పుష్ప (ద రైజ్) Pushpa the rise review





సినిమా ను ఒక్కొక్కరు ఒక్కో కోణం లో ఒక్కో దృష్టి తో చూస్తారు. అంతేకాక తొంభై శాతం ప్రేక్షకులు నా లాంటి సామాన్యులు... రెండు లేదా రెండున్నర గంటల టైంపాస్  (బ్రేక్) కోసం చూస్తారు. అది ఎలాంటి భావోద్వేగాలతో కూడినదైనా మనల్ని సీట్ లో నుంచి కదలకుండా  కూర్చోబెడితే చాలు.  కొన్ని సస్పెన్స్, కొన్ని వినోదాత్మకంగా, కొన్ని స్ఫూర్తి నిచ్చేలా, కొన్ని గుండెలు మెలిపెట్టేలా.. ఉండొచ్చు.  కొన్ని సినిమాలు వాటి పాత్రలు  కానీ సన్ని వేషాలు కానీ కొన్ని రోజుల వరకు మన పై ప్రభావం చూపిస్తాయి. కొన్ని చూసినంత సేపు బోర్ కొట్టకుండా ఉండొచ్చు తర్వాత మరుపుకు రావొచ్చు.

నా వరకైతే పుష్ప హిట్.  అల్లు అర్జున్ నటన..ఆ పాత్ర మలిచిన తీరు...గట్టిగానే ఉన్నాయి. గంధపు చెట్ల అడవుల బ్యాక్ గ్రౌండ్...చిత్తూరు యాస, చిన్నతనంలోనే అనాదరణకు గురై తెగింపు మొండి ధైర్యం తో పెరిగిన పల్లె ప్రాంతానికి చెందిన  హీరో... బుద్ధి బలం, కండ బలం, మొండితనం తో ఎలా ఎదిగాడు అన్నది కథ. ( మార్గం ఏదని మంచి చెడుల గురించి కాదు) 

హీరో సిండికేట్ గా ఎదగడం..కొంచెం సినిమాటిక్ గా ఉన్నా ఎబ్బెట్టుగా ఏం లేదు. వయోలెన్స్ ఇప్పుడు వస్తున్న సినిమాలను చూస్తే ఓ లెక్కే కాదు. రష్మీక తన వరకు బానే ప్రయత్నించింది. అనసూయకు, సునీల్ కు ఎక్కువ నిడివి లేదు. ఉన్నంత వరకు బానేచేశారు. ఫాజిల్ కు బహుశా రెండవ పార్ట్ లో ముఖ్య పాత్ర వుండొచ్చు.

చంద్ర బోస్ కలం లో నుంచి అలవోకగా జారిన పాటల మాయాజాలం..దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి(సిద్ శ్రీరామ్) .."ఊ అంటావా"... సూపర్ హిట్.. మిగిలిన రెండు పాటలు కూడా సినిమా చూశాక  వినాలనిపిస్తాయి.డిఎస్పీ సుకుమార్ కాంబినేషన్ మళ్ళీ కలిసొచ్చింది.

ఎడిటింగ్, బాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం బాగా చెయ్యొచ్చేమో...మొత్తం మీద బానే ఉందమ్మి.... వేరే సినిమాలతో పోల్చి చూడొద్దు. దేనికదే.. 

My rating 3/5

Comments