కళ్యాణ వైభోగమే..



చిరంజీవులు అఖిల్, సంహిత కళ్యాణ వేడుకల సందర్భంగా నిశ్చితార్థం మొదలుకొని రిసెప్షన్ వరకు అత్యంత ఉత్సాహంగా, ఆసక్తిగా కలివిడిగా.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీలైన ..వీలు కాకున్నా చేసుకొని దూర ప్రయాణానికి రైళ్లలో, బస్సులో, కార్లల్లో, విమానాలలో, ( తిరుపతి లో) వెరవక , ఝడవక లగేజీ ఎత్తి దించడానికి వెనుదిరగక పాల్గొని ప్రతి వేడుకను సంప్రదాయ బద్దంగా మరియు కాలానుగుణంగా జరిగేందుకు తోడ్పడ్డ ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. 




రూములు సర్దుబాటు చేసుకొని..వీనుల విందైన పెళ్లి పాటలతో అలరించి..సమయానికి అందుబాటులో ఉండి అన్నిటికీ వెన్నుదన్నుగా నిలిచారు. డబ్బు పేరు అధికారం గొప్పకాదు అని మన అనే విలువైన బంధువర్గాని మరేదీ సాటి రాదని మరొక్కసారి నిరూపించారు. 
Special mention: చంటి పిల్లవాడితో వందల కిలమీటర్లు కు వెరవక బెంగుళూరు - హైదరాబాద్ బెంగళూరు - తిరుపతి - బెంగుళూరు - హైదరాబాద్ - బెంగుళూరు తిరిగిన అన్నింటిలో పాల్గొన్న అనూష శ్రీనివాస్ వేదాన్ష్ కు...

సప్త సాగరాలు ,తెల్ల దొరల దేశాలు ,పిల్లల పరీక్షలు అన్ని అఖిల్ పెళ్లి ముందు బలాదూర్ అని వారం ముందే వచ్చిన మన వాళ్ళు, 


పెళ్లికి ఎంతో ముందునుంచి సాంప్రదాయ పెళ్లి పాటలు సేకరించి నేర్చుకొని అద్భుతంగా అఖిల్,  సంహిత కల్యాణమే వైభోగమే అని పాడిన గాన కోకిలలు,

 పదిహేను రోజుల ముందునుంచి ఫలహారాలు చేద్దామని ..పెళ్లి పనులకు హడావిడిగా పెళ్లి ఇంట్లో కోలాహలం చేసి రక రకాల తిను బండారాలు చేసిన తోడికోడళ్ళు, ఆడపడుచులు, అత్తలు, చిన్నమ్మలు. 

మంగళ స్నానానికి ఉల్లాసంగా పచ్చ బట్టలతో గులాబీ నీళ్లతో పెళ్లి కొడుకు వేడుకలు జరిపిన కుర్ర వర్గానికి,ఆశీర్వదించిన పెద్ద వాళ్లకు.. మధు పర్కాలు పసుపులో తడిపి తయారు చేసి.. పెళ్లికి మడి చారు చీరలు కొని కట్టుకొని మరీ హడావిడి చేసినవారందరికీ... 


పందిరి పూజ దగ్గర్నుంచి వంతుల వారీగా పెళ్ళికొడుకుని చేసి పాలికలు సాగనంపే వరకు పాల్గొన్న వారందరికీ.. కాశీ యాత్రలో పెళ్ళికొడుకుకు మొదట పెళ్లి ముఖ్యమా, విద్యాన్వేషణకై ప్రపంచ యాత్ర ముఖ్యమా అని సంశయానికి సరైన సలహా ఇచ్చి..జంటకి దృష్టి తీసి పీటల పైకి ఆహ్వానించిన వారందరికీ... 

వివాహం అనుకున్న రోజు నుంచి అన్నిటినీ అందరినీ కలుపుకొని.. పూజా సామాగ్రి మొత్తంతయారు చేసి.. విస్తర్లు..వేసి....తీసి..( ఎంత చెప్పినా వినకుండా) ఇది నా పని ఇది కాదు అని చూడకుండా అన్ని.. అంతా తానై నిలిచిన సత్యా సమేతుడైన ప్రసన్న అన్నకు ... 

వెనకటి మాదిరిగా వంటలు ఇంట్లో చేయకున్నా, వచ్చిన వంటల్ని అందుకుని అందరినీ సాదరంగా ఆదరించి..కొసరి కొసరి వడ్డించి పంపించిన వారందరికీ... మడి వంటలు చేసి స్వాములను సంతుష్టు లను చేసి పుణ్యం సంపాదించిన వారికి.. ఊర్లు/ రాష్ట్రాలు/సప్త సాగరాలు దాటి, పిల్లల చదువులు..ఉద్యోగ భారాలు కొంత పక్కన పెట్టి..అన్ని వేడుకల్లో తల్లో నాలుకలా పాల్గొన్న వారందరికీ....ఎంత చెప్పినా తక్కువే ,ఎంత చేసినా తక్కువే.. #wedding

Comments