shakuntalam movie Review

సమంత అంటే ఉన్న అభిమానం తో  శాకుంతలం రిలీజ్ ఎప్పుడు అని చూసి చూద్దామా అని నేను సంహిత అడిగితే ఒక పక్క మా అఖిల్ మరో పక్క సాత్విక్ ఛీ, ఛీ అయ్యో ఆ సినిమా నా మేము రాము అస్సలు బాలేదట..మీరు వెళ్ళకండి అనిపించుకుని .. అన్ని రివ్యూలు చదివి అసలు బాలేదనిపించుకొని...అయితే తప్పకుండా వెళ్లాల్సిందే  అనుకుని మరీ  వెళ్ళాం నేను మా కోడలు.. 🙂 కట్ చేస్తే ఇంతకీ సినిమా ఎలావుందీ??


ఆదివారం... సిన్మా  రిలీజ్ అయి రెండు రోజులే అయ్యింది. అయినా థియేటర్ లో కింద 7 వరుసలు ఖాళీ.. పైన మాత్రం అందరూ వచ్చారు. మొదటి సగం సాగదీసి, సాగదీసి..కష్టపడి అలా అలా గడిచిపోతుంది.. మిగిలిన సగం లో టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉంటుందేమో అని తెచ్చుకున్న ఉత్సాహంతో... అలా బయటికి వెళ్లి వచ్చేసరికి సినిమా మొదలయింది..  మేమాశిన్చిన మలుపులు ఎక్కడ మిస్సవుతామో అని పై వరకు వెళ్లకుండా మూడో వరుసలో కూర్చుని తలెత్తుకొని గర్వంగా చూడటం మొదలు పెట్టాం. మొదటి సగం కంటే రెండో సగం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా కథ సాగుతుంది.. కానీ అశ మాత్రం నిరాశే అయ్యింది.


సినిమా మొత్తం మీద  అల్లు అర్హ ఆరంగేట్రం ( ఇదే మొదటి సినిమా అనుకుంటున్న, నాకు సరిగ్గా తెలియదు.)  మాత్రం అదిరిపోయింది. ముద్దు ముద్దుగా చక్కగా నటించింది. స్నేహ  అర్జున్  దిష్టి తీసారో లేదో అల్లు అర్హ కు. 


విజువల్స్ ..వి ఎఫ్ ఎక్స్ లాంటి పెద్ద విషయాలు నాకు తెలియవు ..కానీ సినిమా అంతా నేను ఇన్స్తాగ్రామ్ రీల్స్ లో వాడేవే ఎఫెక్ట్స్ ఉన్నాయి పాపం.😀😀


 చాలా అందమైన కావ్యంగా హృద్యంగా, సుతిమెత్తగా..హృదయాన్ని మెలిపెట్టెలా ( వాళ్ళ ఎడబాటు) మళ్ళీ హత్తుకునేలా చూపించడమే కాకుండా దుష్యంతుని వీరుడిగా , నిర్ణయాత్మకంగా, సమర్థుడిగా,నిష్పక్షపాతంగా, ఉదారంగా,  గాఢ ప్రేమికుడిగా..దృఢంగా చూపించి ఉంటే చాలా బాగుండేది.  కేవలం అందంగా మాత్రమే ఉంటే సరిపోదని కారక్టర్ బిల్డ్ చేస్తే ఒక వ్యక్తి కి అందం వస్తుందని అనిపిస్తుంది. ఒక అద్భుత ప్రణయ గాథ ను ఇంత పేలవంగా కూడా చేయొచ్చని తెల్సుకుని ముందు వరుసలో కూర్చున్నoదుకు చూసేందుకు వీలుగా ఎత్తుకున్న తలను కూడా దించుకొని బయటకు వచ్చేశాం.. 


సినిమా బాగుంటే చూడ్డం కాదు బాలేనప్పుడు ఎందుకు బాలేదో చూడడమే గొప్ప అనే మా కజిన్ అన్న మాటలకు కట్టుబడి సినిమాలో ఏమే మి చేయకూడదో క్షుణ్నంగా తెలుసుకొని పోన్లే 24 కళల కళాకారులకు న్యాయం చేసామనుకొని సర్ది చెప్పుకొని మళ్ళీ తలెత్తుకున్నాం..నేను సంహిత. 


తేలిపోయిన శాకుంతలం.

Comments