మన దైనం దిన జీవితంలో తరచుగా కోపంగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు గట్టి గట్టిగా అరుచుకోవడం చూస్తూ ఉంటాం. నిజం చెప్పాలంటే మనం కొన్నిసార్లు అరుస్తాం మన మీద ఎవరో ఒకరు కోపంతో అరిచే ఉంటారు.
ఈ మధ్యనే అంతర్జాలం లో, ఫేస్ బుక్ లో "కోపం తో ఉన్నప్పుడు గట్టిగా ఎందుకు అరుస్తారు " ??? అనే విషయం పై ఒక వ్యాసం చదివాను. అందులో చాలా ప్రాచుర్యం లో ఉన్న ఒక కథ ఉదహరించారు. ఒక సారి నాకు తెల్సిన వారితో ఇది పంచుకోవాలనిపించింది.
పూర్వం ఒక ఋషి తన శిష్యులతో కూడి గంగా నది లో స్నానం చేస్తున్నారట. ఒడ్డున ఒక కుటుంబీకులు పెద్ద పెద్దగా ఒకరిపై ఒకరు ఏదో విషయం పై అరచుకోవడం చూసి ఋషి చిరునవ్వు నవ్వి "వారెందుకు అలా అరుచుకుంటున్నారని" శిష్యులని ప్రశ్నించారట. దానికి ఒక శిష్యుడు "వారు వారి ప్రశాంతను , స్థిమితాన్ని కోల్పోయినందువల్ల అలా అరుస్తున్నారు" అని సమాధానం ఇచ్చారట. దానికి ఆ ఋషి " పక్కనే ఉన్న వ్యక్తి తో మాములు స్వరం లో చెప్పినా వినిపిస్తుంది కదా అంత గట్టిగా ఎందుకు చెప్తున్నారు" అని తిరిగి అడిగాడు.శిష్యులు చెప్పిన రకరకాల సమాధానాలతో తృప్తి పడని ఆ ఋషి ఇలా వివరణ ఇచ్చాట్ట.
ఇద్దరు వ్యక్తు ల మధ్య ప్రేమ ,అభిమానాలు పరిపూర్ణంగా ఉన్నప్పుడు వారి మనసుల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు. కాబట్టి సున్నితంగా, చిన్నగా మాట్లాడినా ఒకరిది ఒకరు అర్ధం చేసుకోగల్గుతారు. నిజానికి కళ్ళ సైగలతోటే సంభాషించుకోగల్గుతారు. మది లోని భావాలు గ్రహించగల్గుతారు. అదే హృదయాల మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పుడు వారు భౌతికంగా పక్క పక్క నే ఉన్నా కూడా చాలా దూరంగా ఉన్నట్టు భావిస్తారట . ఆ దూరాన్ని అధిగమించేందుకు అవతలి వ్యక్తికి తమ భావం చేరేందుకు తామెంత దూరమని భావిస్తున్నారో అంత స్వరం పెంచి అరుస్తారు. కొన్నిసార్లు మన పక్కనే ఉన్న వ్యక్తులు కూడా కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నంత గా( మానసికంగా) అన్పిస్తారు. అదే వేల మైళ్ళ దూరంలో ఉన్నవాళ్ళు కూడా మనతోటే ఉన్నట్టు ఉంటారు.
ఈ వివరణ కొంతవరకు తార్కికంగా అన్పించింది నాకు. మనతో ఎవరైనా అలా ప్రవర్తిస్తున్నప్పుడు మనం వారు చెప్పాలనుకున్న విషయాన్ని గ్రహించగల్గుతే ఆ దూరాన్ని మరింత పెంచకుండా , సమస్య జటిలంగా మారకుండా కొంతవరకైనా చూడవచ్చు కదా.
(Picture courtesy :google images)
ఇది మనలో మాట కాదండి మనసులో మాటే :)
ReplyDeleteAdbhutaha !!
ReplyDelete