ఈ మధ్య మా ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి మా గురూజీ వచ్చారు.జరుగుతున్న కార్యక్రమం లో భాగం గా అక్కడ కూర్చున్న మమ్మల్ని ఇలా అడిగారు.. వేదాలలో, పురాణాలో చెప్పిన విధంగా భగవంతుని నాలుగు వ్రతాలు ఎంటో తెలుసా అని అడిగారు..
మేమంతా వ్రతాలా !! అవి ఆ పైవాడికా .. సత్య నారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం, వైభవలక్ష్మి వ్రతం ఇలాంటివి విన్నాం కాని అవన్ని మనలాంటి అల్పులకు , కాముకులకు కదా అని మనసు లో అనుకొని తెలియదని తల అడ్డంగా వూపాం. ఆప్పుడు గురూజీ మొదటిది "అభయ వ్రతం" అని చెప్పారు. అప్పుడు బుర్ర వెలిగింది మరి అనిపించింది ఓహో... భగవంతుడు శరణుకోరే భక్తుల కు అభయమివ్వటాన్ని ఒక పవిత్ర వ్రతం లా ఆచరిస్తారా.. అని భలేగా అనిపించింది. అప్పుడు మనకు ఒక సందేహం కలగొచ్చు. మరి ఎందుకు మనకు ఆపదలలో ప్రతిసారి ఆదుకోడే అని, ఎందుకు అభయమివ్వడు.. ఎందుకు ఆదుకోడూ ? ఒక సారి గుర్తు చేసుకొండి ..ఏ ఆపద అయిన కలకాలం వుందా ? అహా వుంటుందా అని ,మన మన పాప కర్మాలను బట్టి కొందరికి తొందరగా కొందరికి నిదానంగా తొలగొచ్చు అంతే. ఏది ఏమైనా అభయ వ్రతం భక్తుల కొరకు భగవంతుడు ఆచరించే దివ్య వ్రతం.
మరి రెండవది ఏంటీ ? గురువుగారు మళ్ళీ అడిగారు .. మళ్ళీ తెల్ల మొహం వేసాం (అంతే కదా మరి దేవదేవుడి గురించి మనకు తెల్సింది , తెల్సుకున్నది అమీబా అంతే..)
ఆప్పుడు ఆయనే చెప్పారు " సత్య వ్రతం," అని. ఎల్లప్పుడు సత్యాన్నే పలకడమే వ్రతం లా ఆచరించడం. వినడానికి సులభం, చేయటం ... అమ్మో .. సాధ్యమా ... అంటే పుట్టి బుద్ది ఎరిగినప్పటిని నుంచి చివరి వరకూ ఒక్కటి అంటే ఒక్క అబద్ధం కుడా చెప్పకూడదు.అవసరార్థం కూడా. ఎవరైనా గుర్తుకొస్తున్నారా ... ఆ ఆ అవును.. హరిశ్చంద్రుడే...సత్య హరిశ్చంద్రుడే. అంటే మిగిలిన వారందరూ అబద్ధాల కోరులనా అర్థం కాదు . కాని సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు మనకు హాని జరుగుతుంది అన్నప్పుడు.. లేదా మనకో మరొకరికో మేలు జరగాలి అన్నప్పుడు , కొన్నిసార్లు వుత్తినే అలా "అసత్య వ్రతం "అదే "అబద్ధ వ్రతం" చేస్తుంటాం. అదే హరిశ్చంద్ర మహారాజు రాజ్యం పొయినా. పుత్ర కళత్రాదులకు ఎన్నో కష్టాలు వచ్చినా చివరికి ప్రాణ హాని కలుగుతున్నా సత్యాన్ని వదిలిపెట్టడు. అదే అ త్రిలోకాధీషుని రెండవ వ్రతం.
అంతే ..గురువుగారు రెండు చెప్పి ఇక వీళ్ళకి చెప్పి వృధా అనుకున్నట్టున్నారు ఇక విషయం మార్చారు. అప్పుడు నేనే అడిగాను మరి మూడు, నాలుగు వ్రతాలు ఎంటో చెప్పనేలేదూ అని. మరి బ్లాగ్ లో రాయద్దూ.. ( అసలే చాలా ఇంటెరెస్టింగ్ గా వుంది). అలోచించండి అన్నారు. సరే బుర్రకు కొంచెం ఈ సారి పదును పెట్టాను. కొంచెం క్లూ దొరికిందిగా మరి ఎలాంటివో . అభయం, సత్యం అయ్యాయి. చకా చకా ఆలోచించి "ధర్మ రక్షణ" ఒక రాయి విసిరాను. అప్పుడు గురువు గారు అవును....కాని ఇంకా కొంచెం రావల్సి వుంది అన్నట్టు తల వూపారు. " ధర్మ రక్షణ అంటే ఎంటీ" ? అని అడిగారు .. "దుష్ట శిక్షణ మరియు సాధు రక్షణ "అన్నాను. అంటే భగవంతుడు సాధు రక్షణ కోసం దుష్ట సమ్హారం చేస్తారా లేక దుష్ట శిక్షణ చేస్తే సాధు రక్షణ అదే జరుగుతుందా అని అడిగారు. సాధు రక్షణే భగవంతుని ఉద్దేశ్యం ఆ కార్యక్రమం లో భాగంగా శిక్షించాల్సి వస్తుంది అన్నాను. మళ్ళీ సాలోచన గా తల అవును కాదు అన్నట్టు గా తలాడించారు.నా పక్కనున్న మా బంధువు అవి రెండూ అవినాభావ సంబంధం కలిగి ఒకదానిపై ఒకటి ఆధారిపడి వున్నాయి అన్నారు. ఇది సరి అయ్యింది అని అన్నారు. దానికి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. దుష్ట శిక్షణ ఎప్పుడు చేయాల్సి వస్తుంది. మనలో చాల వరకు ధర్మాన్ని అచరించాలనే చూస్తాం. చివరికి ఒక బోయ వాడు కూడ జంతువులనే సంహరిస్తాడు కాని ఆ రోజు తినడానికి ఏమీ దొరకలేదని భార్య ,పిల్లల్నో లేక మరొకర్నో చంపరు కదా. అంటే ధర్మాచరణ చేస్తున్నట్టే కదా.అలానే మనం ధర్మంగానే వుండాలనుకుంటాం కాని రకరకాల మనుష్యులు,పరిస్థితుల మూలంగా కొన్ని సార్లు మౌనం గా వుండాల్సివస్తుంది. ( స్పందించాల్సిన సమయంలో స్పందించక పోవటం కుడా తప్పే), ఈ పరిస్ఠితి ముదిరినప్పుడు కాపాడటానికి భగవంతుడు రావల్సి వస్తుంది. శ్రీ మహావిష్ణువు అవతారాలన్ని అలా ఉధ్భవించినవే కదా.. అలా ధర్మ స్థాపన మూడో వ్రతం.
సరే మరి చివరి వ్రతం ? ఏమో నాకయితే ఏమి తట్టలే అలా అలోచిస్తూ ఉండిపోయాను. అప్పుడు మళ్ళీ ఆసక్తి గా వింటున్న మా బంధువు "ముక్తి/మోక్షం ప్రదానం " అన్నారు. అంతే కదా. గురువుగారు కరెక్ట్ అనడము , మళ్ళీ వాళ్ళు హోమం పనిలో మునిగి పోవడం జరిగిపోయాయి అప్పటి కే ఆలస్యం కావడం తో. అదన్న మాట సంగతి ..

Comments
Post a Comment