ఊహలకే ఒక రూపం వస్తే...
ఊపిరికే ఆయువు పోస్తే ....
ఊసులకే మాటందిస్తే .....
ఉవ్విళ్ళూరుతూ ఉల్లాసంగా ఊరేగనా......!!
ఆశలకే ఇక రెక్కలు వస్తే...
అణువణూవూ పులకింతొస్తే ....
అంబరానికి దారులు వేస్తే.....
అవలీలగా అగ్రాన్ని అధిరోహించనా......!!
విరించి నా రాతే మార్చితే ...
విపంచి ఆ వైనం తెలిపితే....
(ఆ )విజ్ఞానమే విలాసం తెస్తే.....
విహంగమై విశ్వమంతా విహరించనా......!!
విధాతకి శిరస్సు వంచి ప్రణమిల్లనా.....!!!
ఎంత బాగ వ్రాసారు
ReplyDelete