ఉద్యోగుల్లో రకాలు

నా ఈ ఏడాది అనుభవం లో గమనించిన విషయాలు.   ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు రకాలు.

1. అసలు పని చేయని వాళ్ళు. -  దీనికి చాలా కారణాలు. అ) వారికి అసలు పని రాకపోయి  ఉండొచ్చు. ఆ) పని వచ్చినా ఇతర ముఖ్యమైన వ్యాపకాల వల్ల కావచ్చు. ఇ) జవాబుదారీతనం  లేక కావచ్చు. ఈ) ఇతరేతర కారణాల వల్ల  కొన్ని చేసి కొన్ని చేయక పోవచ్చు.

 2. పని వెళ్ళ దీసే వాళ్ళు .- రోజు చక్కగా ఆఫీసు పనివేళలకు రావడం పోవడం. తమ ముందరున్న దస్తావేజులు  చూడటం . కొంచెం ఇబ్బంది కరమైనవి ఎమైనా ఉంటే పక్కన పెట్టడం చేస్తూంటారు. వీరితో ఎవరికి లాభం లేదు నష్టం లేదు . కాలం వెళ్లదీస్తుంటారు.


3. అనవసరమయిన పని చేసే వాళ్ళు/పని గాళ్ళు : వీళ్ళు  తాము చేయాల్సిన పని తప్ప అన్నీ చేస్తారు , మంచి భక్తులుగా గుర్తింపు పొంది తమ వృత్తి లో పై పై కి ఎదుగుతుంటారు. వీరికి పని రావాల్సిన అవసరం లేదు . రావచ్చు రాకపోవచ్చు.


4. పని తాపత్రయగాళ్ళు- చాలా అరుదుగా ఉంటారు. ఇచ్చిన పనిని కష్టమయినా , నష్టమయినా సరే  లబ్దిదారులకు  లాభం, సంతృప్తి   చేకూరాలని తిక్క తాపత్రయ పడుతూంటారు. వీరికి జవాబుదారి తనం ఎక్కువ. లౌక్యం తక్కువ. వృత్తి లో ఎదగే సూచనలు తక్కువ.  మంచి పేరు , అందరి అభిమానం మాత్రమే సంపాదిస్తారు.

మీకేదయిన కొత్త రకాలు తెలిస్తే చెప్పండిదుశ్శాలువా

(ఈ అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతం. ఎవర్ని ఉద్దేశించినవి కాదు.) నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో  కలవటానికి వచ్చిన ఉద్యోగులు సెక్షన్ల ...