అసలే డిసెంబరు నెల!..... మాంచి చలికాలం!!.......... ఉదయం ఎనిమిది తొమ్మిది అయినా వదలని పులి లాంటి చలి!!!
నా కైతే అపార్ట్ మెంట్ లో ఎండ అసలు తగలని ఇంట్లో ఉండటం వల్ల రోజంతా చలికి వణుకుతూనే ఉంటాను. (నాకు చలి కాస్తా ఎక్కువ )
కాని ఇదే చలి లో అయ్యప్ప భక్తులు తెల్ల వారు ఝామునే లేచి చల్ల నీళ్ళ స్నానం, ఒంటి పొర దుస్తులు, చెప్పులు లేని నడక లాంటివి మనిషి లోని ఇంద్రియ నిగ్రహ శక్తి కి పరీక్షలు అనుకుంటాను.
సరిగ్గా ఇప్పుడే ధనుర్మాసం కూడా మొదలవుతుంది. గోదా తల్లి చేసినట్టుగా ఈ వ్రతం ఆచరించే వాళ్ళు కూడా ఉదయాన్నే స్నానాదులు ముగించుకొని
కృష్ణ భగవానుని , ఆండాళ్ తల్లి ని భక్తితో పూజించి ఆమె రచించిన తిరుప్పావై ప్రబంధం లోని ఆ రోజు పాశురాన్ని పాడి వేడి వేడి పెసరపప్పు,నేతి పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. ఇలా ధనుర్మాసం ముఫ్ఫై రోజులూ చేసి వ్రతాన్ని ముగిస్తారు.
నా చిన్నప్పుడు మా తాతయ్య తిరుప్పావై, తిరువాయ్ ముళి నాకు నేర్పించాలని చాలా ప్రయత్నించాడు. కాని నేను చిన్నతనం మూలాన శ్రద్ధ లేక నేర్చుకోలేదు. ఈ విషయం లో తర్వాత తర్వాత చాలా బాధపడ్డాను.
మా టీవి లో ఐదు గంటలకు చిన జియర్ స్వామి తిరుప్పావై ప్రవచనం విని
నేర్చుకో అని అమ్మ లేపి కూచోపెట్టినా చలికి నిద్రకి ఆగలేక కునికి పాట్లు తీసేదాన్ని. మనసుంటే మార్గం ఉంటుంది కదా చివరికి ఒక గురువుగారి దగ్గర నేర్చుకున్నాననుకోండి.
అమ్మమ్మ వాళ్ళ ఊరు శ్రీరంగాపురం. అక్కడ శ్రీరంగం, శ్రీరంగపట్నం ల తర్వాత అంతటి శ్రీదేవి, భూదేవి సహిత రంగనాయక స్వామి ఆలయం ఉంది.
అక్కడ ధనుర్మాస ఉత్సవాలు మరియు ఈనెలలోనే వచ్చే వైకుంఠ ఏకాదశి చాలా బాగా జరుపుకుంటారు. ప్రతి వైకుంఠ ఏకాదశికి అక్కడ ఉదయం నాలుగు గంటలకే గుడికి వెళ్లి అక్కడ కోవెల లోని ఉత్తరం వైపు కళ్యాణ మండపం లోకి దారి తీసే పెద్ద ద్వారాన్ని తెరిచి పల్లకీ లో స్వామి ని ,రామానుజ జియర్ లను నిల్పి ఉంచగా కిందనుంచి భక్తులందరూ వెళ్లేవారు.
ఈ ఉత్తర ద్వార దర్శనం ఇప్పుడు అన్ని వైష్ణవాలయాల్లో వైభవంగా జరుపుతున్నారు. కాని మళ్ళీ వైకుంఠ ఏకాదశికి అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళడం గత పదిహేనేళ్ళుగా కుదరనేలేదు,కేవలం జ్ఞాపకాల్లో మాత్రమే.........

Comments
Post a Comment