విరాట పర్వం… ఏంటో దర్శకుడి ఆరాటం

విరాట పర్వం- సినిమాపేరు చూసి అందులో నటులను (సాయి పల్లవి , రానా ,ప్రియమణి , నవీన్ చంద్ర , మురళీ శర్మ, నీవేథా పేతురాజ్ లాంటి) చూసి , నక్సలిజం బేస్ ఉందని తెలుసుకొని ఓ రేంజ్ లో ఊహించుకొని (అయినా థియేటర్ లో చూడలేదు అదృష్టవశాత్తూ) ఓ టి టి లో చూసి ఇంకా డైజెస్ట్ కాక అసలు దర్శకుడు ఏం అనుకున్నాడో... ఏం తీసాడో ఇంకా అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నా. నేను మాములుగా ఏ సినిమా గురించి పెద్దగా ఆలోచించను... చూసామా..బాగుందా , బాలేదా అంతే ..ఒక్క వారం దాటిందంటే సగం, నెల దాటిందంటే మొత్తం కొన్ని సార్లు సినిమా పేరు తో సహా మర్చిపోతా. కానీ ఈ సినిమా మాత్రం మొత్తానికి ఆలోచనలో పడేసింది. నక్సలిజం ఉన్నప్పుడు ఓ సింధూరం లా ఉత్ఖంఠతో... హీరోయిజంతోనో... హీరోయినిజంతోనో...ఉంటాయనుకుంటే పొరపాటే... అలా అని మొత్తం లవ్ స్టోరి కాదు. లవ్ స్టోరీ కి బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతున్న సంఘటనలకి పొంతన ఉండదు... బాక్ గ్రౌండ్ స్కోర్ కు యాక్షన్ సీక్వెన్స్ కు అస్సలు మ్యాచ్ అవ్వవు. నేపథ్య సంగీతం దానంతకు అది బాగుంది. సినిమా స్క్రీన్ ప్లే దానంతకు అది నడుస్తుంటుంది. ఎక్కడ పొసగవు. చాలా మిస్సింగ్ లింకులు ఉన్నాయి. హీరోయిన్ కు హీరో పై ప్రేమ ఎందుకు,ఎలా కలిగిందో ఎలా చెప్పలేకపోతుందో... మనకు ఈ సినిమా లో ఏం ప్రాబ్లమ్ ఉందో అలానే చెప్పలేం..కొన్నింటికి కారణాలుండవు. సాయి పల్లవి నడదైన శైలి లో నటన తో కుమ్మేసింది. రానా కు పెద్ద రోల్ లేదు ఉన్నంతకు బాగా చేసాడు. రానా కే ఇలా ఉంటే ఇంక ప్రియమణి.. నవీన్ చంద్ర సంగతి చెప్పక్కర్లేదు.. నాలుగైదు సీన్లు.. నీవేథా కు గెస్ట్ రోల్ మాత్రమే(బ్రతికి పోయింది) .. బాగా లాగ్ సీన్లు చాలా ఉన్నాయి తెలుగు టి వి సీరియల్స్ లాగా.. వెరసి చూస్తే ఇలాంటి సినిమాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు... ఆశ్చర్య పోవచ్చు...

Comments