం
అయినా మేమసలు ఆగం

పిల్లా జెల్లా తలకు, కాళ్లకు చుట్టుకుని..
బట్ట, బుట్ట మూటలకెత్తుకుని..
కోడి, కుక్కలను కూడాగట్టుకొని..
బతుకు పై, తనవాళ్లపై  ఆశ పెట్టుకుని..
కాలిన బొబ్బలే కాళ్లకు చెప్పులుగా వేసుకుని..
కావడిలో మోసుకుని.. లారీలకై కాచుకుని..
కడుపు మాడ్చుకుని...ఆకలికి ఓర్చుకొని
రైల్వే పట్టాల్లో తల దాచుకొని....

సాగుతూనే ఉన్నది ఈ వలస జీవుల పయనం.
నిరంతరం...అనునిత్యం..

Comments

Post a Comment