బోయపాటి శీను, బాలయ్య సినిమా చూడాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి... బాలయ్య బాబు కు లేదా సినిమా కు హార్డ్ కోర్ ఫాన్ అయి ఉండాలి.. లేదా ఎలాంటి పరిస్థితులను తట్టుకునే దమ్ము ధైర్యం ఉండాలి.. లేదా అన్నింటిలో కామెడీ చూసి నవ్వు కునే నేర్పు ఉండాలి.
నీరు, నేల, గాలి వెరసి ప్రకృతి ని కాపాడాలి మెసేజ్ మాత్రం ఇప్పుడు చాలా అవసరం, నాకు నచ్చింది. జగపతి బాబు, శ్రీకాంత్ బానే కష్టపడ్డారు. ఐఏఎస్ ,ఐఎఫ్ ఎస్ ఆఫీసర్ లను (అందులో విమెన్ ను) చాలా దయనీయంగా చూపించారు.
విలన్లను అఖండ ఆయుధాలతో భయపెట్టక్కర్లేదు క్లోజ్ అప్ లో ముఖం లో ముఖం పెట్టి చూస్తేనే భయమవుతుంది , వీక్ వాళ్లయితే చచ్చి కూడా పోతారు.
61 ఏళ్ల వయసులో బాలయ్య స్టెప్పులు (ఏ మాత్రం ఫిట్నెస్ లేకపోయినా ఏమో అని నేను అనుకుంటున్నాను) బానే వేసాడు. మురళి కృష్ణ ( నార్మల్ హీరో విత్ హీరో మేక్ అప్) కు అఖండ కు వయసు తేడా స్పష్టం గా కనిపిస్తుంది లేకపోయినా. అఘోరాలు, అద్భుత శక్తులు నచ్చిన వాళ్లకు నచ్చుతాయి.
బాలయ్య , బోయపాటి అభిమానులకు ఏ మాత్రం నిరాశ కలగదు. హీరోయిన్ పాత్ర గురించి చెప్పడానికి ఏం లేదు.
జై జై జై జై జై బాలయ్య.
నోట్: నేను unstoppable కు వీరాభిమానిని.
Comments
Post a Comment