వచ్చే వచ్చే కరోన మహమ్మారి వచ్చే

వచ్చే వచ్చే కరోన మహమ్మారి వచ్చే
గత్తర, ప్లేగు. ఎబోలా,సార్స్... 
సరసన అంటువ్యాధి చేరే
ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం,
ఒక దేశం కాదు..ప్రపంచాన్ని 
శాసిస్తానని వికృత హాసం చేసే

విర్ర వీగు అగ్ర రాజ్యాలను 
అతలాకుతలం చేసే
కానీ కానని చిన్ని రాజ్యాల 
యుక్తులన్ని చాటే

ప్రభుత్వాలు  కరోనా పై 
యుద్ధశంఖారవం  పూరించే......
మానవాళిని, వాణిజ్యాన్ని
గృహాలకే పరిమితం చేసే

వైద్యులు, నర్సులు  మాత్రం
మాస్కులని, గ్లవ్ లని రక్షణ  కవచాలేసి
పిట్టల వలె రాలి పోయే ప్రాణాలకు
తమ ప్రాణం అడ్డుపేట్టె
అపర ధన్వంతరు లాయే.

దగ్గినప్పుడు పడే సూక్ష్మ తుంపరల
తో వచ్చునో లేక గాలి ద్వార వచ్చునో
ఈ మహమ్మారి కానీ 
అతి సులువుగా అంటుకుని
విశ్వమంతా పాకే.

కట్టడి చేయ పూనిన రక్షక  భట
బృందం బుజ్జగించి , బతిమాలి..
ఆపై లాఠీ నృత్యం చేసి 
కఠినులని పేరు పడి ఒక పక్క
కాలిన కడుపులతో కకావికలమవుతున్న 
అన్నార్తులకు తిండి పెట్టి ఆశ్రయమిచ్చి
మానవతను చాటిరి మరోపక్క

వరద రాని, వ్యాధిరాని భూకంపం రాని 
మా పని మాత్రం మానం ...
మనుగడ కై వేసే చెత్త నే కాదు
 మీ మనసుల చెత్త ను సైతం
 మా సేవలతో ఊడ్చి పారేస్తామని
 పారిశుధ్య కార్మికులు చీపురెత్తి 
గర్వంతో నినాదాలు చేసే..


పురపాలక అధికారులు మాత్రం.. 
అన్నీటిలో తామై అందరి మధ్యా 
వారధియై అందరికి సారధియై 
ఖాకీ పని ,పాకి పని ఆయాపని నర్సు పని
కరోనా గిరోనా జాంతానై అని 
అలుపెరగక అహర్నిషలు 
గుంభనంగా పనిచేసే
ఈ మాయదారి కరోనా పై
యుద్ధంలో తమ పాత్రను పోషించే
గెలుపుకై వీక్షించే




Comments

  1. Excellent madam👌🙏🙏
    it is showing how serious u r on prevention of corona and observing situations so keenly

    ReplyDelete

Post a Comment