మనిషికి భయానికి మించిన ఓటమి మరేది లేదు. నాకు చిన్నప్పటి నుంచి నీళ్ళంటే భయం. అమ్మమ్మ వాళ్ళ ఊరిలో రంగ సముద్రం అనే పెద్ద చెరువు ఉండేది. ఆ ఉరిలో చిన్నా పెద్దా ఆడా మగా తేడా లేకుండా దాదాపుగా అందరూ ఈత వచ్చినవారే ఉండే వాళ్ళు. మా అమ్మ ,పిన్ని లు అమ్మమ్మ కూడా తెగ ఈత కొట్టే వాళ్ళు. చెరువు మధ్యలో ఒక పడిపోయిన రాజా వారి విడిది ఉండేది సుమారు నాలుగైదు కిలో మీటర్ల దూరంలో . పందెం వేసుకొని అక్కడ దాక ఎవరు ఫస్టు వెళ్ళి వస్తారో అని మరీ ఈతకొట్టే వాళ్ళూ, ఎండా కా లంలో మరీను. నేనూ ఐదవ తరగతి వరకు అక్కడే చదువుకున్నా . నాకు ఈత నేర్పాలని చాలా శ్రమపడి విఫలమయి ఊరుకున్నారు.
తరువాత నాన్న మా ఊరిలో ఉన్న పిట్టల బావి లో నాకు, మా అన్నయ్య కు ఈత నేర్పాలని తీసుకెళ్ళాడు. నీళ్ళంటే ఉన్న భయంతో నీళ్ళలోకి దిగగానే నాన్న మెడ గట్టిగా పట్టేసుకున్నా దాంతో ఇద్దరం మునిగిపోబోయాం. పైన ఉన్నవాళ్ళు వచ్చి తీసారు బయటికి . అలా ఆ ప్రస్థానం ముగిసింది.
తర్వాత ఎన్నో ఏళ్ళు ఇక ఆ సంగతే మర్చిపోయా . ఈ మహానగరాలలో జీవితాలు- చెరువులు, బావులూ ఎక్కడివి, స్విమ్మింగ్ పూల్స్ తప్ప. పిల్లలు కొంచెం పెద్ద వాళ్లయేవరకు అసలేమి గుర్తు రాలేదు. వాళ్ళూ చక్కగా స్కూల్లో కొంచెం నేర్చుకొని అమ్మ వాళ్ళ ఇంటిదగ్గర బావుల్లో పూర్తిగా నేర్చుకున్నారు. 2013 లో ఎందుకో సడన్ గా మళ్ళీ ఈత మీదా ధ్యాస మళ్ళింది. స్విమ్మింగ్ పూల్ లో నేర్చుకొని చక్కగా నీళ్ళ భయం పో గొట్టుకోవాలనుకున్నా. (ఎందుకా ధైర్యం చేయగలగానంటే నీళ్ళ లోతు మన కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి.) అనుకున్నదే తడవుగా ఒక పూల్ లో చేరా ఇంటికి కాస్తా దూరం. లేడిస్ టైమింగ్ కనుక్కొని వెళ్ళా . ఏ ఆట ఆడాలన్నా ఏ కొత్తది నేర్చుకోవాలన్నా ముందు డ్రెస్స్ లు, షూ లు మొదలైనవి కొనాలి గా , మా నాన్న దీన్నీ చదువు చారెడు బలపాలు దోసెడూ అనే వాడు. ఇక ఈత నేర్చుకోవడానికి డ్రస్ కాక, ఈత కళ్ళద్దాలు, చెవుల్లో పెట్టుకొనే ప్లగ్స్ ఇంక ముక్కుకి కుడా ఒకటిచ్చారు తెలియక గట్టిగా పెట్టుకుంటే నీళ్ళలో మునిగిపోవడం కూడా అవసరం లేదు పై లోకానికి చేరడానికి . ఇక అవన్ని ధరించే సరికి మనసులో అదేదో చేప పిల్లలా తెగ ఈదినట్టూ ప్రపంచాన్నే జయించినట్టూ అనిపించిది. ఆ స్విమ్మింగ్ పూల్ 4 ఫీట్ నుంచి 7 ఫీట్ వరకు లోతు ఉంది. 4 ఫీట్ లో దిగడానికి ఎంతో కష్టపడిపొయా మునిగిపొతానేమో అని. అలా మొదటి రోజు నీళ్ళలో దిగడం మాత్రమే జరిగింది. రెండో రోజు ఇంకో 6 మంది జత కలిసారు కొత్తగా నేర్చుకుంటున్నవాళ్ళు. మాటా మాటా కలిపి కొంచెం దిగి నీళ్ళతో అలవాటు అయ్యేలోపే గంటసేపు అయిపోయేది. మరుసటి రోజు మళ్ళీ కొత్త. సరే మొత్తం మీద కోచ్ బ్రీతింగ్ నేర్పసాగాడు నీళ్ళలో ఎలా ఉపిరి బిగించాలి బయట ఎలా నోరుతో తీసుకోవాలి అని తరువాత నీళ్ళలో తేలడం నేర్పాడు . ఫ్లోటీంగ్. అరె వా నీళ్ళలో తేలిపోతున్నానే అనుకున్నా . తరువాత కాళ్ళూ కొట్టడం నేర్పాడు . లెగ్ బీటింగ్. (ఇది ప్రొఫెషనల్ ట్రైనింగ్ మరి, బావుల్లో చెరువుల్లో నేర్చుకున్నవాళ్ళకి ఇవన్నీ తెలియవట, నీళ్లల్లో పడితే చక్కగా ఎవరి స్టైల్లో వాళ్ళు ఈదుకుంటూ బయటికి రావటం మాత్రమే వాళ్ళకు వచ్చు.)
