లాలిపాటలు (సేకరించినవి)

                                            1
శ్రీ రమా రమణి లాలి రఘువంశ చంద్రుడా లాలి  !2!
కోటి సూర్య ప్రకాశ రూప లావణ్య మందార హాస    !! శ్రీ రమా రమణి లాలి!!


1. మత్స్యమై జలధి జొచ్చి సోమకుని ద్రుంచి వెదములు తెచ్చి !2!
    హెచ్చుగా పరమేష్టికిచ్చి దేవతలు మెచ్చగా చేసితివి  !! శ్రీ రమా రమణి లాలి!!

2. మంథరా గిరిజ నదిని సురలందముగ బట్టి చిలుకా  !2!
   పొందగా కూర్మమై వీపున బూని మొసితివి లాలి  !! శ్రీ రమా రమణి లాలి!!

           *******************************
                                        2
లాలనుచు నూచేరు లలనలిరుకడల
బాలగండ వర గోపాల నిను చాల ! లాలి !

1. ఉదుటగుబ్బల సరములుయ్యాలలూగ
   బదరికంకణ రవము బహుమత్లు మ్రోగ  ! లాలి !

2. ఒదిగిచెంపల  కొప్పు లొక్కింత వీగ
   ముదురు చెమటల నళికములు దొప్ప దోవ ! లాలి !

3. మలయ మారుత గతులు మాటికి జెలంగ
   పలుకు గప్పురపు తావి పైపై మెలంగ  ! లాలి !

4. పలుగాన లహరి ఇంపుల రాల్గరంగ
   బలసి వినువాని చెవి బడలిక తొలంగ ! లాలి !


   *************************************
                                              3
కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ  రంగ రంగ నిను బాసి నేనేట్లు మరచుందురా


1. కంసుణ్ణి సహరింప సద్గురుడు అవతారమెత్తెనపుడు
   దేవకి గర్భమునకు కృష్ణావతారమై జన్మించెను    !కస్తూరి రంగ రంగ !

2. ఏడు రాత్రులు చేరిచి  ఒకరాత్రి ఏక రాత్రిగ చేసెను.
   ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను  !కస్తూరి రంగ రంగ !

3. తలతోన జన్మించితే తనకు బహుమోసంబు వచ్చుననుచూ
   ఎదురుకాళ్ళుగా పుట్టెను ఏఅడుగురు దాదులను చంపెనపుడు  !కస్తూరి రంగ రంగ !

4.నేలమేఘపు చాయలు నేమెను హారములను
సద్గురుండు వ్రాసినాడు నా తండ్రి నే చిక్కన  !కస్తూరి రంగ రంగ !

5.నిన్ను నేనేత్తుకొనెని యే తోవ పోదురా కన్న తండ్రి
నాకేమి భయము లేదే నా నేకేమి కొదువ లేదే  !కస్తూరి రంగ రంగ !

        ***********************************
                                                   4

రామ లాలి మేఘ శ్యామ లాలి
తామరస నయన దశరథ తనయ లాలి ! రామ లాలి!

1. అజ్జవదన ఆటలాడి అలసినావురా
   బొజ్జలోపలరిగేదాక నిదురపోవరా  ! రామ లాలి!

2.జోలపాడి జోకొట్టితే ఆలకించేవు
చాలించమని ఊరుకుంటే సఙ చేసేవు ! రామ లాలి!

3. ఎంతో ఎత్తు మరిగినావు ఏమిసేతురా
  ఇంతోలచేత కక్కలకు ఎంతో కందేవు ! రామ లాలి!

 *****************************************
                                                 5

అలరచంచలమయిన ఆత్మనందుండ నే అలవాటు చేసేనే ఉయ్యాల
పలుమార్లు ఉత్చ్వాస పవనమందుండ నే భావంబు తేలిపేనే ఉయ్యాల

1. ఉదయాస్త శైలంబు లోనకరంబమ్ములై
ఉదుమండల్ము నొంచే ఉయ్యాల
అధన ఆకాశ పథము అద్దద్దులంబయిన
అఖిలంబు నిండేనే ఉయ్యాల   ! ఉయ్యాల !

2. పదిలంబుగా వేదములు బంగారు చేరులై
 పట్టి వేరపై తోచే ఉయ్యాల
వదలకిటు ధర్మ దేవత పీఠమై మిగుల
వర్ణింప నరుడై ఉయ్యాల       ! ఉయ్యాల !

3. మేలు కట్లయి  మీకు మేఘమండల మెల్ల
మెరుగునకు మేరుగామి ఉయ్యాల
నీల శైలము వండ నే మేని కాంతి కి
నిజమై తొడవాయే ఉయ్యాల    ! ఉయ్యాల !

   ****************************************
                                                 6

లాలి లాలి నమ్మ హరియొ లాలి
సుర నరరిగే వలిదు కరుణవ వేరు వదురియీ లాలి

1. రామ లాలి మేఘ శ్యామ లాలి
రమా మనోహర అమిత సద్గుణ ధామ లాలి  ! లాలి లాలి!

2.కృష్ణ లాలి సర్వోత్కృష్ట లాలి
దుష్టర శిక్షచే శిస్టరే పురివ సంతుష్ట లాలి  ! లాలి లాలి!

3. రంగ లాలి మంగళాంగ లాలి
గంగెయ పడిరే తుంగ మహిమ నరసింగే లాలి  ! లాలి లాలి!

4. నంద లాలి గోపి తంద లాలి
 మంధర గిరిధర మధుసూదన ముకుంద లాలి  ! లాలి లాలి!

5. శూర లాలి ప్రాణ ధీర లాలి
మారనయ్య నమ్మ వరపురంధర విఠల లాలి ! లాలి లాలి!


 *****************************************
                                         7

లాలి ముద్దులగుమ్మ లాలి మాయమ్మ
లాలి బంగరు బొమ్మ లాలి సీతమ్మ !లాలి లాలి!

1. నాగలికి దొరికిన  నవమోహనాంగి
మందహాసము తోడు మరి ముద్దు చిలుక

2. రామ రా కమలమున దర్పమున బుట్టి
దశకంఠు   అణగించు అను దీక్ష పట్టి
అసమాన తొట్టేలో కుసుమ పానుపులా
చెలియనిపించవే చెల్లెళ్ళతోను     !లాలి లాలి!

3. ఆట ప్రాయమునాడు హరివిల్లు విరిచి
మాటలో రాముని  సురలు  గొన్నావు
ఎలుక వేశము దాల్చి ఎదుటను నిలిచి
పంపిస్తే రాముని మురిపిస్తివమ్మా  !లాలి ముద్దుల!

 *******************************************
                                                              8

పలుకు తేనేల తల్లి పవ్వళించేను
కలికి తనముల విభుని నలసినది కాదా !2!

1. నిగనిగని మోముపై నెరలు కెలకుల చెదర
పగలైన దాసని చెలి పవ్వళించేను
తెగని పరిణితులతో తెల్లవారిన దాక
జగదేక పతి మనసు జెట్టిగొని కాదా  !పలుకు!


2. మురిపెంబు నటనతో  ముత్యాల వలనుపై
పరవశంబున తరుణి పవ్వళించేను
తిరువేంకటాచల విభుని కౌగిట తలచి
అరవిరై నుదుచెమట అంటినది కాదా   !పలుకు!
                                                                    


దుశ్శాలువా

(ఈ అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతం. ఎవర్ని ఉద్దేశించినవి కాదు.) నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో  కలవటానికి వచ్చిన ఉద్యోగులు సెక్షన్ల ...