లేక లేక దొరికిన సెలవు రోజు, ఒక తెలియని నంబర్ పోన్ లో మోగింది. అబ్బా అనుకున్నా
కానీ ఎవరికి ఏం అవసరమొచ్చిందోలే చేయగలగితే ఏముంది, అసలే కరోన కాలం, ఇవన్నీ మాములే
కదా అని ఎత్తి "హలో" అన్నాను. "మేడం నేను బోయినపల్లి నుంచి మాట్లాడుతున్నాను మీరు
జి హెచ్ ఎం సి కూకట్ పల్లి డిప్యూటి కమీష్నరేనా కంట్రోల్ రూం కు కాల్ చేస్తే మీ
నంబర్ ఇచ్చారు అన్నాడు. అవును చెప్పండి అన్నాను. మాములుగా అయితే మాకు పాజిటివ్
వచ్చింది మందుల కిట్ కావాలి,లేక పోతే స్ప్రే చేయించండి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి
లాంటివి అడుగుతుంటారు. ఇలాంటిదే ఉంటుంది అని.
అతను ఇలా చెప్పాడు. 'మేడం మా ఫామిలి
అంతా మూడు రోజుల కిందట కరోనా టెస్ట్ చేయించుకున్నాం, ఇంటికి వచ్చి సాంపుల్
తీసుకున్నారు అని ఒక పాజ్ ఇచ్చాడు. నెక్ష్ట్ రోజు రిజల్టు ఇస్తామన్నారు కాని ఫోన్
చేస్తే ఎత్తలేదు. తర్వాతి రోజు ఎత్తారు ఇస్తాము ఇస్తాము అని తర్వాత స్విచ్ ఆఫ్
చేసుకున్నారు. నిన్న కాల్ చేస్తే ఫోన్ ఎత్తి సాంపుల్ పోయింది అన్నారు మళ్ళీ వచ్చి తీసుకుంటాము అన్నారు. కాని ఆ తర్వాత మళ్ళీ ఫోన్
ఎత్తట్లేదు అని చాలా ఆవేదనగా అన్నాడు.
మీకు ఎలా వుంది సింప్టంప్స్ ఏమైనా ఉన్నాయా టెస్ట్ చేయించాలా అని నేను అడిగాను. లేవు మేడం అన్నాడు. మరేం కావాలో నాకు అర్థం కాలేదు.
చూడండి మీకు కరోనా లక్షణాలు ఉండి టెస్ట్ కావాలంటే చెప్పండి మీకు దగ్గర్లోనే మా "బస్తి దవఖానా" లో చేస్తారు మేము చేయిస్తాము, లేదు వాళ్ళు డబ్బులు తీసుకొని టెస్ట్
చేయలేదు, మా డబ్బులు మాకు కావాలి అంటే అక్కడికి వెళ్ళో లేక ఫోన్ లోనో నో అడగండి. లేదు మాకు న్యాయం కావాలి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళపై చర్య తీసుకోవాలి
అంటే అవి మెడికల్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి మీరు కంప్లైంట్ ఇవ్వండి , కరోనా తగ్గాక
కన్సూమర్ ఫోరం లో అడగండి. కాని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి ఆరోగ్య సమస్య
లు లేకుంటే హాయిగా ఇంట్లోనే ఉండండి , మీకు ఇంకా ఏమైన ఇబ్బంది ఉంటే మళ్ళీ కాల్
చెయండి అన్నా ఓపికగా . కన్విన్స్ అయ్యాడు, సరే మేడం అని ఫోన్ పెట్టేసాడు. ఇదీ విషయం.
అసలు ఇది మాకు ఏ మాత్రం సంబంధం లేని విషయం. కాని కంట్రోల్ రూం వాళ్ళు కాల్ చేసిన వారి ఇల్లు మా సర్కిల్ లో ఉంటే అర్జెంట్ గా మా నంబర్ ఇచ్చేస్తారు. అది విషయం ఏంటి అని తెల్సుకోకుండా.
ఇది ఒక మచ్చుక మాత్రమే. ఎందుకో షేర్ చేయాలనిపించింది
గుడ్ థింగ్ మేడం.. అన్నిటినీ అందరూ సమాధానం చెప్పలేం.
ReplyDelete