అందుకోవాలనుకున్నవన్నీ అందలమెక్కితే..
ఆలోచనలన్నీ అల్లిబిల్లి ఆసనాలిస్తే..
పలకాలనుకున్నవి పందిరికింద పడకేస్తే..
అడగాలనుకున్నవి తడబడి అలంకారాలైతే..
రాయాలనుకున్నది రానంటూ రాగం తీస్తే..
వెతకాలనుకున్నది వెనకే వేళ్లునుకుపోతే..
నడవాలనుకున్న నడత నక్కి దాక్కునిపోతే...
నవ్వాలనుకుని నవ్వు రాక నాగా పెడితే ...
చెందాలనుకున్నది చెంత రాక చేవగారిపోతే...
చేయాలనుకున్నది చేతగాక చంచలించిపోతే...
ఎక్కాలనుకున్న ఎత్తు మొదలు మూసుకుపోతే...
మార్గాన్ని వెంటనే అన్వేషించాలి..!
గమ్యం చేర్చే రహదారిని శోధించి సాధించాలి...!!
గగనానికి గాలం వేసైనా సరే అందుకోవాలి..!!!
Comments
Post a Comment