అది ఫరవాలేదు వచ్చింది. ఇక అలా ఊపిరి బిగ పట్టి కాళ్ళు కొట్టూకుంటూ ముందుకు వెళ్ళమన్నాడు, అదీ అయ్యింది. ఇక చేతులు కొట్టడం రావాలి. అందరు అమ్మాయిలు ఉత్సాహంగా చకా చకా చేపల్లా నీళ్ళ లో వెళ్ళడం మొదలెట్టారు, అటూ ఇటూ అయిదు, ఆరు ఫీట్ లలో కి వెళ్ళి మరీ . నాకు ఎంతో సిగ్గు అభిమానం అనిపించాయి.అందుకే ఇక టైమింగ్ మార్చా , అందరూ వెళ్ళే టైం కాక వేరే సమయానికి .
యూ ట్యూబ్ లో వీడియో లు కూడా తెగ చూసి ఓస్ ఇంతేనా అని వెళ్ళే దారిపొడుగునా ఊహలలో ఈదుకుంటూనే వెళ్ళా పూల్ కి. కోచ్ చెప్పిందంతా గుర్తు తెచ్చుకొని ఈదటం మొదలెట్టా.. ఒక్కదాన్నే ప్రయత్నించా , ఫరవాలే కొద్ది గా వచ్చింది అమ్మయ్య అనుకున్నా.
అలా రెండు మూడు రోజులు చేసి చేసీ మళ్ళీ మామూలు సమయానికి వెళ్ళా నాకూ వచ్చు అనే గర్వంతో. మా కోచ్ చూసి , సరే అందరూ నీళ్ళలో తేలటం ,ఈదటం నేర్చుకున్నారు కదా ఇక 10 ఫీట్ లోకి దుమికి చేద్దురు గాని పదండి అన్నాడు. అందరు సరే సరే వెళ్దాం అని బయల్దేరారు. నేను ఏంటీ దుంకేదీ అయ్యో నాన్న కుడా లేడే సమయానికి గొంతు పట్టుకోవడానికి , హతవిధీ అనుకున్నా ( మా కోచ్ నీళ్ళలోకి అరుదుగా కాని దిగడు గొంతు పట్టుకొనే భాగ్యం కల్పించడానికి) పైగా ఒక పొడుగాటి కర్ర చూపించి మీరు మునిగి పోతుంటే ఇది అందిస్తాము పట్టుకొని ఒడ్డుకి రండి అని.తేలడం,ఈదటం వచ్చి మునిగిపోతున్నారంటేనే భయంతో కదా ,అలాంటిది ఆ భయం లో కర్ర పట్టుకునే బయటికి వచ్చే తెలివే ఉంటే తేలుకుంటూనే రావచ్చుగా. దేవుడా!!
ఎంతకీ నీళ్ళలోకి దుంకక గింజుకుంటుంటే ధభాల్న ప్లానింగ్ ప్రకారం నన్ను నీళ్ళల్లో తోసివేయడం, నా ప్లానింగ్ ప్రకారం నేను వెంటనే నీళ్ళు మింగి మునిగిపోయి వాళ్ళ కర్రకు పని కల్పించడం వెంటనే జరిగిపోయింది. ఇంకా కాసేపుంటే అరుదుగా దిగే మా కోచ్ దిగి నన్ను తీయాల్సిన పరిస్థితి.
అంతే రెండో సారి నా ఈత ప్రసహనం వచ్చి రానట్టుగా ఆగిపోయింది.

Chala manchi gnapakaanni vivarincharu.. Adento naku kuda inka alanti bhayame undi madam. .But meeru entha chakkaga raasarante chaduvutunte kanipinchentala ,oohinchukunenthala... Tq u for sharing mam. ..Chinnathanam gurthochindi naku kuda @jagadishwer
ReplyDelete