మంగళ హారతులు -Mangala Haratulu

                                                                     1


జయ హారతి జానకీ పతి  !2!
జయ హారతీదే జలజార్ధనాభా
జయము మీద సతి సీత తోడ గూడి ! జయ!

1) పసితనమూన కౌశికుని యాగమును గావలేదా వేదా రఘు రామ
పతీ శాపమున పడీయున్న ఆ రాతి నాతిగ చేసి ఖ్యాతి గాంచిన రామా !జయ!

2) శివుని చాపమెత్తి సీతను చేపట్టి పరిణయమైనట్టీ పట్టాభిరామ
ఎల్ల దేవతలు పెల్లు కీర్తీ శాయ సలలితంబుగా సాకేతపురనివాసా  !జయ!

3) కైక ఆనతిచ్చి కాననంబులకు కాంతతోన  గూడి కశ్టముల కోర్చి
కనికరించి భరతునకు  పాదుకలొసగి రాజ్యమునేలిన శ్రీరామచంద్ర !జయ!

*******************************

                                            2

రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ 
మామకాభీష్టదాయ  మహిత మంగళం 

1.కోసలేశాయ మంద హాస దాస పోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళం
2.చారుమేఘరూపాయ చందనాదిచర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం
3.లలితరత్నమండలాయ తులసివనమాలికాయ
జలద సదృశ దేహాయ చారు మంగళం
4. దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ
చాప జాత గురు వరాయ భవ్య మంగళం
5.పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ
అండజ వాహనాయ అతుల మంగళం
6.విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ
సుముఖచిత్తకామితాయ శుభద మంగళం
7.రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం ...సర్వమంగళం
**************************************
                                                    3
నీరేజనయన రామ  నిగమవేద్య మంగళమిహ నీరేజనయన రామ !2!
1. సారసాక్ష వంశ సోమ సత్య సద్గుణాభిరామ !2!
 కువలయ ధర్మైఖ్య చరణ కోటి సూర్య సదృశ కిరణ   !నీరేజనయన రామ!
2.నీల నీరద సదృశకాయ నిఖిల మౌని చరణ గేయ !2!
పాలిత  శ్రీ ఆంజనేయ పరమ విక్రమ మణికాయ  !నీరేజనయన రామ!
3. రామచంద్ర సుఖవి వినుత రాజేంద్ర సమాన చరిత !2!
సోమార్చిత భక్త నిరత సుఖద నారదాది సేవిత   !నీరేజనయన రామ! 
****************************************
                                      4

మంగళమిదే గోపాలా గోపాలా.....
మంగళమిదే గోపాలా గోపాలా.....

1) సుందర నళినా  సురుచిర నయనా ...!2!
బృందావన భవనా...భయహరణా. కృష్ణా ...!మంగళమిదే గోపాలా!
2) కాననమున నీ గానామృతమే ...!2!
కామితమౌ మది గనగా ...తగుననగా... కృష్ణా !మంగళమిదే గోపాలా! 
3) కురుమది గిరికందరమున వెలసిన ...!2!
పరమపురుష తత్వము ....పాలన చేయవే ...కృష్ణా !మంగళమిదే గోపాలా!   
**************************************
                                         5
మహీ నాయకా జయ మంగళమిహస్తే !2! మహీ 

1.విరజాంబుజ లోచనా... మహితా నీలోచన   !2!
శకలిత హిత గుణ సూరి పోషా హరే !మహీ నాయకా!
2. కమలాలయ మానసా..కమలా కేళీరస !2!
సుమశర హిత గుణ శ్యామలాంగా హరే !మహీ నాయకా!
3.నతరంగ నాతానుత... శ్రిత యశో మానిత  !2!
సుమశర హిత గుణ సూరిపోషా హరే  !మహీ నాయకా! 
****************************************
                                      6
మందారధీర విహార మంగళ హారతి ఇదిగో 
మందార ధీర విహార 
1. చిన్ననాటి నుండి నీవు కన్యల కాముడమవురా !2!
 పన్నగ తల్పుడ నిన్నే సన్నుతి చేసేద రార...!మందారధీర!
2. గోపిక మానస చోర గోవర్ధనా గిరిధరా !2!
   గోవింద గోకుల బాల రాలేల ఎదుబాల  !మందారధీర!

***********************************************
                                           7
కృష్ణా గోపీ వల్లభా జయ మంగళం కృష్ణా గోపీ వల్లభా !2!

