ఆన్ లైన్ చదువులు- కరోనా

కరోనా పుణ్యమా అని పాపం చిన్న పిల్లలకి ఆన్ లైన్ క్లాస్స్ తాకిడి మొదలయ్యింది. దీనికి  సంబంధించి నా అనుభవం ..........

నాకు మొదట్నుంచి సైకాలజీ చదవాలని మనుషుల ప్రవర్తన, దాని వెనక కారణాలు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి. (కొంత ఇప్పటికే ఆ శక్తి నాకుందని నా నమ్మకం కుడానూ, దానికి శాస్త్ర పరంగ రంగులు దిద్దితే ఇంక ప్రావీణ్యురాలు కావచ్చు అని అత్యాశ). సరే ఒక మంచి సైట్ లో ఒక టాప్ ప్రొఫెసర్ క్లాస్ లకు ఎట్టకేలకు ఎన్ రోల్ చేసుకున్నా డబ్బులు కట్టి. చూస్తే కొన్నే క్లాస్ లు కనిపించాయి ఓస్ రెండు రోజుల్లో అయిపోగొట్టి ఇక అందర్ని అర్థం చేసుకోగలను, నాకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనుకున్నా కూడా మరి.
   

మొదటి రోజు మొదటి క్లాస్ కోర్స్ ఓవర్ వ్యూ చూడాలా వద్దా ..చూస్తే అదే ఒక సబ్జెక్ట్ లా అనిపించింది  తప్పక రెండు సార్లు చూసా అబ్బె... ఎక్కలా..... 

 చాప్టర్ లే కదా అని ముందుకు ముందుకు ఫార్వర్డ్ చేసా..సర్లే మొత్తం ఒక్కరోజే ఎందుకు అని మూసేసా.

ఇంక రెండో రోజూ అంతే  మొదటి రెండో క్లాస్  లకే మంగళం.  తర్వాత కొన్ని రోజులు అసలు లాగ్ ఇన్ కూడా కాలే.  మళ్ళీ బుద్ధి తెచ్చుకొని మొదలు పెట్టి అలా క్లాస్ లు చూస్తే మంచి డయాగ్రాం ఉన్నది ఒక్కటి చూసి విన్నా బానే ఉంది, హమ్మయ్య ఫోకస్ కుదిరింది ఇంక అయిపోగొట్టొచ్చు అనుకున్నా. తర్వాతి క్లాస్ షరా మాములే.

మరో రోజూ అలా ఫొన్ తీయగానే ఫోన్ లో సరిగా సౌండ్ క్లారిటీ లేదు అందుకే నాకు ఏకాగ్రత రావట్లే అని లాప్టాప్ తీసా ఊహూ ఇక లాభం లేదు.. ఇయర్ పాడ్స్ తీసా (మాములుగా నాకు వాడటం అస్సలు ఇష్టం ఉండదు )

ఆదీ అయ్యింది ఇంక్కొక్క క్లాస్ నాలుగు సార్లు మళ్ళీ మళ్ళీ వినగా ముగిసింది.  

తర్వాతి రోజు ..క్లాసా నెట్ఫ్లిక్సా  ప్రైం వీడియో నా  ఇంకి పింకి పాంకి అయ్యింది ప్రైం వీడియో గెలిచింది...సినిమా మాత్రం డైలాగ్  మిస్స్ అవ్వకుండా మొత్తం చాలా ఫోకస్ తో చూసేసా. 

రేపు మాత్రం ఖచ్చితంగా నాలుగు క్లాస్ లు ఫినిష్ చేస్తా. తప్పకుండా .😁😊 

ఇప్పుడు చెప్పండి పిల్లల ఆన్ లైన్ ల క్లాస్ ల గురించి ......

Comments

  1. When difficult to retain concentration in offline,how could keep we concentration in online,(success rate is only 10 to 20%!

    ReplyDelete

Post a Comment