ఈ రోజు మా అన్నయ్యకు ఫోన్ చేసినప్పుడు (అమెరికా లో ఉంటాడు) ఆహా ! ఒహో !! మేము అఖిల్ చేసిన అద్భుతమైన పొంగలి తింటున్నాము, ఎంత బాగుందనుకున్నావు అని ఊరించి ఊరించి చెప్పారు. నాకు తెలియక పొతే కదా మా వాడి వంటల్లో అందె వేసిన చెయ్యి గురించి.అదెలా మొదలయ్యిందంటే....
ఒక్కక్కొరికి ఒక పనిపై అభిరుచి ఉంటుంది. మరి నాకు దేన్లో అభిరుచి ఉందో తెలియదుకాని వంట చేయడంలో మాత్రం లేదని ఖచ్చితం గా చెప్పగలను. వంట చేయడం కేవలం క్షుద్భాధ తీర్చుకునేందుకు తద్వారా బ్రతకడానికి మాత్రమే అని నా నమ్మకం. ఎవరైనా ఉప్పు కారం సరిపోయాయా అని చెక్కల పిండి నో మొదటి పకోడి నో రుచి చుడమన్నా నాకు ఏమీ తెలిసేది కాదు. (ఇప్పుడు కొంచెం నయం).మా పిల్లలు స్కూల్ కి వెళ్ళేప్పుడు చాలా కష్టపడి రక రకాల చిరుతిళ్ళు చేయడం నేర్చుకున్నా. (పెద్ద వేరే పని కూడా లేదు కాబట్టి ) . మా పెద్దబ్బాయి కాస్తా పన్నెండు ఏళ్ళు వచ్చేప్పటికే వాడికి చాలా వంటలపై రుచులపై అభిరుచి ఏర్పడింది.
మొదట్లో మొబైల్స్, ఇంటర్నెట్ అంత సులభం గా లేనప్పుడు ( సింపుల్ గా జియొ రాకముందు) వాడు నేను చేసే వంటలనే ప్రయోగాలు చేసేవాడు. మొదట్లో మాగీ లో సమోసా వేసి, పనీర్ వేసి, వాడు సొంతం గా చేసుకున్న మసాలాలు వేసి చేసేవాడు. మా అఖిల్ కున్న మంచి లక్షణం ఏది చేసిన తనకు ,తమ్ముడికి చేసేవాడు. రోజు నేను పెట్టేది తిని తిని విసిగి ఉండేవాడేమో. మాధవన్ కు (చిన్నబ్బాయి) అన్న వంటలు తెగ నచ్చేవి. అలా క్రమేణా వాడి మ్యాగీ అభిమానులు పెరిగారు . అలా మ్యాగీ తో మొదలయి పాలక్ పనీర్ , పనీర్ బటర్ మసాలా, పనీర్ టిక్కా లాంటీ అన్ని పనీర్ వంటలే కాక ఇంతితై వటుడింతై అన్న చందం గా రక రకాల పాస్తాలు (ఇటాలియన్ . మెక్సికన్) వంటలు కూడా అద్భుతం గా నేర్చుకున్నాడు. ఎక్కడైనా మంచి వంటకం తిన్నాడంటే వెంటనే అది ఎలా చేయాలో తెలుసుకొని చెయ్యాల్సిందే.
ఒక సారి వాడికి ఎంతో నచ్చిన థాయ్ గ్రీన్ అనే వంటకం చేయడానికి లెమన్ గ్రాస్ కావాల్సి వచ్చింది , ఎక్కడా దొరకలే ఆన్ లైన్ లో కూడా వెతికాడు, చివరకు వెంటాడి , వేటాడి బంజారాహిల్ల్స్ లో ఎక్కడో దొరికితే తెచ్చి చేసాడు. తర్వాతా నర్సరీ లో మొక్కలు తెచ్చి ఇంట్లో నే పెట్టాడు.
అదే మాట్లాడుతునప్పుడు నేనన్నా ...అఖిల్ చాలా ఇష్టం తో ,శ్రద్ధ తో తన మనసును లగ్నం చేసి వంట చేస్తాడు. ఏమి దినుసు వేస్తున్నాము, ఎలా కలుపుతున్నాము, ఎంతసేపు స్టవ్ పై ఉంది అన్ని చాలా పట్టింపు తో చూస్తాడు అన్నా. అంతేనా అమ్మా, అన్న ఎంతో ప్రేమతో చేస్తాడు ....కొంచెం ప్రేమ వేస్తాడు కూడా వంటలో అని కలిపాడు మాధవన్.
వాడి చిన్నప్పుడు సుమారు 13, 14 ఏళ్ళ వయసున్నప్పుడు ఎప్పుడైన రెస్టారంట్ కు వెళ్తే తెచ్చిన కరి లో కొంచెం జీర పొడి, ధనియ పొడి ని డామినేట్ చేస్తున్నది అమ్మా , అందుకే ఇలా టేస్ట్ ఉంది అనేవాడు. నిజం గా నాకు అంత మైక్రో రుచులు తెలియవు.నేను ఎంతో ఆశ్చర్యపొయేదాన్ని.
బహుషా అది కుడా పుట్టుకతో వచ్చే ఒక కళే. మా వాడిలో మరో మంచి గుణం ఏంటంటే ఇది చేయి అది చేయి నన్ను సతాయించడు వాడే చేసి మాకు పెడతాడు. ఇప్పుడు అమెరికా లో చదువుతున్నాడు. మొదట్లో కొంచెం అడ్జస్ట్ అవడానికి ఇబ్బంది పడ్డా ఇక మొదలైంది వాడి వంటల పర్వం ..వాడి రూం లో వాళ్ళ ఆనందం. గులాబ్ జామున్, రసమలై, డబుల్ కా మీఠ లాంటి స్వీట్ లు, దోస ఇడ్లి, ఉప్మ, పొంగల్, పులిహొరా లేకాఒక రోజు గుమ్మడికాయ వడియాలు పెట్టాము.. అందరం కలిసి అని ఫోటో పెట్టి మా ఫ్యూస్ లు ఎగరగొట్టాడు.( నేను వడియాల్లో ఇప్పుడూ పూరే).
టీవీ లో మాస్టర్ షెఫ్ ప్రోగ్రాం లు చూస్తున్నప్పుడు వాళ్ళు పదార్థాల ను కేవలం చూసి అది ఎలా ఉండబోతోంది అని రుచి చూసి ఎదో ఒక దినుసు కొంచెం (2 సెకన్లు ) ఎక్కువో తక్కువో వేగింది అని చెప్తుంటే అలా ఎలా తెలుస్తుంది ఇదంతా నిజమేనా అనుకునేదాన్ని మా అఖిల్ ని చూసేదాక. అది కుడా పుట్టుకతో వచ్చే ఒక కళ, ఆసక్తి అభిరుచి ఉండి మెరుగులు దిద్దుకుంటే అందులో కూడా రాణించొచ్చు.
కొసమెరుపు: మా అత్తయ్య ఆవకాయ, చింతకాయ లాంటి పచ్చళ్ళూ పెట్టినప్పుడు ఇలా చేత్తో కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అని కరక్టు గా చెప్పగలిగేదటా..
అలా అని వంటలు తప్ప ఏమీ రావనుకోకండి. చదువులో సెంట్ పెర్సెంట్ తెచ్చుకున్నాడు ఇప్పటి వరకు అయిన MBA పరీక్షలలో . Tech geek కూడా.

Comments
Post a Comment