నాకు ఎంతో ఇష్టమైన వేటూరి గారి పాట

"జీవితం సప్త సాగర గీతము"అంటూ ఈ క్షణ భంగురమైన జీవిత సారాన్ని కాచి వడబోసి మనకు కప్పులో అందించినా....

"ఈ దుర్యోధన దుశ్యాసన దుర్వినీచ లోకంలో" అని ఈ సమాజంలోని విషసంసృతిని, వికృత రూపాన్ని చీల్చి చెండాడినా....

 "ఉప్పొంగెలే గోదావరి" అని  అందమైన గోదారమ్మ అలలలో డోలలూగించినా....

"రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే" అని ఆర్ద్రంగా శ్రోతల హృదయాలను కదిలించివేసినా.....

 అది ఒక్క వేటూరి గారికే సొంతం. 

వారి ఆణిముత్యాలాంటి పాటల్లో నాకు ఎంతో ఇష్టమైన  "అమావాస్య చంద్రుడు" సినిమా లోని  ఈ పాట సాహిత్యం మరియు 

(ఇది తమిళ మాతృకకు అనువాదమైనా ఎక్కడా పసిగట్టని  విధంగా భావం లోనూ భాషలోనూ లోపం లేకుండా పదాల అమరికను అద్భుతంగా మలచారు. చంద్రబోస్ గారు  ఏదో  సందర్భంలో  ప్రస్తావిస్తూ ఈ పాట లోని సాహిత్యం  అమృతంలా ఊరుతూ, ఉబుకుతూ, ఉప్పొంగుతుంది అని బహు చక్కగా సెలవిచ్చారు. ముఖ్యంగా పల్లవి లోని పదకేళి విన్యాసాలు, నుడికారాలు వీనుల విందు చేస్తాయి, ఇళయరాజా గారి సంగీతం దీనిలో మమేకమై   మరింత వన్నెలద్దింది. బాలుగారు ,జానకిగార్ల గాత్ర సహకారం సరేసరి)

సినిమా: అమావాస్య చంద్రుడు
రచన:వేటూరి సుందర్రామ్మూర్తి
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్ పి  బాలసుబ్రమణ్యం ,ఎస్ జానకి

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో(2)
మలయజ మారుత శీకరమో, మనసిజ రాగ వశీకరమో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

ఆనందాలే భోగాలైతే, హంసానంది రాగాలైతే 
నవ వసంత గానాలేవో సాగేనులే, సురవీణ నాదాలెన్నో మోగేనులే
వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోనలలో మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువులూదిన గీతికలు
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

అందాలన్నీ అందే వేళ, బంధాలన్నీ పొందే వేళ
కన్నుల్లో గంగా యమునా పొంగేనులే, కౌగిట్లో సంగమమేదో సాగేనులే
కోరికలే శారికలై ఆడిన పాడిన సందడిలో మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో, మనసిజ రాగవ శీకరమో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
 
  


వీడియో లింక్    మనకోసం ---
(from youtube)

                 

                               
(Picture courtesy :google images) 

Comments

  1. ప్రశాంతి గారు, వీడియో లింక్ పని చేయటం లేదండి..!

    ReplyDelete
  2. Sorry for delayed reply! Updated. Thanks for informing!

    ReplyDelete

Post a Comment