2015 - నాకేం తీర్మానాల్లేవ్



ముందుగా బ్లాగు మిత్రులందరికి  వైకుంఠ ఏకాదశి , ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.......!!!

అందరూ కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా వేడుకలు జరుపుకోవడం,గత సంవత్సరాన్ని అవలోకం చేసుకోవటం జయప్రదంగా ఉంటే సంతోషించడం, లేకుంటే విచారించినా  దాని నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా కొత్త  సంవత్సరాన్ని దిశా నిర్దేశం చేసుకోవటం సాధారణంగా అందరూ చేస్తుంటారు. (నేను కూడా).

కాని ఈ సారి నేను కొంచెం భిన్నంగా ఎలాంటి తీర్మానాలు చేసుకోదల్చుకోలేదు. అలా అని పోయిన సారి నేను అనుకున్నవేమీ చేయలేదని  కాదు. దాదాపుగా అన్నీ చేసాను......!!!

 ముందుగా నిర్దేశించుకోకుండా, ఏవి ఇలా జరగాలని  ఆశించకుండా స్వేచ్ఛగా ఉండాలని...... !!   అంతే.........!!!

(Picture courtesy :google images)

Comments