స్థితి లయలు




నేను స్ఫూర్తినన్నావు. ఆరాధిస్తున్నానన్నావు.....
గౌరవం తో  కూడిన ప్రేమన్నావు,ఇష్ట సఖినన్నావు.
కలల రాణినన్నావు, కలనైన మరువనన్నావు.
ఊరేగిస్తానన్నావు..ఊహకందనన్నావు.

నేను జారిపోయే పాదరసాన్ని అంటే
దాన్ని ఒడిసి పట్టే ధర్మామీటరనన్నావు.
గౌరవంప్రదర్శించావు...ప్రేమ కురిపించావు.
భావావేశం తో బందీ ని చేసావు.

మాటలు చాలన్నావు...సాన్నిహిత్యం కోరావు..
తాత్కాలికం అంటే చిరకాలం అన్నావు.
అయిష్టాన్ని ప్రదర్శిస్తే..అల్లాడిపోయావు.
నిర్లక్ష్యాన్ని చూపిస్తే నిలబడలేక పోయావు.

మాట ఆపితే మరుగైపోతావనుకున్నాను.
మనసులో మాటి మాటికి మార్మోగిపోతావనుకోలేదు.
నిలకడ లేక పిలిస్తే..హుందాగా పలికావు.
గొప్పదాన్ననుకున్నాను, గొప్పవాడివయ్యావు.
అంతుచిక్కకున్నావు..అందలేకున్నాను...
అందుకోలేకున్నాను...ఆలోచిస్తున్నాను

Comments

Post a Comment