1. విష్ణు మురాంతక వేణూ నాద వినోద !2!
   నిష్ణాత బహుదీన కృష్ణా మానస వాస !కృష్ణా గోపీ వల్లభా !
2.యమునా నదీ తీర రమణీయ విహారా !2!
  రమణీ మొహన వీష రతిరాజ పరిపోషా !కృష్ణా గోపీ వల్లభా !
3. అతసీ సుమాకార హతసీమ నగధీర !2! 
శతకోటీ  కరవీర వితతమాన విదుర !కృష్ణా గోపీ వల్లభా !
4.శృంగార రసపూర శృతిచోర విహార   !2!
రంగనాథ కవీంద్ర రాజీవదివసేంద్రా !కృష్ణా గోపీ వల్లభా !  
********************************************************
                                                              8
హారతి గైకొను   అర మర శాయక  
ఆశ్రీత పాల శ్రీరామచంద్ర 

1.శివుని విల్లు విరిచి సీతను 
పెండ్లి ఆడి !2!
పరుశ రాముని  భఙ్గ పరచిన శ్రీరామ !2!

2.అచ్చుతా ఆఆ అచ్చుతా పాపాపరిహార !2!
సీతా మనోహర శ్రీరామచంద్ర !2!

హారతి గైకొను అరమర శాయక

*************************************************
9
రంగ నాయక మంగళాన్గ తుంగ వైభవ మంగళం

దీన బాన్ధవా దాన పాలక
శ్రీనివాస కేశవ
గరుడ గమన మధుర వచన 
వనజ రుచిర లోచన 

!రంగనాయక!

1. కనక రాశి కన్యకా కుచ పూర్ణ కుంకుమాంకిత లలిత చేలా
కనకశీల నీరాజాభ మాధవ !2!

2. మురముఖేన్ద్ర  శైలశీలా నర్మ శాల లాలస బుక్క నగర వంశ పోషక  శంఖు చక్ర భూషణ !2!

రంగ నాయక మంగళాన్గ తుంగ వైభవ మంగళం

*******************************************
                                  10
హారతి మీరెల ఇవ్వరే మంగళ హారతి మీరెలా ఇవ్వరే 
హారతి మీరేల ఇవ్వరు జ్ఞాన విద్యల ప్రభలకు !2!
లీలతో పదహారు వన్నెల మేలిమి బంగారు తల్లికి !2!

1. పాదములకు పూజాసేయరే మా తల్లికిపుడు పారిజాతపు హారమివ్వరే !2!
ఆణి ముత్యపు హారములు మొలనూలు గజ్జెలజోడు  అందెల 
రావల పాపిట బొట్టు ముంగెరా
సమముగా ధరయించు తల్లికి 

!హారతి !

****************************************
11 కమళాకాంతుని కన్నుల వెలుగుకు శ్రీ మంగళం 
కరుణను చూపే కరివదనునికి జయ మంగళం !!శ్రీ మంగళం జయ మంగళం!!

1. కాలనాగుపై చిందులేసిన కాలి గజ్జెలకు మంగళం 
రోటికి కట్టగ నడుము న మ్రోగె రవ్వల మువ్వకు మంగళం !!శ్రీ మంగళం జయ మంగళం!!

2. చిత్తము చిలికి చేత బట్టిన వెన్న ముద్దకు మంగళం 
శ్రీత జనపాలక లోకనాథుని శిఖ పించముకే మంగళం 
!!శ్రీ మంగళం జయ మంగళం!!

3. గణ గణ గజ్జెల రక్కసు గూల్చెడి ఓంకారతికే మంగళం
సహస్రాల కమలమ్ముల కీర్తి ని జ్ఞానపద్మామా మంగళం 

!!శ్రీ మంగళం జయ మంగళం!!

4. విజయ నాదమై జ్ఞాన రూపమై పాంచజన్యమా మంగళం
దర్శన మొసగే శ్రీహరి సత్య సుదర్శన మునకే మంగళం

!!శ్రీ మంగళం జయ మంగళం!!

5. అన్నుల నిందినాకౌస్తుభ మణికి శ్రీ మంగళం
వెన్నుడు పట్టగా విశ్వము నిండిన వేణుగానమా మంగళం 
!!శ్రీ మంగళం జయ మంగళం!!

6.హరి హృదయమునే హరియించిన శ్రీ ఆదిలక్ష్మీ  కే మంగళం

తిరమున చేర తిరముగా కాచే తిరు నామముకే మంగళం





Comments