అలివేలు - పిట్టకథలు




మా ఇంట్లో పనిచేసే అలివేలు   గత పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నది.. నల్గొండ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత తన చేతిలో కూడా నాలుగు డబ్బులు ఆడతాయని 
 ఇళ్లల్లో పని చేయాలని అనుకోని వచ్చిన మొదటి ఇల్లు మాది. ఊరికి కొత్త ,డబ్బులపైన ఇంకా ఇక్కడి పని మనుషుల రాజకీయాలు ఇంకా ఒంట బట్టలే కాబట్టి వెంటనే కుదిరింది. మనిషి తెల్లగా విలక్షణంగా ఉంటుంది. పని కూడా శ్రధ్దగా చేస్తుంది. కానీ మాట మాత్రం విరుపు ఎక్కువ. చేతులు తిప్పుతూ గట్టిగా సూర్యకాంతం లా మాట్లాడుతుంది అన్ని విషయాలకు. త్వరలో నే మా ఇంట్లో మనిషి లా అయిపోయింది.

పోయిన వారం  రెండు రోజులు పనికి రానని  పెళ్లికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది ...వచ్చిన తర్వాత చూస్తే ముఖంలో ఏదో తేడా కనిపించింది. అంటే తేటగా ఇంకా అందంగా కనిపించింది.... ఏంటబ్బా తేడా అని ఒకటికీ రెండు సార్లు చూసాను అదే బొట్టు...నున్నగా దువ్వి వేసుకున్న జడ.. ఏమి మార్పు లేదు ..అక్కడికి అన్నా ఏంటో మార్పు ఉంది అలివేలు నీ ముఖం లో అని... ఏముంది ఏం లేదు అంది తన స్టైల్లో ఉడుస్తూ ఓరగా నాకేసి చూస్తూ.... మరుసటి రెండు రోజులు నేను బిజీ గా ఉండి ఈ విషయం మర్చిపోయా... ఇవాళ ఉదయం అలా సోఫాలో కూర్చుని టీ తాగుతూ అలివేలుని చూసా సడన్ గా తట్టింది... వెంట్రుకలకి రంగు వేశావా అలివేలు అని అడిగా ...ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతూ ఏటో చూస్తోంది... ఇంకా మొదలయ్యింది..మా ఇంట్లో వాళ్ళ తాకిడి.. ఏం రంగు వేశావు?, ఇంట్లో నా పార్లర్ లోనా?..ఎవరు వేశారు?... అలానే ఉంటే ఏమయింది...   అంటూ...
 నేను వేసుకున్నానా  అని మా వారు..తమాషాగా.. నీవేనా మీ ముత్యాలు ( వాళ్ళాయన) కు కూడా వేశావా అని ప్రశ్నల వర్షం కురపించారు.   ఆ ..పెండ్లికి పోతుంటి మరి మా అమ్మ ,నా బిడ్డ అందరూ ఒకటే చెప్పవట్టిరి... మా అమ్మనే   ఏదో పొట్లం తెచ్చింది... నేనే పెట్టుకున్నా నెత్తికి అన్నది. మా అత్తగారు ఆమె చెల్లెలు ఒకటే నవ్వు అది విని.  "ఊడిన ఎంటికలు తెల్లగా ఉంటే కొంటలేరమ్మ ..నేను ఏ గ్లాసు లో గిన్నె నో తీసుకుంటా దాచిపెట్టి ఇచ్చి, అందుకే రంగు ఏసుకుంటే అవి కూడా వస్తాయి" అన్నది....ఇంకా చూడాలి మా షాక్.  అయ్యో  ఇన్నాళ్లు దాచిన ఊడిన వెంట్రుకలు వేస్టే నా అలివేలు అన్నా... "ఏం లే చేతులకు మిగిలిన రంగు దానికి రుద్దిన అమ్మిన ఏం తక్కువుందా అమ్మా ఎంటికల రేటు కిలో 1400 రూపాయలు అట".. అని చేతులు తిప్పుతూ..... అది విషయం...

Comments

  1. Very nice and candid. You should be writing more often.
    P.S. thoroughly enjoyed

    ReplyDelete
  2. చాలా చక్కగా...
    చెప్పే విధానంలో కొంత కొత్తదనంతో...
    కానీ...నల్లగొండ @ నీలగిరి ని వాడినా...
    ఆ జిల్లా పలుకులు/పిలుపులు లేవు...
    నాదీ నీలగిరినే కదా...

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete

Post a Comment